ఫొటో జవాబు
20 డిసెం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

మార్క్ జుకర్ బర్గ్-ఫేస్ బుక్ స్థాపించిన వ్యక్తి.ఈ సంవత్సరం ‘టైం ‘ మాన్ ఆఫ్ ద ఇయర్ గా వార్తలలోకి వచ్చాడు.
ఈయన ఎడ్యూఅర్డో సావెరిన్,డస్తిన్ మోస్కోవిట్జ్,క్రిస్ హ్యూజ్స్ తో కలసి 2004 లో ఈ సోషల్ నెట్ వర్క్ ను ప్రారంభించాడు.
సరైన సమాధానం ఇచ్చిన వారు:
Observer
lndurvasula@gmail.com
యూరోపియన్ యూనియన్ తో భారత్ ఒప్పందం
20 డిసెం 2010 వ్యాఖ్యానించండి
in వార్తాలాపం

ఇటీవల యూరోపియన్ యూనియన్ తో తీవ్రవాదం అంశం మీద భారత్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం:
1. తీవ్రవాద సంస్థల స్థావరాలకు విరుధ్ధంగా, తీవ్రవాదుల రాకపోకలను పట్టుకొనే విధంగా సంయుక్త చర్యలకు వీలుగా కొన్ని నియమాలు సృష్టించటం
2. తీవ్రవాదులకు ఆర్థిక వనరుల సదుపాయానికి విరుధ్ధంగా చర్యలు
3. స్ట్రాటజిక్ ఇంఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకోవటం
4. పరస్పర న్యాయ సహకారం-ఎక్స్ట్రద్షన్ ఇత్యాదులు
5. అంతర్జాతీయ సివిల్ ఎవియేషన్ లో,ప్రయాణాలలో విధానాలలో,ఇ-మెయిల్ ఇత్యాదులలో సహకారం
6. ఐడెంటిటీ కార్డులు-పాస్ పోర్టులు ఇత్యాదులలో మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఆస్కారం
7. ఫైనాన్షియల్ ఏక్షన్ టాస్క్ ఫోర్స్ లో సభ్యులకు సదుపాయాలు-తీవ్రవాదులకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ లు జరగకుండా కొన్ని చర్యలు.
డిసెంబర్ 10 న బ్రసెల్స్ లో ఈ ఒప్పందం జరిగింది.
బాగుంది.తాజ్ మహల్ అటాక్ విషయం లో సూరత్ దగ్గర కోస్ట్ గార్డ్ వారితో తలపడి ముంబయి దాకా వచ్చిన తీవ్రవాదుల విషయంలో కోస్ట్ గార్డ్ వారు ఇంత సేపు ఏమి చేసారు అనే ప్రశ్నకు ముందుగా సమాధానం ఇచ్చుకుని భారత్ ముందుకు సాగితే బాగుంటుంది.
ఆర్థికపరమైన అంశలకు వస్తే ఈ దేశాన్ని అమ్ముకునే వారు ఇక్కడే ఎక్కువ ఉన్నారన్నది పెద్ద సంచలన వార్త కాదు. ఇంత అరాచకం, ఇంత తీవ్రవాదం ఈ వ్యవస్థలో ఇంతగా ఇమిడిపోవటానికి కారణం మన వ్యవస్థలను నడిపే మన వాళ్లు కారా అనే ప్రశ్న ప్రతి పౌరునికీ రాక మానదు!
చిదంబరం కూడా కొద్దిగా ఆలోచించాలి.
~~~***~~~

ఇటీవలి అభిప్రాయములు