28.02.2010-06.03.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి,బుధ,గురువులు కుంభం, శుక్రుడు కుంభ మీన రాశులు, కేతువు మిథునం, కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,చంద్రుడు సింహ,కన్య,తుల,వృశ్చిక రాశులు సంచరిస్తున్నారు.

బాధ్యతల నడుమ కొంత ఊరట కోసం సమయం,ధనం రెండూ వెచ్చించాలని పలువురు ఈ వారం  యోచించగలరు.కళాకారులకు,స్త్రీలకు మంచి అవకాశాలున్న వారం.నూతన వస్తు సేకరణ,పాత సంబంధాలు మెరుగు పడాలనే సంకల్పం,ఆదాయం పెంచుకునే మార్గాలను వెతకటం జరుగగలదు.   వ్యాపారం,స్టాక్ మార్కెట్ మంచి వృధ్ధిలోకి రాగలదు.రసాయన రంగం,ఐ.టి రంగం లాభాలు చూపగలదు.ఆటో మొబయిల్ రంగం కూడా మెరుగు పడగలదు.ప్రముఖమైన స్థలాలలో దొంగతనాలు జరుగగలవు.

మేష రాశి: మీ అంచనా తారుమారు కాగలదు.ఆలోచనా విధానం ఒకే పంథాలో సాగటం వలన మీ చుట్టూ ఉన్న వారిని మీరు తక్కువగా అంచనా వేయగలరు.కొన్ని నిజాలు తెలుసుకుంటారు.రాబోయే శనివారం ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.ఖర్చులు అధికంగా ఉండవచ్చు. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి:ఇంటిలోని సభ్యులలో భిన్నాభిప్రాయాల వలన ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడగలదు.వారాంతానికి సద్దుకోగలదు.ఆదాయం బాగుంది.బుధవారం మంచి లాభాలు ఉండగలవు.అవివాహితులకు మంచి సమయం.వాహన సౌఖ్యం బాగుంది.

మిథున రాశి: నూతన వ్యక్తులు పరిచయం కాగలరు.దీర్ఘకాలీన సమస్య ఒకటి పరిష్కారం వైపుకు పయనించటం వలన కొన్ని అర్థం కాని సన్నివేశాలు ఎదురు కాగలవు.నవ్వేసి వదిలేయగలరు.ఉద్యోగంలో మార్పులుండవచ్చు.శుక్రవారం మంచి వార్త వినగలరు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి:దైవ చింతన పెరగగలదు.ఖర్చులు అధికంగా ఉండగలవు.సంఘంలో గౌరవం పెరగవచ్చు.స్త్రీల వలన లాభాలున్నాయి.కొత్త అలోచన వలన ఒక పనిని వాయిదా వేస్తారు.కలుషితమైన నీరు త్రాగటం వలన ఇబంది ఉండగలదు.దూరపు బంధువులు మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు.

సింహ రాశి: పిల్లలు మంచి పురోగతి చూపగలరు.ఇతరుల విషయాలలో జోక్యం చాలా హానికరం.పెద్దల ఆరోగ్యం కలవరపెట్టగలదు.జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలుండగలవు.పరిశోధనా రంగం వారికి మంచి ఫలితాలుండగలవు.శివాలయం సందర్శించగలరు.

కన్య రాశి: పోయిందనుకున్నది మరింత దృఢమయి మీ వద్దకు రాగలదు.మనోధైర్యం పెరుగుతుంది.మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది.శ్రమతో పనులు పూర్తి చేస్తారు.ఆదాయం ఉత్సాహకరంగా ఉంటుంది.కొందరు అహంకారంతో ప్రవర్తించగలరు.అది వారి సమస్య.శ్రీసూక్తం చదవండి.

తుల రాశి:చాలా యోగాలున్న వారం.దీర్ఘకాలీన ప్రణాలికలు రూపొందనున్నాయి. ఒక సార్వజనికమైన ప్రదేశంలో మీరు పలికిన మాటలు  అందరినీ ఆకట్టుకుంటాయి. విద్యార్థులకు విదేశాలలో అవకాశాలు రాగలవు.కార్యాలయంలో కొత్త పని ప్రారంభం కాగలదు.

