దృష్టిపూతం …చూసి కూర్చోండి!
30 అక్టో 2010 అభిప్రాయములు
in వార్తాలాపం
ఇటీవల ఒక పెళ్లి నిశ్చయమైన అమ్మాయికి సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఒక సూది గుచ్చుకుంది.దానికి ఒక టాగ్ ఉంది-ఎచ్.ఐ.వి కి స్వాగతం అని దాని మీద ఉన్నది.ఆమె ఆ షాక్ తోనే నాలుగు నెలలలో కన్ను మూసింది.
ఈ కొత్త రకం బాధింపు ప్రారంభమయిందని చాలా చోట్ల చెబుతున్నారు.ఇది ఆట కాదు. ఇలా దొరికిన సూదులన్నీ ఎచ్.ఐ.వి పాసిటివ్ అని వైద్యులు చెబుతునారు.
మిత్రులకు మనవి. సర్వజనిక ప్రదేశాలలో ఒక సారి గట్టిగా పరీక్షించుకోకుండా ఆసీనులు కాకండి.చీకటిగా ఉన్న హాళ్లల్లో,సినిమా ప్రారంభమయిన తరువాత లోనకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.చాలా తేలికగా ప్రాణాలు తీసే ప్రక్రియ ఇది.
దయ చేసి మిత్రులకు ఈ మాట తెలియజేయండి…
~~~***~~~
అక్టో 30, 2010 @ 21:39:31
ఎందుకు మనుషులు ఇంత ఘోరంగా తయారవుతున్నారు?
అక్టో 31, 2010 @ 08:31:10
మూణ్ణాలుగేళ్ళ కిందటనుకుంటాను.. అమెరికాలో థియేటర్లలోను (సీటుకు), గ్యాసు స్టేషన్లలోనూ (ఫిల్లింగు గన్ హ్యాండిలు కింద) ఇలాంటి హెచ్చైవీ సూదులు పెడుతున్నారని ఈమెయిళ్ళు షికారు చేసాయి. తరవాత అది హోక్సని తేలింది. ఇదీ ఆ బాపతని చెప్పలేనుగానీ కాదని కూడా చెప్పలేం.
అక్టో 31, 2010 @ 13:30:14
manushullo swartham perigi mana, para bedham lekunda pravarthinche vidhanga chestondi. Rakshashatwam peragadaniki dabbu kuda karanamavutondi. manushula korikalu, asuyaa dweshalu mithimeeri manushulu ghoranga marutunnaru