ఏది విద్య? ఏది విద్యాలయం?-వేదాంతం శ్రీపతిశర్మ

జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మొన్న గుంటూరులో సమావేశమయ్యారు.బాపట్ల, గుంటూరు ప్రంతాల విద్యాలయాల నుంచి ప్రిన్సిపాళ్లందరూ కలిసారు. తేల్చిందేమిటంటే విద్యాలయాల పరిసరాలలో సరైన పరిశుభ్రత లేదు. రెండవది శలవులలో కంప్యూటర్లు ఇలాంటి వస్తువులు మాయమైపోతున్నాయి అని.పిల్లలు చదువుకునే పరిసరాలు క్షీణిస్తున్నాయి, ఏమి చేద్దాం అని చర్చించారు. బాగు చేయాలి అని తీర్మానించారు. బాగుంది!
~~~***~~~
కపిల్ సిబల్ గారు మొన్ననే విద్యాలయాలలో హెల్త్ క్లబ్ అనే ప్రక్రియను ప్రవేశ పెట్టారు.ఇవి పిల్లల భాగస్వామ్యంతో పరిశుభ్రత, పర్యావరణం వంటి విషయాలలో విద్యాలయాల ప్రాంగణాలు చూడ ముచ్చటగా ఉండాలని వారి ఆశ. ఈ దిశగా ఎచ్.ఆర్.డి, పట్టణాభివృధ్ధి మంత్రిత్వ శాఖలు,సి.బి.ఎస్.ఇ వంటి సంస్థలు కలసి ఉమ్మడిగా పని చేస్తాయని చెప్పారు. బాగుంది.
~~~***~~~
కేంద్రంలో తలపెట్టినది ఇక్కడ తలపెట్టటం కుదరదా? (విద్య కంకరెంట్ లిస్టులోనిది కదా?)బాగుంటుందా? ఇప్పుడు అన్నీ పి.పి.పీలు కదా…ఏమో!
~~~***~~~
ఇంకొక విషయం-ఎకనమిక్ టైంస్ లో ఆ మధ్య ఒక మంచి విశ్లేషణ వచ్చింది. సర్వ శిక్షా అభియాన్ వారు ఎన్నో ముందడుగులు వేసారు, బాగుంది. అసంఖ్యాకంగా పిల్లలను స్కూళ్లకు పంపారు, పంపుతున్నారు. అక్షరాస్యత పెరుగుతున్నది, సంతోషం. కాకపోతే అయిదో క్లాసు కుర్రాళ్లకు రెండో క్లాసు పుస్తకాలలోని పాఠాలను చదవాలంటే కష్టమవుతున్నదిట! ఎలా?
ప్రణాలికలు అంకెల గారడీలకు పరిమితమవ్వటం మన దేశంలో అవలీలగా జరిగే పని.విద్యకు, మార్కులకు గల సంబంధమూ అంతే!
బాగుందా?
~~~***~~~
చివరిగా మరోమాట! అమెరికాలోని వాషింగ్టన్ డి.సి లోని విద్యాలయాలలో యాభై వేల డాలర్లు ఫండ్ రైసింగు చేసిన ఒక కలెక్షన్ కింగు ఎత్తేశాడట. ఈ డబ్బు కంప్యూటర్లు కొనటానికని చెప్పి తెచ్చాడట. ఇలా ఉంటాయి భాగస్వామ్యాలు.ఐ.పి.ఎల్ వ్యవహారాలు, బజారు, స్పాన్సరింగు,అంతా నడిబొడ్డు మీద బజారు వ్యవహారమంటే సమాజం ఎటు వెళుతున్నదో ఆలోచించవచ్చు. వివాహాల రోజులు వెళ్లిపోయాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్పులు వచ్చాయి. పోనీ పెళ్లి అన్నా అది కూడా స్పాన్సర్ కావాలి, తొలి రాత్రి కూడా స్పాన్సర్ చేసి ‘సమర్పించే ‘ వారు వచ్చేశారు.ఇళ్లు ఎవరికీ వద్దు. బజారు కావాలి. స్వగృహం వద్దు, స్వగృహా ఫుడ్స్ కావాలి.సదాచారమా? ఏమిటది? ప్రక్కన పెట్టు. సమాచారమా? ఇలా రా! చానెల్లో పెడదాం…పండగ చేసుకుందాం…
~~~***~~~
ఏది విద్య? ఎక్కడ మన విద్యాలయం?
~~~***~~~

ఫొటో క్విజ్(8)-వేదాంతం శ్రీపతిశర్మ

ఇదేమిటి? ఎక్కడ జరిగింది?