వృశ్చిక రాశి: మీకు ఏ రంగంలోనైతే ప్రతిభాపాటవాలు కలవో అవి ఎల్ల వేళలా మీ ముందు ఉండకపోవటమే జీవితం నేర్పే పాఠం.మీ పధ్ధతి అన్నింటిలో పనికిరాకపోవచ్చు.గుర్తించి మసలుకోవలసిన అవసరం ఉన్నది.వారాంతానికి మీ అదృష్టం కలసిరాగలదు.లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

ధను రాశి:మధ్యవర్తిత్వం చేసే వారు జాగ్రత్తగా మసలుకోవాల్సిన వారం.ఇంటిలోని సమస్య ప్రస్తుతానికి సద్దుకో గలదు.నిరుద్యోగులకు మంచి అవకాశం ఉండగలదు.ఆరోగ్యం మెరుగుపడుతుంది.మంగళవారం లాభాలు పొందుతారు.కొత్త పనులకు సమయం ఇంకా రాలేదు. వేచి చూడండి.హనుమాన్ చాలీసా చదవండి.

మకర రాశి:కొంత అవకాశవాదం కనిపిస్తున్నది.అందరికీ ఒకే కథ వినిపించటం వలన మిత్రులు అపార్థం చేసుకోగలరు. ఒక సభలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాల్సి ఉంది. పెద్ద వారి కోసం కొన్ని ప్రణాలికలు వేయగలరు.స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నది.

కుంభ రాశి: ప్రేమ వ్యవహారం పాకాన పడనున్నది. దూర ప్రయాణం,స్థాన చలనం,నలుగురితో సంప్రదింపులు ఉండవచ్చు.కొన్ని బాధ్యతలను విస్మరించినట్లయితే సమస్యలుండగలవు.దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.

మీన రాశి: ఈ వారం మంచి సౌఖ్యం,అదృష్టం కలసి రాగలవు.ఒక ఆస్తి వివాదం తలెత్తగలదు.ఇటీవల మీరు ఇతరులకు సహకరించి పూర్తి చేసిన పని మెప్పు పొందగలదు.బంధువర్గమ్నుండి మంచ్ వార్తలు వింటారు.ఉద్యోగంలో మార్పు కోరటం ప్రస్తుతానికి మంచిది కాదు.

ఈ వారం మంచి మాట:

శ్లో: వ్యసనే హి కచ్చిదాఢ్యస్య దుర్బలస్య చ రాఘవ

అర్థం విరాగా: పశ్యంతి తవామాత్యా బహుశృతా:

(శ్రీమద్వాల్మీకి రామాయణం,కచ్చిత్సర్గ,58)

ఉన్నవారికి, లేనివారికి మధ్య తగువు ఏర్పడి నీ వద్దకు వారు వచ్చినప్పుడు నీ మంత్రులు వారితో సమానంగా వ్యవహరిస్తున్నారా లేదా?

(శ్రీరాముడు భరతుని ప్రశ్నిస్తాడు)

