జాతకం,సత్కర్మయోగం-వేదాంతం శ్రీపతిశర్మ


జ్యోతిషం    పట్ల  ఆసక్తి  గల  మిత్రులు  కొందరు  సత్కర్మ యోగం  గురించి  వివరించమని  కోరటం  జరిగింది.

జాతకం లో  దశమ  స్థానం  కర్మ స్థానం  అనబడుతుంది.దీని  అధిపతి, రవి  పరిస్థితి,గురుబలం, ఏకాదశ బలం, ఆరూఢ  లగ్నం  బట్టి  జీవితం లో  చేబట్టు  వృత్తిని  గురించి  జ్యోతిష  శాస్త్రవేత్తలు  సామాన్యంగా  చెబుతూ  ఉంటారు. అమ్మవారిని  సత్కార్యాచరణానుకూల హృదయాం, సత్పుణ్యచారిత్రకాం… అని  వర్ణిస్తాం.ఉదయం  నిద్ర  లేచి  ఇలా  ప్రార్థించటం  వలన  ఏ  జాతకులకైనా  సత్కర్మ  చేయాలనిపించవచ్చు! వేదోక్తం  బట్టి  వెళితే  సూర్యుడు  కర్మలను  చేయమని  ప్రేరేపిస్తాడు. సత్కర్మ, సౌఖ్యం, అసత్కర్మ,అసౌఖ్యం,తిరిగి సత్కర్మ …ఇలా    సంకల్పం   అనేది  సత్కర్మ  లేదా  అసత్కర్మ  వలననే  సూక్ష్మంగా  మనం  గుర్తించవచ్చును.’దుష్కర్మఘర్మమపనీయ  చిరాయదూరం  నారాయణప్రణయినీ  నయనాంబువాహ: ‘ అని   కనకధారాస్తవం లో  శ్రీ  శంకరభగవత్పాదులవారు  అమ్మవారిని  ప్రార్థిస్తారు. దుష్కర్మఫలం    దూరం గా  వెళితే  తప్ప  ఈశ్వరానుగ్రహం  లభించదా  లేక  ఈశ్వరానుగ్రహం  వలన  దుష్కర్మఫలం  దూరమవుతుందా? పిల్ల ముందా,  గుడ్డు  ముందా?  మధ్యలో  ఉన్నది  ఉపాసన. అది  కూడా  కర్మయే! అదియే  సత్కర్మ. సత్కార్యాచరణానుకూల  హృదయం  కావాలని  కోరుకోవటం  కూడా సత్కర్మయే! అదియే  ప్రారంభం. ప్రస్తుతానికి  ఈ ఉపోద్ఘాతం   చాలించి  గ్రహాల  దగ్గరకు  వెళదాం…

శుక్రుడు,గురువు   మీనమందు  బలవంతులై  చంద్రుడు  ఉచ్చ  రాశి యందున్న    ఙ్ఞానార్థములు   కలుగుతాయి. కర్మాధిపతి  లాభమందు, లాభాధిపతి  లగ్నమున, శుక్రుడు  దశమమున  ఉన్నాసత్కర్మ  యోగం  ఏర్పడుతుంది. కర్మాధిపతి  కేంద్ర  త్రికోణములయందుండి  ఉచ్చ రాశిలో  ఉన్నా, గురునితో    కలసినా  వీక్షింపబడినా  వ్యక్తి  సత్కర్మనిరతుడుగా  ఉంటాడు. కర్మాధిపతి  లగ్నమున  లగ్నాధిపతితో  ఉండి చంద్రుడు  త్రికోణమందున్నా  సత్కర్మయోగం  అని  చెప్పవచ్చును.

మరి   అటు  వైపు  వెళదాం. శని  నీచగ్రహముతో  కూడి కర్మస్థానమందుండి, కర్మాధిపతి  పాపగ్రహయుక్తుడు  అయినప్పుడు  వ్యక్తి  కర్మహీనుడగును. కర్మాధిపతి    అష్టమమున  ఉండి  అష్టమాధిపతి  కర్మమందున్నా, పాపగ్రహ యుక్తుడైనా  వ్యక్తి  దుష్కర్మములయందు    ఆసక్తుడవుతాడు.
కర్మాధిపతి  నీచరాశియందుండి   పాపగ్రహము  కర్మస్థానమందుండి, దశమము  నుండి  దశమమున-అనగా  సప్తమమున  పాపగ్రహమున్నప్పుడు  వ్యక్తి  కర్మభ్రష్టుడవగలడు. ఏది  చేపట్టినా  కలసి  రాకపోవటం  ఈ  విధంగా  అర్థమవుతుంది…

ఇక్కడ  చెప్పినవి  జాతకం, నవాంశ, ఇతర     యోగాలు  అన్నీ  పరిఈలించి  చూడాలి. అంటే  సమగ్రంగా  పరీక్షించాలి. తొందర  పడి  ఒక నిర్ణయానికి  రాకూడదు. బేలసులు, కౌంటర్ బాలెన్సులు  చాలా  ఉంటాయని  మనవి! ఇవి  ప్రధానమైన  విషయాలు మాత్రమే!