ఫోటో క్విజ్ (7)కు సమాధానం

ఇవి పేరట్ ఫ్లవర్స్-చిలుకలలా ఉండే పూలు. థాయిలాండ్ లో కనిపిస్తాయి. వీటిని పరిరక్షించేందుకు ఎగుమతులను ఆపివేయటం జరిగింది.

ఈ సమాధానాన్ని    ’రాణి ‘ గారు ఇచ్చి యున్నారు.

ఈ ఫొటోకు వ్యాఖ్య పంపండి(8)-వేదాంతం శ్రీపతిశర్మ

ఫొటో క్విజ్(7)-వేదాంతం శ్రీపతిశర్మ

ఇవేమిటి?

ఫొటో క్విజ్ (6) కు సమాధానం

నిజమే! ఇది తాజ్ మహల్ మీద ఉన్నది

ఫొటో క్విజ్ (6)-వేదాంతం శ్రీపతిశర్మ

ఇది ఏ ప్రముఖ భవనం మీద ఉంటుంది?

ఫొటో క్విజ్ (5)కు సమాధానం

ఇది కళ్యాణ్ రైల్వే స్టేషన్ (1895 లో)

కెనెడియన్ ఆర్క్ టిక్ వాతావరణం-పరిశోధన

కెనెడియన్ ఆర్క్ టిక్ లో ఇనువిత్ అనే వారు కొన్ని తరాలుగా మబ్బులు విడిపోవటం బట్టి రాబోయే తుఫానుల గురించి,ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతూ వస్తున్నారు.శాస్త్రవేత్తలు ఈ మధ్య ఆర్క్ టిక్ వాతావరణం మీద చేస్తున్న పరిశోధనలలో వీరి లెక్కలను, అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని అమెరికా లోని నేషనల్ సైన్స్ ఫవుండేషన్ వారు తెలుపుతున్నారు.బావుంది.
కాకపోతే ఇక్కడ ఒక చిత్రం ఉన్నది.
ఇలా వారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ సనాతనమైన పధ్ధతి ఇటీవల కొన్ని తప్పు లెక్కలను ఇస్తున్నది.ఒక రోజులో తుఫాను వస్తోంది అని చెప్పిన ఒక గంటలోనే అది వచ్చేస్తోంది.ఇలా జరగటంలో ఉన్న ప్రక్రియను పరిశీలించే పనిలో వైఙ్ఞానికులు పడ్డారు.వారికెందుకు? మరో ప్రక్రియలో కలిగిన తేడా నుంచి వారి ప్రక్రియకు, పరిశోధనకు కొంత ఉపయోగం ఉండగలదని వారి అంచనా! మరో దృక్పథం మీద వారికి గల ఆదరణ అది! నిజమైన శాస్త్రవేత్తలు వారు.
ఆలోచిద్దాం. విఙ్ఞానం అనేది కేవలం ఒక కాలానికో, ఒక పుస్తకానికో, ఒక సంప్రదాయానికో చెందినది కాదు. ప్రకృతిని పరిశీలిస్తూ ఒక సిధ్ధాంతాన్ని పట్టుకుని మానవాళి మనుగడకు చేస్తున్న ప్రతి పరిశోధనా విఙ్ఞానమే! వేల సంవత్సరాల క్రింద పంచాంగాల లెక్కలు వేసి భూకంపాలు, గ్రహణలు ఏ పధ్ధతులలో కనుక్కున్నారని శోధించాలి కానీ కేవలం కార్పణ్యంతో దిక్కుమాలిన చర్చలు చేయటం మన దేశానికే చెందినది. నిజమైన శోధన గల హృదయాలు కాబట్టి ఫ్రిడ్జాఫ్ కాప్ర (నోబెల్ పొందిన భౌతిక శాస్త్రవేత్త)శివుడి తాండవానికీ, పార్టికల్స్ స్పందనకు మధ్య గల పోలిక గురించి మాట్లాడతాడు.(ద డాన్స్ ఆఫ్ శివ అనె పుస్తకం చూడండి). స్టీఫెన్ హాకింగ్ అస్ట్రాలజీ గురించి ,కాలగణనలో దాని పాత్ర గురించి చెబుతాడు.కలాం వేదాల గురించి మాట్లాడతారు.అటూ ఇటూ కాని మధ్య రకం గోలతోనే మన మీడియా సొమ్ము చేసుకుంటూ ఉంటుంది.రెండు విషయాలూ ఇద్దరికీ వచ్చి యున్నప్పుడు చర్చ బాగుంటుంది. అలా కానప్పుడు అక్కడ మనకుమనుషులు మాట్లాడుకుంటున్నా అసహ్యమైన కోళ్ల పందెంలా ఉంటుంది.
బాహ్య ప్రపంచం నుండి మన మీడియా చాలా నేర్చుకోవాలి. పేరున్న ఎన్.డి.టి.వీ కూడా ఈ మధ్య సానియా మిర్జాకు కేటాయించిన సమయం ఇతర అంశాలకు ఇవ్వకపోవటం మన దేశంలోని దుర్గతి!

~~~***~~~

ఫొటో క్విజ్ (5)-వేదాంతం శ్రీపతిశర్మ

ఈ ఫొటో 1895 లో తీసినది.ఏ స్టేషనో గుర్తు పట్టారా?

ఫొటో క్విజ్(4)కు సమాధానం

ఇవి మడగాస్కర్ లో ఇటీవల కనిపించిన పాములు. వీటికి కంటి చూపు లేదని తేల్చారు. ఈ రకం సర్పాలు కొన్ని వేల సంవత్సరాలుగా భూ గర్భంలో ఉన్నాయని శాస్త్రఙ్ఞుల అంచనా.

‘తుం మిలో తొ సహీ’చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

కబీర్ సదానంద్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిఖిల్ పంచమియ నిర్మించారు.

సామాజికపరమైన ఇతివృత్తాన్ని ఎంచుకుని కొన్ని పాత్రలను నిజ జీవితం నుండి ఎంచుకుని ఒక కనెక్షన్ ఏర్పరచి ఒక చిత్రమైన ప్రక్రియను ప్రయత్నించారు దర్శకులు. ఇందులో పూర్తిగా సఫలమైనట్లు కనిపించదు.కారణాలను పరీక్షించే ముందు చిత్రం లోకి వెళదాం…
