ఘటన

టిం బర్నర్స్ డాక్యుమెంట్లను లింకు చేసి శాస్త్రఙ్ఞులకు డేటా పంచుకునే విధంగా పని చేస్తూ ఒక మార్గాన్ని కనిపెట్టి ‘ఇంఫొమెష్ ‘,’ఇంఫర్మేషన్ మైన్ ‘అంటూ పేర్లు పెట్టాడు.ఆయన పైన వారు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ‘ఇది వేగ్ గా ఉంది,కానీ ఎక్సైటింగ్ గా ఉంది ‘ అన్నారుట!
ఆయన దానిని ఒక ఎలక్ట్రానిక్ న్యూస్ బులెటిన్ లో పెట్టాడు.మొదటి బ్రౌసర్ మొదటి వెబ్ సైట్  http://info.cern.ch నుండి బర్నర్ కంప్యూటర్ నుండిఆగస్ట్ 6, 1991 కు 2.56.20 పి.ఎం కు డౌన్ లోడ్ అయింది.
తరువాతది చరిత్ర!

బర్నర్స్ అన్న మాట ఇంకా ఆసక్తికరంగా ఉంది.న్యూస్ రూం  లో పెట్టటం వలన అందరూ చదవటం వలన ఇది బయటకు వచ్చింది అన్నాడు! ప్రపంచంలో అందరూ అన్నీ తెలుసుకునే సాధనం ఆ విధంగానే ఇవతలకి రావాలన్నది సహజమైన న్యాయం కాబోలు!

అమితాభ్ బచ్చన్ ఆల్ ఇండియా రేడియోకి వెళ్లి వాయిస్ టెస్టులో కూర్చున్నాడు. నీ గొంతు చాలా బలహీనంగా ఉంది అన్నారు  వారు! అప్పటికి వాళ్లు ఊహించి ఉండరు. ఆ గొంతు మన దేశానికే ఒక బలహీనత అయిపోతుందని!

~~~***~~~

Follow

Get every new post delivered to your Inbox.