ఇది ఏ ఆత్మరక్షణ పధ్ధతి?Which self-defense style is this?
30 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

ఫొటో జవాబు
30 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

కాంకన్,మెక్సికో లో 194 దేశాలు పాల్గొంటున్న క్లైమేట్ సమ్మిట్
ఈ సందేశాన్ని ఆక్స్ఫాం అనే సంస్థ కార్యకర్తలు తయారు చేసారు
Climate Summit at Cancun being attended by 194 countries. This message has been placed by activists of ‘Oxfam’
జగన్ ‘కాఫీహౌస్’ చెస్!
29 నవం 2010 అభిప్రాయములు
in వార్తాలాపం

చదరంగం ఆటతో పరిచయం ఉన్న వాళ్లు ఈ రకమైన ఆటను గుర్తు పట్టగలరు.ఆటలోకి దింపి నువ్వాడింది తప్పు అని నిరూపిస్తూ రిస్కులు తీసుకుంటూ ఆటను ఫోర్స్ చేస్తాడు ఆటగాడు.ఈ పధ్ధతిలోనే తెరవాట-తెరచి రాజు అనే పధ్ధతి కూడా ఉన్నది.
నిజమే! రిస్కు తీసుకోలేకపోతే ఆటా లేదు, పాటా లేదు!ఆంధ్ర ప్రదేశ్ లో అసలు ఏమిటి పరిస్థితి అనేది సోనియాకు ఆ ముగ్గురూ ఏదో చెబితే,ఒక్క పూట కూడా రాష్ట్రానికి రాని మేధావులు ఏదో కూస్తే, సినిమా హాలు బయట బ్లాక్ లో టికట్లు అమ్ముకునే వాడిలా కనిపించే వీరప్ప మొయిలీ విశ్లేషణలు చెబితే ఓ మేధావి లాగా ఒక మహారాణిలాగా కూర్చుని ఆవిడ నిర్ణయాలు తీసుకుంటోంది!
కొన్ని సంవత్సరాల క్రితం ఇదే సోనియా ఒక లిస్టు తీసుకుని అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ వద్దకు వెళ్లింది.అప్పటి అతిపెద్ద చంచా అర్జున్ సింగ్ ఇచ్చిన సలహా అది.సంతకాలేవి? అన్నాడాయన.వెనక్కి వచ్చి ‘తప్పుగా చెప్పావు.అడక్కూడనిదే అడిగాడు. అవతలికి పో!’,అన్నది.
ములాయం సింగ్ వరండాలో కూర్చున్నాడు.సోనియా నీ సపోర్ట్ కోరుకుంటోంది అని వర్తమానం తీసుకుని వచ్చాడు ఒకాయన.’ఆమెనే రమ్మను ‘,అన్నాడాయన!
ఎవరి అభిమానం వారికుంటుంది.
ప్రజారాజ్యం పార్టీ సమావేశమయ్యి మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పే అవసరం ఎందుకొచ్చింది? ఇప్పుడు కాదా? అంటే ఢిల్లీకి పిలిపిచుకుని మంతనాలు జరపటం వాస్తవమే కదా? ఆంధ్రుల అభిమాన మెగాస్టార్ రాజకీయ పరిణతి ఉంటే చేయవలసిన పనేనా ఇది?
రోషయ్య మహాశయుడు దిగిపోయిన సందర్భంగా ఆ నలుగురూ ఢిల్లీ నుంచి వచ్చి పార్టీ అధినేతకు ముఖ్యమంత్రి సంగతి వదిలేస్తున్నామని సి.ఎల్.పి చేత తీర్మానం చేయించి తెలుగు వారు అటు ఆడా,ఇటు మగా కాని మాడా లాంటివారని వెక్కిరింతగా అందరికీ చెప్పి అవతలికి వెళ్లిపోతే సిగ్గుగా లేదూ…దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పటికీ వీళ్లు ఏదో గర్వపడే మాట లాగా ఆవిడ పెట్టిన భిక్ష, శునకాల్లాగా తోక ఆడిస్తూనే ఉంటామని మాట్లాడతారు.
మీ మొహాలు మండ!మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు. సోనియా కాదు.పార్టీ అంతర్గత వ్యవహారాలతో ప్రజలకు సంబంధం లేదు.ఈ నేల తెలుగు వాడిది.మరొకడు వచ్చి ఇక్కడి ఈడియట్స్ ను ఆడుకుని వెళ్లిపోతుంటే ఇంత కాలం జరిగిపోయింది.కాలం మారింది.నాలుగో క్లాసు కుర్రాడిని అడిగినా నవ్విపోతాడు!
