మీ బౌలింగ్, మీ బాటింగ్, నా ఫీల్డింగ్ (2)-వేదాంతం శ్రీపతి శర్మ

ప్రపంచ ఆర్థిక మాంద్యం, మన ఆర్థిక సమస్యలు-ఈ నేపథ్యం లో రాబోయే కొఏలిషన్ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అలవర్చుకోవాలి, ఎటువంటి మౌలిక సమన్వయ సిధ్ధాంతాలు పాటించాలి అనేది ఈ రోజు చర్చనీయాంశం.
మీకు ఎటువంటి దృశ్యం కనిపిస్తున్నది?

మీ బౌలింగ్, మీ బేటింగ్, నా ఫీల్డింగ్!-వేదాంతం శ్రీపతి శర్మ

సుబ్బరావు ఒక కాగితం పట్టుకుని కూర్చున్నాడు.

‘ ఏమైంది?’, అడిగాను.

‘ ఇంకా కాలేదు! ఒక్క రోజులో వంద మందిని పీకేశారు.’

‘ ఎందుకు? ‘

‘ ప్రపంచ ఆర్థిక మాంద్యం.రేపు ఎలా ఉంటుందో

తలచుకుంటే భయంగ ఉంది ‘

‘ వ్యాపారం అంటే ఎల్ల వేళలా లాభాలే ఆర్జించాలని ఎక్కడుంది?

ఒక సంస్థకు -కంపెనీ ఏక్ట్ ద్వారా ఏర్పడిన సంస్థకు కొన్ని నిర్దిష్టమైన పధ్ధతులు ఉంటాయి. ఒక పరికరాన్ని వాడుకున్నట్లు వాడుకుని  పారేయటం సబబేనా?’

‘ తెలియదు! ఇలా గతంలో జరిగిందా? ఏమో!’

‘ ఎన్నైనా చెప్పండి. ఇది ఆరోగ్యకరమైన కంపనీ ప్రాక్టీసు కాదు. కష్ట సమయంలో బండీ నడుపుకునే ప్రసాధనాన్ని ఈ బ్లూ చిప్పులు కూడా దగ్గర పెట్టుకోలేదంటే ఆలోచించవలసిన విషయం. అసలు ఏమి జరుగుతోంది?’

~~~***~~~

ఏవంటారు బ్లాగ్ స్టార్స్?

Follow

Get every new post delivered to your Inbox.