ముర్దా పరస్తోంకి బస్తీ…!

‘చావంటే భయం లేదా ‘అని ఒక రచయితకు అతని చివరి దశలో వినిపించిందట!
అతను నవ్వాడు.’చాలా గర్వ పడుతున్నట్లున్నావు? నన్ను చంపుకుని తినబోతున్నావనుకునా?’
‘నీ ఖర్మకు నాకు గర్వమెందుకు?’
‘అలా రా దారికి! ఇదేదో భూతలస్వర్గం కాదు.ఇది సచ్చినోళ్ల లోకం, సచ్చేటోళ్ల లోకం.కొత్తగా చంపుకు తినేందుకు ఏమీ లేదు!’
‘అంత అసహ్యంగా ఉన్నదా?’
‘ధైర్యంగా చెబుతాను! ఈ సృష్టి ఎంత అందమయిందో అంత ఘోరమైనది!నువ్వెవరివో ఎలాగో అర్త్
హం  కాదు కానీ ఎంత గొప్ప కళాకారుడివో అంత గొప్ప సాడిస్టువి!నీ రచన యావత్తూ పిచ్చి గీతల  మాడర్న్ ఆర్ట్! ‘
‘ఇంతకీ నీ సంగతేమిటి?’
‘నా సంగతేమీ లేదు!ఈ లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాడు నిన్ను కూడా వ్యంగ్యంగానే చూస్తాడు. పద! నీ మీద ఒక కథ వ్రాసుకుంటాను…’

~~~***~~~

గురు దత్త్ సమాజాన్ని ప్రశ్నించిన తీరు చరిత్రలో నిలచిపోయింది!  పతాక స్థాయిలో ప్రదర్శించిన పాటలో కొన్ని విశేషాలున్నాయి.కథలోని పాత్రలన్నీ సమావేశమయ్యాయి.ఒక్కో మాటకు ఒక్కో పాత్ర మీద ఫోకస్, గురు దత్త్ ఎంట్రీ, ఆయన మీద వెలుగు నీడల మార్పులు,మధ్యలో వహీదా రహ్మాన్ హావ భావాలు…ఈ పాట చెత్త మనుషుల వ్యవహారం, చెత్త సమాజం…రెండిటినీ   చెప్పుచ్చుకుని కొట్టిన పాట!
ఒక క్లైమాక్స్ లో ఉండవలసిన దినుసులన్నీ ప్రదర్శనలో దర్శకుడు ఒక సిలబస్ లా చూపిస్తాడు.

చిత్రం: ప్యాసా, రచన: సాహిర్ లుధియాన్వీ,సంగీతం: ఎస్.డి బర్మన్

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.