అశ్వథ్థామ పిండి పాలు త్రాగుతుంటే పిల్లలు సాటి పిల్లలు నవ్వి ఆట పట్టించారు.ద్రోణుడు మిత్రుని వద్దకు వెళ్లి భంగ పడ్డాడు…తరువాత జరిగింది సామాన్యమైన కథ కాదు!
33 ఎం.పీలను ఇచ్చి కాంగ్రెస్ ను సంతోషకరమైన స్థితిలో పెట్టిన వై.ఎస్. భార్య ఆమె కుమారుడు, ప్రజలు ఎన్నుకున్న జగన్ తో ఢిల్లీ వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఏమి చేస్తోందండీ?ఎవరి తల్లికి అవమానం జరిగితే ఎవరూరుకుంటారు?
చెస్ ఆట తెలిసిన వారికి ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది.ఆటలోకి దిగి ఊబిలోకి దిగబడి ఇంకొకరి ఆటలో ఆడుతున్నామని తెలియక ఆడుతున్న ఈ చెత్త అధిష్ఠానం ఏ నాడో ఓడిపోయిందని చాలా మందికి తెలుసు!
ఏది ఏమయినా జరుగుతున్న రాజకీయ పరిణామాలలో ఒక మంచి అంశం ఉన్నది.ప్రజలలోకి స్వతంత్రంగా వెళ్లి కాంగ్రెస్ తో సంబంధం లేకుండా వేరే పార్టీ జెండా మీద జగన్ ప్రజల మన్ననలు పొందితే కనుక అది దేశ ప్రజాస్వామ్యానికే ఆరోగ్యకరమైన విషయం.
రాహుల్ గాంధీ కూడా కొద్దిగా యోచన చేయవలసి ఉన్నది!
~~~***~~~
ఇది ఏ సమావేశానికి సంబంధించిన సందేశం?This message is connected to which Summit?
29 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

ఫొటో జవాబు
29 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!
ఆర్.డి.ఓ కార్యాలయం,అమలాపురం
The R.D.O office, Amalapuram
పచ్చని చిలుకలు తోడుంటే…
28 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీగీతం
Bass సౌండ్ అంటే ఏమిటని ఒకాయన ఒక సౌండ్ ఇంజనియర్ ని అడిగాడు. ఆయన ఎన్నో రకాలుగా చెబుతున్నాడు.ప్రక్కనే కూర్చున్నాయన ఒక మాట అన్నాడు.’సార్, యేసుదాస్ గారి గొంతు విన్నారు కదా? అది Boss మైక్ లేకుండా Bass సౌండ్ అంటే!’
నిజమే! చక్కని సాహిత్యం(తమిళం లోంచి అనువదించినా ఈ పదాలు అందరికీ దొరకాలిగా?)
చక్కని సంగీతం,చాలా సృజనాత్మకంగా చిత్రీకరించిన పాట ఇది.ముఖ్యంగా ఈ చిత్రం లో చాలా సరైన సమయం లో చూపించిన పాట.రెండు చోట్ల యేసుదాస్ ముద్ర కనిపిస్తుంది.’చెలియ ‘ అని పలికినప్పుడు,’ఇతరులకై కను జారే కన్నీరే ఆనందం ఆనందం ‘ అన్నప్పుడు.కన్నీరు జారి పడినట్లే ఉంటుంది…
~~~***~~~
ఇది ఏ భవనం? ఎక్కడుంది?Identify this building and the place
28 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

ఫొటో జవాబు
28 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

బ్రూస్ లీ
సరైన సమాధానం ఇచ్చిన వారు:
kamal
kamal@gmail.com
raju
kunadha@gmaill.com
హాంగ్ కాంగ్ ఫొటో ఉదయం,సాయంత్రం
27 నవం 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!
ఈ క్రింది లింకును క్లిక్ చేసి కర్సర్ ను ఫొటో పైనుంచి క్రిందకి జరపండి.ఉదయం, సాయంత్రం రంగులు మారుతాయి…

ఇటీవలి అభిప్రాయములు