లకీ కెఫే అనే ఒక పాత కెఫేను డింపల్ కపాడియా నడుపుతూ ఉంటుంది.ఆమె భర్తకు చెందిన కెఫే అది.ఆమె ప్రస్తుతం ఒంటరిది.నానా పాటేకర్ పాత కాలపు తమిళ వ్యక్తి. రిటైరయిపోయాడు. ఒంటరి వాడు.సునీల్ శెట్టీ,విద్యా మాల్వడె భార్యా భర్తలు.ఇతను పూర్తి ఆధునిక కార్పొరేట్ వ్యక్తి. ఆస్తులను కొనటం, అమ్మటం, హై స్పీడ్ లో పోతూ ఉంటాడు.ఆవిడ ఒక ప్రొఫెసర్.పిల్లవాడు వీళ్ల గొడవల మధ్య మానసికంగాదెబ్బ తింటూ ఉంటాడు.లకీ కెఫేలో వీళ్లిద్దరు మొదటి సారి కలుసుకున్నారని చెప్పుకుంటారు. తగువు అయినప్పుడు ఆమె అక్కడే ఉంటుంది.నానా పాటేకర్ ఒక పిల్లవాడి సైకిలు తిరిగి ఇచ్చేటప్పుడు అక్కడికి చేరుకుంటాడు. సునీల్ శెట్టీ తన కంపెనీ తరఫున ఆ కెఫేను కొనే ప్రయత్నం దగ్గర కథ ముందుకు వెళుతుంది.
డింపల్ అమ్మను అనేసరికి అది ఆమెకు చెందదనే గొడవ సృష్టించటం, అజయ్ భార్య విభేదించటం,నానా పాటేకర్ ఒకపటి న్యాయవాది కావటం వలన ఆ కేసును వాదించటం,చివరకు అజయ్ దేవ్ గణ్ స్వయంగా కొన్ని విషయాలను కోర్టులో ఒప్పుకోవటం,డింపల్ అసలు ఆ కెఫే తన కూతురుకు (పెళ్లి ముందే జన్మించిన కూతురు) చెందుతుందని చెప్పటంతో కథ ముగుస్తుంది.
దర్శకుడు ఈ మధ్య సాగుతున్న ముగ్గురు పాత్రల సమ్మేళనంలో వాళ్లు నిజానికి కలుసుకునే ప్లేట్ఫారం-వేదిక లకీ కేఫ్ అని చెప్పే ప్రయత్నం చేశారు.అది పాత అలవాట్లు,సన్స్కారం, పధ్ధతి ఇటువంటి వాటికి చిహ్నంగా హెరిటేజ్ సైట్ క్రింద అక్కడి జనం పోరాడటం, సైన్యం నుంచి వచ్చిన విక్రం ఆధునికరుగ్మతలలో ఇరుక్కున్న ప్రియురాలితో సహా అందులో పాల్గొనటం…ఇవన్నీ సింబాలిసం కోసం బాగానే పనికి వచ్చాయి. కానీ కోర్టు సీను అసహజంగా ఉన్నది.అసలు సునీల్ శెట్టీ కంపనీకి ఆ కెఫే ఎవరికి చెందాలనే మాట మీద లోకస్ స్టేండయి చూపించలేదు. సాక్ష్యాధారాలు తిన్నగా న్యాయమూర్తికే ఇచ్చేయటం,అది ఏ స్థాయి కోర్టో తెలియకుండా అలా అదోలా సాగిపోయింది. కోర్టులో లకీ కెఫెలో చెప్పుకోలేని కృత్యాలు కూడా జరుగుతున్నాయని మొహ్నీశ్ బెహ్ల్ వాదించినప్పుడు సునీల్ శెట్టీ గింజుకుని (తన భార్య అక్కడే ఉన్నందుకు)ఇవన్నీ అబధ్ధాలని చెప్పి (తన ఉద్యోగం పోతుందని తెలిసినా) అందరినీ ఆశ్చర్య పరుస్తాడు. ఆ దృశ్యంలో పండవలసిన భావోద్రేకం ముందుకు రాలేదు.

నానా పాటేకర్ నటన ఎప్పటిలాగే ఆకట్టుకుంటుంది.ఆయన తెర మీదకు వచ్చినప్పుడల్లా మంచి వడ్డన ఉంటుందనే నమ్మకం సృష్టిస్తారు.డింపల్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు వదిలి రమ్మన్న వాడు ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు బూట్లతోనే బెడ్ దాకా వెళ్లటం అనేది చూ  పించేటప్పుడు దర్శకులు ఆలోచించాలి…

డింపుల్ కపాడియా ఆ పాత్రలో చాలా మంచి నటనను ప్రదర్శించింది.టైటిల్ పాట బాగుంది.
~~~***~~~
ఒక రైల్వే జంక్షన్ ను చూడగానే ఇది జంక్షన్ అని తెలిసిపోతుంది. కథలో పాత్రల,ఇతివృత్తాలసంగమం జరగవలసిన ‘చోటును ‘ రచయిత చాలా జాగ్రత్తగా చిత్రీకరించాలి. కథ కోసం దీనిని సృష్టించామనిపించకూడదు. అది ఒక తప్పని సరైన చోటుగా అందరి ముందుకూ రావాలి. దో రాస్తే చిత్రంలో బల్రాజ్ సాహ్ని గ్రామొప్ఫోన్ రికార్డు వింటూ ఉంటాడు-’ఎక్ బంగల బనే న్యారా…’ అది సైగల్ గొంతులో ఉంటుంది. ఆ చిత్రం లోని కథలో చెబుతున్న పాత కాలపు విలువలు ఆ గ్రామొఫోను,ఆ పాట ముందుకు రాగానే ప్రేక్షకుని మదిలో మెదలటం మొదలవుతాయి.లకీ కెఫె లోకి వీరందరూ అడుగు పెట్టటం అంత ఎఫెక్టివ్ గా జరగలేదు. సింబాలిసం విషయంలో దర్శకుడు చేయవలసిన కృషి చాలా ఉన్నది.
మెటోనిమీ,మెటఫర్ కు సంబంధించి ‘సిటిజెన్ కేన్ ‘ అనే చిత్రం (1941) చూస్తే పలు విషయాలు బయటకు రాగలవు.
~~~***~~~

హిందీ చిత్రాలలో కథను ఎంచుకుని కొత్తదనం కోరుకోవటం,ఒకప్పుడు కమర్షియల్ గా బాగా రాణించిన హీరోలు కూడా భిన్నమైన పాత్రలు చేయటానికి సిధ్ధపడటం తెలుగువారమైన మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.