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి:శంతి:

~~~***~~

(Predictions in English according to the Sun Signs  for the month of March 2010 can be viewed  by clicking www.sripati.com)

21-27.02.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి,శుక్ర,గురు గ్రహాలు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,బుధుడు మకర కుంభాలు,చంద్రుడు మేష,వృషభ,మిథున,కర్కాటక రాశులు సంచరిస్తున్నారు.

శ్రమాధికం,కొత్త పనులు ప్రారంభం,ప్రయాణాల వలన లాభం,భూ వివాదాలు పరిష్కార మార్గం వైపు వెళ్లటం,విదేశీ వ్యవహారాలలో ఒక సమస్య తలెత్తటం ఈ వారం కొన్ని సూచనలు.

మేష రాశి: ఇంటి సౌఖ్యం,ఖర్చులు అధికం,బంధువుల కలయిక,ఉద్యోగ అవకాశం ఉండవచ్చు.గురువారం మంచి అదృష్టం ఉన్నది.కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: గడచిన ఘటనలు గుర్తుకు వచ్చి ఇబ్బంది పెట్టగలవు.వదిలేయండి.అప్పులు తీరగలవు.బుధవారం మంచి నిర్ణయం తీసుకోగలరు.ఆలోచనలు కలసి వస్తాయి.

మిథున రాశి: మీ సహనాన్ని కొందరు పరీక్షిస్తారు.మార్కెట్ లో పెట్టుబడులకు దూరంగా ఉండండి.ఇతరుల వాహనం వలన ఇబ్బంది ఉన్నది.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: ఒక విషయంలో ధైర్యం తెచ్చుకుంటారు.కొత్త విషయాలను తెలుసుకుంటారు.చిన్న వారి ఆరోగ్యం కలవర పెడుతుంది.మంగళవారం మంచి వార్త వింటారు.విష్ణు సహస్రనామం చదవండి.

సింహ రాశి: ప్రజల మధ్యలోకి రావలసి ఉంటుంది.నడుము నొప్పులున్నవారు జాగ్రత్తలు వహించాలి. భిన్నమైన అభిప్రాయాలు గలవారిని సంతృప్తి పరచాల్సి వస్తుంది.దూరాలోచన అవసరం.
కన్య రాశి: ఆగిన పనులు పూర్తి చేస్తారు.శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.మీ చేతిలో ఉన్న పని చాలా గొప్పది. సంఘంలో గౌరవం పెరుగుతుంది.శ్రీసూక్తం చదవండి.
తుల రాశి: ఈ వారం వ్యాపార రంగం వారికి బాగున్నది.ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.పాత లెక్కలు తిరిగి చూసుకోవలసి వలసి వస్తుంది. అందు వలన కొంత మేలు కూడా ఉన్నది.
వృశ్చిక రాశి: కార్యాలయంలో మంచి మార్పుండవచ్చు.ఇంటిలోని పెద్దవారితో ఒక సమస్య తలెత్త గలదు.ఒక సామూహిక కార్యక్రమంలో పాల్గొంటారు.పిల్లల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తొందర పడాలి.హనుమాన్ చాలీసా చదవండి.
ధను రాశి:విదేశాల నుండి మంచి వార్తలు వింటారు.ఊహల్లో కాలం గడుపు వారు ఆలస్యంగా నిద్ర లేస్తారు.చాలా పనులు మీకు తెలియకుండానే అయిపోగలవు.శనివారం బంధువుల సమాగమం ఉండవచ్చు.లలితా సహస్రనామం చదవండి.
మకర రాశి: భవిష్య ప్రణాలికలకు మంచి కాలం.మీ ఒరవడి కొందరికి అర్థం కాకపోవచ్చు.సహనంతో వివరించవలసిన అవసరం ఉన్నది.కొన్ని పెట్టుబడులు లాభించగలవు.
కుంభ రాశి: పిల్లలు మంచి పురోగతి సాధించగలరు.జీవిత భాగస్వామి నుండి ఒక విచిత్రమైన విషయాన్ని తెలుసుకుంటారు.శుక్రవారం మంచి పరిణామం ఉండవచ్చు.
మీన రాశి: కోపతాపాలకు దూరంగా ఉండవలసిన వారం.సోమవారం మీ ఆలోచనలు కలసిరాగలవు.మీరు బహుకాలంగా ద్వేషించే వ్యక్తి మంచివాడని ఒక సంఘటన ద్వారా తెలుసుకుంటారు.ధ్యాన మార్గం మంచిది.
ఈ వారం మంచి మాట:
శ్లో: ఆచార: ఫలతే ధర్మమాచార: ఫలతే ధనం
ఆచారాఛ్రియమాప్నోతి ఆచారో హంత్యలక్షణం
(మహాభారతం ఉద్యోగపర్వం)
ఆచారమే ధర్మాన్ని సఫలీకృతం చేస్తుంది. ఆచారమే ధనరూపమైన ఫలాన్ని ఇస్తుంది.ఆచారముతో సంపద ప్రాప్తిస్తుంది.ఆచారమే అశుభలక్షణములను నశింపజేస్తుంది.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~

