కనులకు వెలుగువు
11 Feb 2010 వ్యాఖ్యానించండి
in శ్రీగీతం
ఒక చక్కని పాటలో ఎంత గొప్ప మాట చెప్పారు? ఏ సమస్యకైనా భగవంతుని సర్వ వ్యాపకమైన శక్తిని ధ్యానించినప్పుడు దొరికే సమాధానం, అనుభూతి చిన్న మాటలో తేల్చేశారు! సుశీల గారు ‘మాయే కాదా ‘ అనేది రెండు రకాలుగా పలికి మరింత జీవం పోశారు. ఈ పాటలో తల్లి ఆవేదనకు, పిల్లవాడి పాటలో సమాధానం గొప్ప ప్రయోగం.దృశ్యం రెండుగా విభజింప బడటం సమయానికి సరైన నేపథ్యాన్ని ఇస్తుంది.జానకి గారు ‘నాకేల జనించితివయ్యా…’అనేది చివరి సారి పలికినప్పుడు నాకిలా జరగటమే అసలు ఒక కంక్లూషన్ అనిపిస్తుంది.ఇద్దరి భావాల మధ్య సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారు చూపించిన వైవిధ్యం ఆయనకే చెందింది.
‘అండగనుండా విధాతవీవు,ఆకలి దప్పులు లేనే లేవు,నారాయణ నామామృతరసమే అన్నము పానము కావా దేవా…’
‘కనపడు చీకటి మాయే కాదా…మాయే కాదా…’ మాయ తప్ప మరొకటి కాదు కదా?
అద్భుతమైన తెలుగు పాట,గొప్ప సంగీతం, ఎంతో ప్రతిభ కనబరచిన చిత్రీకరణ!
~~~***~~~
ఇటీవలి అభిప్రాయములు