వ్యక్తులూ,వ్యవస్థలు-వేదాంతం శ్రీపతిశర్మ


ఇండియన్ ఎక్ష్ ప్రెస్  పది  అతి శక్తివంతులయిన  భారతీయులను  ఇటీవల  పేర్కొంది. ఆ  జాబితా  ఇలా  ఉంది (క్రమంలో)

1. రాహుల్  గాంధి -ఈయన  గత  సంవత్సరం  లిస్టు లో  లాగానే  ఈ  స్థానం  ఆక్రమించి యున్నాడు.
2. డాక్టర్  మన్ మోహన్ సింగ్ గారు  ఒక  స్థానం  పైకి  వచ్చారు
3. సోనియా  గాంధి -ఈవిడ  ఒక  స్థానం  కిందకి  దిగింది
4. పి. చిదంబరం-ఈయన  ఆ  లుంగీ తోనే   అయిదు  స్థానాలు   పైకి   ఎక్కాడు!
5.    ప్రణబ్  ముఖర్జీ-అదే  స్థానం లో ఉన్నాడు
6. మోహన్ రావ్  భాగవత్ (ఆర్.ఎస్.ఎస్)-ఈయన  కొత్తగా  స్థానం  సంపాదించుకున్నాడు
7. నితిన్    గడ్  కరి-ఈయన  కొత్తగా  చేరాడు
8. మమత  బెనర్జీ-ఈవిడ  ఇరవై  స్థానాలు   పైకి   ఎక్కింది
9.   నరేంద్ర  మోది-ఒక  స్థానం  పైకి వచ్చాడు
10.అహ్మద్  పటేల్-ఈయన  కూడా  ఒక  స్థానం   పైకి వచ్చాడు

ఈ  పేర్లన్నీ  చర్చించే  ముందు  చిత్రంగా  తోచిందేమిటంటే  చిదంబరం    గారు   ఎలా  తోసుకొస్తున్నారు   అని. తెలంగాణా  వ్యవహారం లో  ఈయన  మాట్లాడిన  మాటలకి  చాల చోట్ల  -జాతీయ  పేపర్లలో  కూడా  హాస్యాస్పదమైన  వ్యాసాలు  వచ్చాయి.రాజ్య  సభ లో  టెలిఫోన్ టాపింగు  వ్యవహారంలో  ఒక  చర్చ  జరిగింది.ప్రభుత్వానికి  ఏమీ  సంబంధం  లేదంటూనే  కొన్ని  అత్యవసర  పరిస్థితులలో    అలా  అద్దాల  సైజులో  ఉన్న  కళ్లజోడులోంచి  తొంగి చూస్తూ  చెప్పారు. (ఒక  వేళ  ఏదయినా  బయట  పడితే  దాని  కింద  దక్కోవాలని  గామోసు).అరుణ్  జెయిట్లీ  గారు  ఆ    అత్యవసర  పరిస్థితుల  మీద  చర్చ  ప్రారంభించి  సురీం  కోర్టు  తీర్పు  గిరించి  ప్రస్తావించారు. ఆ   తీర్పు  ఆర్థిక  ఎమర్జన్సీ  గురించి  ఉన్నది. అందులో  ఆదాయం   పన్ను  కట్టని  వారి  వ్యవహారం    మీద  టెలిఫోన్  టాపింగు  చేయవచ్చు  అని  చెప్పారు. ఇలా  విచ్చలవిడిగా  కాదు  అని  తేలిపోయినపుడు  ఈయన  సరైన  సమాధానం  చెప్పలేకపోయాడు. కాంగ్రెస్ లో  తొందరపాటు  సంభాషణ  ఎక్కువ. ఒక  దొంగ  భుజాలు  తడుముకున్నట్లే  ఉంటుంది. శ్రీ శ్రీ  రవిశంకర్  గారి  కారు  మీద  ఎవరో  గన్ తో  పేల్చారనగానే  అది  ఆ ఆశ్రమం  లోని  ఆంతరంగికమైన  మనుషుల  మధ్య  ఘర్షణ  అని  ఢిల్లీ  నుండే  వాగేశారు  మన  గృహ మంత్రి  గారు!ఇటీవల  ఎవరో  రైతు  కుక్కలను  చంపాలనుకుని  గన్నుతో  పేల్చాడట అని  పోలీసు  వర్గాలు  తెలుపుతున్నారు.

భోపాల్  వ్యవహారం లో  వింత  వింత   నిజాలు   బయటకు  వస్తున్నాయి  మరి.ఈ  లిస్టు  రానున్న  రోజులలో  ఎలా  మారుతుందో  చూడాలి…

మన  రాజకీయాల  మీద   ఈ  వ్యక్తులు  చూపే   ప్రభావం, వారు  ఎందుకు  అలా  చూపగలుగుతున్నారు, మన వ్యవస్థ  ఇలా  ఎందుకు  సాగిపోతోందీ  అనే  అంశాలు  చర్చించుకో వలసినవే…

వీలు    వెంట  చర్చలోకి  మరల  వద్దాం!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

వ్యాఖ్యానించండి