14-20.02.2010 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి:రవి శుక్ర గురు గ్రహాలు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,బుధుడు మకరం,చంద్రుడు కుంభ, మీన, మేష రాశులు సంచరిస్తారు.

రాజకీయ రంగంలో మొండి వైఖరులు,సిధ్ధాంతపరమైన విరోధాలు,పశువులకు ఆరోగ్య సమస్యలు,మార్కెట్ వారం మధ్య నుండి కొద్దిగా పుంజుకోవటం,అంతర్జాతీయ వ్యవహారాలలో ఒక విచిత్రమైన ఒరవడి,ఒక ఖనిజాన్ని ఆవిష్కరించటం కొన్ని సూచనలు.

గర్భిణీ స్త్రీలు విశేషమైన జాగ్రత్తలు తీసుకోవలసిన వారం.

మేష రాశి: ఆస్తి విషయాలు చర్చకు వస్తాయి.పెద్దల నుండి సంక్రమించిన అనారోగ్యం కూడా బాధించగలదు.మంచి సమయం కోసం వేచి యుండి భవిష్యత్తు ప్రణాలికలను పరిశీలించండి.గురువారం వ్యాపారం లాభించగలదు.ఈ శనివారం అప్పు చేయటం అంత మంచిది కాదు.అధ్యయనానికి మంచి వారం.శ్రీసూక్తం, విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: ఉపాసన మార్గం మీకు చేరువలోనున్నప్పటికీ మీరు ఏ కారణం చేతనో చేపట్టటం లేదు. కార్యాలయంలో కొన్ని విభేదాలుండవచ్చు.ఆశించిన డబ్బు కొంత ఆలస్యంగా అందగలదు.మీ సలహా పాటించి ఇతరులు లాభం పొందగలరు.సోమ బుధవారాలు అదృష్టం బాగుంటుంది.

మిథున రాశి: వింత ఆలోచనలు కలుగవచ్చు.ఇంటిలోని ఒకరి ఆరోగ్య పరిస్థితి అర్థం కాకపోవచ్చు.ఖర్చులు అధికం కావచ్చు.బుధ, శుక్రవారాలలో పెట్టుబడులు కలసిరాగలవు.విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి.సుబ్రహ్మణ్య కవచం చదవండి.

కర్కాటక రాశి:అనుకున్న కార్యాలు నెరవేరగలవు.కొంత సమయం వృధా కాగలదు.వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి.

సింహ రాశి:సంఘంలో గౌరవం పెరుగుతుంది.కొత్త పనిని చేపడతారు.జీవిత భాగస్వామి మీ నుండి ఏదో ఆశించటం జరుగుతుంది.ఒక లేఖ అందుకుంటారు.ఈ మంగళ వారం అదృష్టం బాగుంది.మహాసౌరం చదవండి.

కన్య రాశి: బాధ్యతలు పెరుగుతాయి.ఒక్కొక్క పనిని నిదానంగా చేసుకోవటమే మంచిది.బంధువుల రాక ఉన్నది.మీ సహనం మీకు మంచి చేయగలదు.శ్రీసూక్తం చదవండి.

తుల రాశి:ఈ వారం ఒక చక్కని యోగం సంభవించనున్నది.వారాంతం లోపు ఏదైనా వీఅదం ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నించండి. కొన్ని లావాదేవీలు జరుపుతారు.విష్ణు సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: ఇంటి పనులు ముమ్మరం చేయగలరు.స్త్రీలతో వ్యవహరించునప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.స్థాన చలనం ఉండగలదు.మీ శ్రమకు తగు గుర్తింపు లభిస్తుంది.సోమవారం కలసి రాగలదు.

ధను రాశి:వారాంతానికి మంచి వార్త వింటారు.నూతన ఉత్సాహంతో పని చేస్తారు.విద్యార్థులకు పురోగతి బాగుంటుంది.ఈ వారమ్మీ అదృష్ట సంఖ్య 7.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

మకర రాశి:మిత్రులతో విభేదాలు ఉండగలవు.భావోద్రేకంతో స్పందించటం కంటే సమయస్ఫూర్తితో స్పందించటం వలన లాభం పొందగలరు.దాచిపెట్టిన వ్యవహారం బయట పడటం వలన కొంత ఇబ్బంది ఉండవచ్చు.ఆదాయం బాగుంటుంది.

కుంభ రాశి:పరిస్థితులు మారినట్లు అనిపించగలదు.మారలేదని తెలుసుకుంటారు.లోపల అనుకుని బయట చెప్పని విషయాలు కాలం అయిపోయిన తరువాత చెప్పవలసి రావటం ఈ వారం విశేషం.నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించగలవు.లింగాష్టకం చదవండి.