కర్మభ్రష్టులు-ఏది  చేసినా  కలసి  రావటం  లేదు  అని  ఒక  వేళ   మంచి  సిధ్ధాంతి గారు  కూడా   నిర్ధారిస్తే   కిం  కర్తవ్యం?
దారి  ఉన్నదా? అనే  ఆలోచన  కలుగవచ్చు. పైన  చెప్పినట్లు  చెడు  రక్తానికి  విరుగుడు  మంచి  రక్తమే! ఒక  రకం  రక్తం  పూర్తిగా  తీసేసి  కొత్త  రక్తం  ఎక్కించలేరు. జీవితం   సాగుతూనే  ఉంటుంది.కర్మలు, కర్మఫలాలు, మరో  కర్మరూపమైన  కర్మఫలం, ఇలా  అన్నీ  కలసి  అలా  పోతూనే  ఉంటాయి.సత్కర్మయే    మన    ఆయుధం.

దాని  సంకల్పమే    శంఖారావం. పరిష్కారమార్గాల    గురించి  తిరుగు టపా  (పోస్ట్) లో  చర్చించగలము!

హరి ఓం  తత్ సత్!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

26 thoughts on “జాతకం,సత్కర్మయోగం-వేదాంతం శ్రీపతిశర్మ

  1. జన్మకుండలి లో గ్రహ గతులు, ప్రస్తుత గ్రహగతులు, చంద్ర / సూర్య రాశుల ఆధారంగా , లగ్న ఆధారంగా, గ్రహనికి గ్రహాధిపతికి వున్న సఖ్యత, సవ్య అపసవ్య .. ఇలా ఇన్ని కాంబినేషన్లలో దేనికి ప్రాముక్యత ఇస్తారు.
    ఒకటి తప్పైతే , మరో ఆధారంగా నిజమవవచ్చు కదా? దయచేసి వివరించగలరు.

    రాశి, లగ్నాల ప్రకారం గ్రహాలు వేరు వేరు ఇళ్ళలో గ్రహసంచారం జరిగే అవకాశాలున్నప్పుడు మనకు ఏది సరిపోతే అది తీసేసుకోవడమేనా?

    1. అనామకుల వారికి-

      లగ్నం,రాశి, భావం,భావ మధ్యమం,స్ఫుటం …ఇలాంటి అంశాల మీద తమరు అధ్యయనం చేయవలసి యున్నది.సందర్భాన్ని బట్టి దేని ప్రాముఖ్యత దానిది.ఏది వీలో అది అని ఏ మాత్రం కాదు.

      ‘స్థానం ‘-దశమం అన్నప్పుడు అది లగ్నాత్ అనగా లగ్నం నుంచే అని అర్థం. రైలు ఎక్కడినుండి బయలు దేరి ఎక్కడికి వెళుతున్నా యాత్రికుడికి తాను బండీ ఎక్కిన స్టేషనే ముఖ్యం. కాలం అనంతం గా ఎక్కడినుండో ఎక్కడికో ప్రయాణిస్తున్నప్పటికీ తల్లి గర్భం ఉండి శీర్షోదయం జరిగే సమయానికి ఏర్పడు లగ్నమే ప్రధానం.జీవనయానం యావత్తూ చాలా మటుకు దీని మీదనే ఆధారపడి ఉంటుంది.

      సత్కర్మయోగం గురించి చెబుతున్నప్పుడు దశమ స్థానం ఇత్యాదులు ల్గ్నం నుంచే వివరించటమైనది.
      చంద్రుని బట్టి లెక్కించే యోగాల గురించి చర్చించినప్పుడు ఆ సంగతి స్పష్టంగా చెప్పటం జరుగుతుంది.

      ~వేదాంతం శ్రీపతిశర్మ

  2. నమస్కారండి
    నాకు బాగా కావాల్సిన వ్యక్తి (పేరు:మునేందర్ age :21 ) మూలా నక్షత్రం నందు పుట్టాడు మరియు అతనికి పుట్టుకతోనే రెండు చెవులకు రెండు రంద్రాలు ఉన్నాయి.వాటి అర్థం ఏమిటి మరియు అతని భవిష్యత్ ఎలా ఉంటుంది

వ్యాఖ్యానించండి