గ్రీన్ కాంబాట్స్!
28 జూన్ 2010 1 వ్యాఖ్య
in వార్తాలాపం
లక్నవ్ లో ఒక విద్యాలయం లోని పదిహేను విద్యార్థులు వాళ్ల పాకెట్ మనీతో మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది.తెలీబాఘ్ ప్రాంతం లోని ఈ పిల్లలు వరుసనే చాలా మందిని ఇందులోకి దింపారు. వీళ్లల్లో నచ్చిన విషయం ఏమిటంటే రోజూ ఒక చోట కలుసుకుని స్కూల్లో చెప్పిన అంశాలను చర్చించుకుంటారుట! అటు వంటి ఒక చర్చలో పర్యావరణం గురించి చర్చించి వెంటనే ఏమి చేయాలి అని యోచించి ఇలా ముందుకు వెళ్లారు!
లక్నవ్ లో ఉన్న చెంట్రల్ డ్రగ్ సిరచ్ ఇన్స్టిట్యూట్ లోని సీనియర్ సైంటిస్ట్ ప్రదీప్ కుమార్ కు కొందరు డాక్టర్ల ద్వారా ఈ సంగతి తెలిసి ఆయన స్వయంగా ఇందులో చేరారు. దీనికి ఆయన ‘గ్రీన్ కాంబాట్స్ ‘అని నామకరణం చేశారు!
సానియా మిర్జా పెళ్లి,ఇంకెవరిదో పుట్టినరోజు మీద చెత్త చర్చలు చేసే మీడియా వారు ,వాటిలో పాల్గొనే వారు కొంత సిగ్గు తెచ్చుకోవాలి…
We are marching along the endless pathway of unrealized possibilities of human growth~Francis W. Parker
~~~***~~~
జూన్ 28, 2010 @ 10:29:34
మంచి విషయం