ఏది విద్య? ఏది విద్యాలయం?-వేదాంతం శ్రీపతిశర్మ
29 ఏప్రి 2010 అభిప్రాయములు
in వార్తాలాపం
జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మొన్న గుంటూరులో సమావేశమయ్యారు.బాపట్ల, గుంటూరు ప్రంతాల విద్యాలయాల నుంచి ప్రిన్సిపాళ్లందరూ కలిసారు. తేల్చిందేమిటంటే విద్యాలయాల పరిసరాలలో సరైన పరిశుభ్రత లేదు. రెండవది శలవులలో కంప్యూటర్లు ఇలాంటి వస్తువులు మాయమైపోతున్నాయి అని.పిల్లలు చదువుకునే పరిసరాలు క్షీణిస్తున్నాయి, ఏమి చేద్దాం అని చర్చించారు. బాగు చేయాలి అని తీర్మానించారు. బాగుంది!
~~~***~~~
కపిల్ సిబల్ గారు మొన్ననే విద్యాలయాలలో హెల్త్ క్లబ్ అనే ప్రక్రియను ప్రవేశ పెట్టారు.ఇవి పిల్లల భాగస్వామ్యంతో పరిశుభ్రత, పర్యావరణం వంటి విషయాలలో విద్యాలయాల ప్రాంగణాలు చూడ ముచ్చటగా ఉండాలని వారి ఆశ. ఈ దిశగా ఎచ్.ఆర్.డి, పట్టణాభివృధ్ధి మంత్రిత్వ శాఖలు,సి.బి.ఎస్.ఇ వంటి సంస్థలు కలసి ఉమ్మడిగా పని చేస్తాయని చెప్పారు. బాగుంది.
~~~***~~~
కేంద్రంలో తలపెట్టినది ఇక్కడ తలపెట్టటం కుదరదా? (విద్య కంకరెంట్ లిస్టులోనిది కదా?)బాగుంటుందా? ఇప్పుడు అన్నీ పి.పి.పీలు కదా…ఏమో!
~~~***~~~
ఇంకొక విషయం-ఎకనమిక్ టైంస్ లో ఆ మధ్య ఒక మంచి విశ్లేషణ వచ్చింది. సర్వ శిక్షా అభియాన్ వారు ఎన్నో ముందడుగులు వేసారు, బాగుంది. అసంఖ్యాకంగా పిల్లలను స్కూళ్లకు పంపారు, పంపుతున్నారు. అక్షరాస్యత పెరుగుతున్నది, సంతోషం. కాకపోతే అయిదో క్లాసు కుర్రాళ్లకు రెండో క్లాసు పుస్తకాలలోని పాఠాలను చదవాలంటే కష్టమవుతున్నదిట! ఎలా?
ప్రణాలికలు అంకెల గారడీలకు పరిమితమవ్వటం మన దేశంలో అవలీలగా జరిగే పని.విద్యకు, మార్కులకు గల సంబంధమూ అంతే!
బాగుందా?
~~~***~~~
చివరిగా మరోమాట! అమెరికాలోని వాషింగ్టన్ డి.సి లోని విద్యాలయాలలో యాభై వేల డాలర్లు ఫండ్ రైసింగు చేసిన ఒక కలెక్షన్ కింగు ఎత్తేశాడట. ఈ డబ్బు కంప్యూటర్లు కొనటానికని చెప్పి తెచ్చాడట. ఇలా ఉంటాయి భాగస్వామ్యాలు.ఐ.పి.ఎల్ వ్యవహారాలు, బజారు, స్పాన్సరింగు,అంతా నడిబొడ్డు మీద బజారు వ్యవహారమంటే సమాజం ఎటు వెళుతున్నదో ఆలోచించవచ్చు. వివాహాల రోజులు వెళ్లిపోయాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్పులు వచ్చాయి. పోనీ పెళ్లి అన్నా అది కూడా స్పాన్సర్ కావాలి, తొలి రాత్రి కూడా స్పాన్సర్ చేసి ‘సమర్పించే ‘ వారు వచ్చేశారు.ఇళ్లు ఎవరికీ వద్దు. బజారు కావాలి. స్వగృహం వద్దు, స్వగృహా ఫుడ్స్ కావాలి.సదాచారమా? ఏమిటది? ప్రక్కన పెట్టు. సమాచారమా? ఇలా రా! చానెల్లో పెడదాం…పండగ చేసుకుందాం…
~~~***~~~
ఏది విద్య? ఎక్కడ మన విద్యాలయం?
~~~***~~~
ఏప్రి 29, 2010 @ 12:19:08
నిజమే. లోతు గా ఆలోచిస్తే అన్ని మానసిక రోగాలకు అవిద్య కారణం అనిపిస్తుంది. iit లో ‘విద్య’ అభ్యసించేవాడు రేప్, మర్డర్ కేస్ పై అరెస్ట్ అయ్యాడంటే తెలుస్తుంది విద్యాలయాలు బతుకు తెరువు నేర్పటానికే కాని సంస్కార వంతుల్ని చెయ్యటానికి కాదు అని. వివేకానంద స్వామి మళ్ళీ పుట్ట కూడదూ!
ఏప్రి 29, 2010 @ 20:53:49
True – there is no coherence in this world
జూన్ 06, 2010 @ 06:26:16
chala bagundi..
Me phone no. teliyajeyagalaru..
P.R.Narsimhareddy,
Khairthabad,
Hyderabad.
Ph:8099991076