కెనెడియన్ ఆర్క్ టిక్ వాతావరణం-పరిశోధన

కెనెడియన్ ఆర్క్ టిక్ లో ఇనువిత్ అనే వారు కొన్ని తరాలుగా మబ్బులు విడిపోవటం బట్టి రాబోయే తుఫానుల గురించి,ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతూ వస్తున్నారు.శాస్త్రవేత్తలు ఈ మధ్య ఆర్క్ టిక్ వాతావరణం మీద చేస్తున్న పరిశోధనలలో వీరి లెక్కలను, అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని అమెరికా లోని నేషనల్ సైన్స్ ఫవుండేషన్ వారు తెలుపుతున్నారు.బావుంది.
కాకపోతే ఇక్కడ ఒక చిత్రం ఉన్నది.
ఇలా వారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ సనాతనమైన పధ్ధతి ఇటీవల కొన్ని తప్పు లెక్కలను ఇస్తున్నది.ఒక రోజులో తుఫాను వస్తోంది అని చెప్పిన ఒక గంటలోనే అది వచ్చేస్తోంది.ఇలా జరగటంలో ఉన్న ప్రక్రియను పరిశీలించే పనిలో వైఙ్ఞానికులు పడ్డారు.వారికెందుకు? మరో ప్రక్రియలో కలిగిన తేడా నుంచి వారి ప్రక్రియకు, పరిశోధనకు కొంత ఉపయోగం ఉండగలదని వారి అంచనా! మరో దృక్పథం మీద వారికి గల ఆదరణ అది! నిజమైన శాస్త్రవేత్తలు వారు.
ఆలోచిద్దాం. విఙ్ఞానం అనేది కేవలం ఒక కాలానికో, ఒక పుస్తకానికో, ఒక సంప్రదాయానికో చెందినది కాదు. ప్రకృతిని పరిశీలిస్తూ ఒక సిధ్ధాంతాన్ని పట్టుకుని మానవాళి మనుగడకు చేస్తున్న ప్రతి పరిశోధనా విఙ్ఞానమే! వేల సంవత్సరాల క్రింద పంచాంగాల లెక్కలు వేసి భూకంపాలు, గ్రహణలు ఏ పధ్ధతులలో కనుక్కున్నారని శోధించాలి కానీ కేవలం కార్పణ్యంతో దిక్కుమాలిన చర్చలు చేయటం మన దేశానికే చెందినది. నిజమైన శోధన గల హృదయాలు కాబట్టి ఫ్రిడ్జాఫ్ కాప్ర (నోబెల్ పొందిన భౌతిక శాస్త్రవేత్త)శివుడి తాండవానికీ, పార్టికల్స్ స్పందనకు మధ్య గల పోలిక గురించి మాట్లాడతాడు.(ద డాన్స్ ఆఫ్ శివ అనె పుస్తకం చూడండి). స్టీఫెన్ హాకింగ్ అస్ట్రాలజీ గురించి ,కాలగణనలో దాని పాత్ర గురించి చెబుతాడు.కలాం వేదాల గురించి మాట్లాడతారు.అటూ ఇటూ కాని మధ్య రకం గోలతోనే మన మీడియా సొమ్ము చేసుకుంటూ ఉంటుంది.రెండు విషయాలూ ఇద్దరికీ వచ్చి యున్నప్పుడు చర్చ బాగుంటుంది. అలా కానప్పుడు అక్కడ మనకుమనుషులు మాట్లాడుకుంటున్నా అసహ్యమైన కోళ్ల పందెంలా ఉంటుంది.
బాహ్య ప్రపంచం నుండి మన మీడియా చాలా నేర్చుకోవాలి. పేరున్న ఎన్.డి.టి.వీ కూడా ఈ మధ్య సానియా మిర్జాకు కేటాయించిన సమయం ఇతర అంశాలకు ఇవ్వకపోవటం మన దేశంలోని దుర్గతి!

~~~***~~~

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.