~~~***~~~

The English version can be viewed at www.sripatitimes.com & www.filmreviewsonline.org & www.chakpak.com

లెడ్ వాడిన పెయింటు

లెడ్ వాడిన పెయింటు ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు చాలా హానికరమని తెలుసుకుని యు. ఎస్ వారు ఇటువంటి పూతలు పూసే కాంట్రాక్టర్లకు ట్రెయినింగు లేకపోతే ఆ పని చేయటానికి వీలు లేకుండా చట్టాన్ని తెచ్చారు.

మన పరిస్థితి ఏమిటో మరి.ఈ పెయింటు వలన గర్భవతులకు,పసి పిల్లలకు చాలా సమస్యలు రాగలవు.పిల్లలలో చురుకుదనం తగ్గటం ఒక పరిణామం. గర్భవతులు ఇంటిలో ఉన్నప్పుడు ఇలా పెయింటులు మన వాళ్లు వేయకపోవటం ఆచారంలో ఉండటం కూడా మనకు తెలిసిందే!
ఇతర వివరాలకు ఈ క్రింది లింకును చూడగలరు:

http://www.epa.gov/region02/lead

ఈ ఫోటోకు వ్యాఖ్య పంపండి(7)-వేదాంతం శ్రీపతిశర్మ

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.