ఈ రాష్ట్రం లో ప్రభుత్వం ఉన్నదా?

ముప్పయి మూడు లోక్ సభ సభ్యులను కాంగ్రెస్ జెండా క్రింద పంపిన రాష్ట్రం.అగ్ర రాష్ట్రాలలో ఒకటైన రాష్ట్రం.విస్తీర్ణం లో నాలుగో అతి పెద్ద రాష్ట్రం.దేశం లో జి.డి.పీ విషయంలో నాలుగో స్థానం లో ఉన్న రాష్ట్రం.జనాభాలో అయిదవ స్థానంలో ఉన్న రాష్ట్రం.పన్నుల  నుండి ఆదాయం లో మహారాష్ట్ర తరువాత రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం (323369 కోట్లు).రెండున్నర కోట్ల వోటర్లు 2009 లో (రెండవ స్థానం)వోట్లు వేసిన రాష్ట్రం…

వరదల వలన 50 లక్షల ఎకరాలు నాశనం అయితే కేంద్రం నుండి ప్రధానమంత్రి ఎందుకు రాడు?జాతీయ విపత్తుగా పరిగణించరా?400 కోట్లు ఇచ్చి పొమ్మంటారా?అది పట్టుకుని ముఖ్య మంత్రి ఉపదేశాలు చేస్తాడా?

70% వ్యవసాయ కూలీలి వ్యవస్థీకృతులుగా లేని కూలీలు. వీరి పరిస్థితి ఏమిటి? రెండు వందలకు దగ్గరలో ఇప్పటికే ఆత్మహత్యలు జరిగిపోయాయి.2గి స్కాం లో సి.ఎ.జి అంచనా లక్షన్నర కోట్లు!

మైనారిటీ ప్రభుత్వాలు ప్రారంభం అయినప్పుడు పి.వి.గారు నడిపిన అయిదు సంవత్సరాలలో రిఫారంస్ నేపథ్యం లో మంత్రిగా పని చేసిన మనమోహనుడు పి.వి గారి మీద రక రకాల కేసులు నమోదయినప్పుడు ప్లీనరీలో ఆయనను ‘కం క్లీణ్ అని చెప్పటం జరిగింది.సీతారాం కేసరీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ముందుకు వచ్చాడు. జె.ఎం.ఎం కేసు హార్స్ ట్రేడింగ్ గోల వేడిగా ఉన్న సమయం!

డి.ఎం.కె సపోర్ట్ నేపథ్యం లో రాజా వారిని మరి కాపాడుకుంటూ వచ్చినందుకు సుప్రీం వేసిన వేటు ఈ ప్రధానిని తాకదా? (అ)ప్రధానులు నేను మిస్టర్ క్లీన్ అంటూ ఒక ఇమేజ్ పెట్టుకుంటే సరిపోదు.’షరాఫత్ కా షౌక్ ‘ అందరికీ ఉంటుంది.కీలకమైన స్థానం లో కూర్చున్న వాడు ఒక దురాగతం చేస్తేనే దుర్మార్గుడు అవుతాడనుకోవటం పొరపాటు. సరైన సమయానికి ఒక చర్య తీసుకోపోవటం కూడా క్షమించరాని నేరమే!

ఆంధ్రకు వస్తే ఈ గడ్డపాయనకు అసలేమీ అక్కరలేదు.కేంద్ర బృందం కూడా మెల్లగా కాళ్లీడుస్తూ వస్తుందట!ఎందుకు రావాలి? ఇక్కడ పురుష పుంగవులు ఎవరూ లేరని చాలా కాలం క్రిందటే తేల్చేసారు మరి!

ప్రభుత్వమా? అదెలా ఉంటుంది? అనడిగే రోజులివి!

~~~***~~~

ఫొటో జవాబు

మోతీలాల్ బోరా, అశోక్ గహ్లోట్

వీరిని నిద్ర పుచ్చుతున్నది (అ)ప్రధాని ఆయన ఉపన్యాసం ద్వారా!

 

Follow

Get every new post delivered to your Inbox.