ప్రేమ పిచ్చిది కాదు!
28 అక్టో 2010 1 వ్యాఖ్య
in వార్తాలాపం

ప్రేమ వ్యవహారాల మీద ఫంక్షనల్ మేగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ కొన్ని విషయాలను చెబుతోంది…
ప్రేమలో పడటానికి మెదడు ఒక క్షణం లోని అయిదవ భాగం సమయం తిసుకుంటుందట! అంతే! అంతా అక్కడే అయిపోతోంది మరి…
ఈ ప్రక్రియలో మెదడులోని 12 ప్రాంతాలు పని చేస్తాయిట-అవి డొపమైన్, ఆక్సీటాసిన్,ఎడ్రినలిన్,వేసోప్రెసిన్, కొకైన్ వంటి మత్తు పదార్థాలను ఒక్క సారి విడుదల చేస్తాయని తెలుస్తోంది…ప్రేమ బలే మత్తు మరి!
ఇది మనిషి మేధా శక్తిని, మెటఫర్ ను ప్రభావితం చేస్తుంది. వర్జినియా ఊనివర్సిటీ వారు న్యూరో ఇమేజింగ్ ద్వారా కనుక్కొన్నదాని బట్టి ప్రేమ అనేది ఆరోగ్యానికి, అవసరం చాలా మంచిది కూడా అని చెబుతున్నారు.
షరతులు లేని ప్రేమ (తల్లి బిడ్డ మధ్య) మెదడులోని మధ్యభాగాన్ని ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది. మిగతా రకం రక రకాల భాగాలను ప్రభావితం చేస్తున్నదని చెబుతున్నారు.
ప్రేమలో పడ్డవారిలో నర్వ్ గ్రోత్ ఫేక్టర్ బాగుంటుంది.
మిత్రులారా…ప్రేమ పిచ్చిది కాదు, గుడ్డిది అంతకంటే కాదు.ప్రేమే దైవం…ప్రేమ ఒక శక్తి! కామం ఖచ్చితంగా గుడ్డిది! దాని పర్యవసానాలు వేరు.
~~~***~~~
అక్టో 28, 2010 @ 07:08:30
baagaa chepparu