మీన రాశి: పెట్టుబడులకు మంచి అవకాశాలున్న వారం. విదేశాలలో ఒక అవకాశం రాగలదు. క్రీడలలో రాణిస్తారు.మధ్యవర్తిత్వం జరపవలసి ఉంటుంది.వాహనం సమస్య సృష్టిస్తుంది.పై అధికారులు కనిపెడుతున్నారు.జాగ్రత్త వహించండి.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

‘మై నేం ఈస్ ఖాన్…’హిందీ చలన చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

వార్తలు చూస్తూ వీటి మీద ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకోవటం వేరు,ఒక కాన్సెప్ట్ ను ఎంచుకుని కథలో దానిని ఘటింపచేయటం వేరు.వీటికి తేడా తెలియని వారు తెలుసు అనుకుని తీసిన చిత్రం ఇది.
రిజ్వాన్ ఖాన్ (షాహ్ రుఖ్) అటిసం (ఒక మానసిక ప్రవృత్తి) తో బాధ పడుతున్న వ్యక్తి.తన తమ్ముని దగ్గరకు (అమెరికా) చేరుకుని అతని ప్రాడక్టులను అమ్మటానికి సేల్స్ మన్ గా చేరుతాడు.మందిరా(కజోల్)కు దగ్గరయి వివాహమాడతాడు.కజోల్ కి అప్పటికే ఒక పిల్లవాడు ఉంటాడు.అమెరికాలో జరిగిన ట్రేడ్ సెంటర్ అటాక్ ల తరువాత ఆ దేశంలో మహమ్మదీయుల పట్ల వారు కనపరచిన ద్వేషాన్ని దర్శకుడు ఇతివృత్తంగా ఎంచుకున్నాడు అని చెప్పటానికి ప్రేక్షకులను తేరగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది.అది ఇద్దరి ప్రేమ వ్యవహారంతో అతి కష్టంతో ముడి పెడతాడు.ఆ ముడికి సినిమా యావత్తూ వ్రేలాడి,సాగి, సాగి చివరకు కనీసం పది సార్లు టైం ఎంత అయింది అని చూసుకోమన్నాడు దర్శకుడు.
సామాన్యంగా షాహ్ రుఖ్ సినిమాలలో ఒక వేగం, ఒక జీవ కళ మనం చూస్తాం. పాపం ఆయన ఇలా సాగిపోవటం కొంత బాధే మిగిల్చింది. అమెరికా అధ్యక్షుని కలుసుకుని ‘మై నేం ఈస్ ఖాన్, అయాం నాట్ ఎ టెరరిస్ట్.’ అని చెప్పమంటుంది కజోల్.నీ వల్లనే కుర్రాడు చంపబడ్డాడని(తండ్రి మహమ్మదీయుడైనందుకు).ఆ ప్రయత్నంలో అతను ఎక్కడెక్కడో తిరిగి ఒక బీద పల్లెలో వరదలో సహాయ చర్యలు లేని పరిస్థితిలో ఇతను అక్కడికి చేరుకుని మహమ్మదీయులందరినీ ఏకం చేయగలిగి వారిని ఉధ్ధరించి ఒక తీవ్రవాదిని పట్టించి చివరకు హాలీవుడ్ లో అమెరికా అధ్యక్షుని పర్యటనలో ఆయనే స్వయంగా రిజ్వాన్ ను పిలచి మాట్లాడగా ‘మై నేం ఈస్ ఖాన్..’ అంటాడు! ఆ బాధలో పాపం షాహ్ రుఖ్ ‘మై నేం ఈస్ షాహ్ రుఖ్, అయాం నో లాంగర్ ఎ స్టార్…’అంటాడేమోననిపించింది!
షాహ్ రుఖ్ ‘రెయిన్ మాన్ ‘ చిత్రంలోని డస్టిన్ హాఫ్ మాన్ నుంచి బాగానే ఈ ‘ఆటిసం ‘ ప్రవృత్తికి గల మేనరిసం ను అవలంబించినట్లు కనిపిస్తుంది.కాకపోతే షాహ్ రుఖ్ సహజ నటుడు కాబట్టి ఆ పాత్రలో కూడా కొంత వైవిధ్యం తెచ్చాడు. ముఖ్యంగా ఒక చిన్న నవ్వు చేర్చి అదే సమయంలో కనుపాపలను దగ్గరకు తేవటం అంత తేలిక కాదు.ఆయన ప్రతిభను దర్శకుడు (కరణ్ జోహర్), స్క్రిప్ట్రైటర్ (శిబనీ భతీజా)కలసి చాలా జాగ్రత్తగా బూడిదలో పోశారనే చెప్పాలి. శిబాని భతీజా,నిరంజన్ ఐయంగార్ వ్రాసిన మాటలు కొద్దిగా చిత్రాన్ని నిలబెట్టాయి.
కథాంశం మంచిదైనా సినిమా ఎందుకు విఫలమవుతుంది అనేందుకు కథ పట్ల, ట్రీట్మెంట్ పట్ల సమగ్రమైన, సమతుల్యమైన అవగాహన లేకపోవటమే కారణమని చెప్పాలి. జరీనా వహాబ్ సినిమా ప్రారంభంలో షాహ్ రుఖ్ కు చెబుతుంది-లోకంలో రెండు రకాల మ్నుషులే!ఒకడు మంచి వాడు, రెండు చెడ్డ వాడు. ఆందరూ మనుషులే! నిజమే! కథాంశంలో వాస్తవం ఉన్నప్పటికీ ఈ సరైన అధ్యయనం,ఘటనాత్మకమైన తీరు తెన్ను లేనప్పుడు సినిమాలలో రెండే రకాలు మిగులుతాయి-మంచివి,పిచ్చివి…
~~~***~~~
ఒక పెద్దాయన ఇదంతా విని ఒక సవాలు విసిరారు. ఇదే కథాంశం ఆకట్టుకునే విధంగా ఎలా చేయవచ్చు అని!
నాకేమి తెలుసు? నేను సినిమా చూసి నా అనుభూతిని చెప్పాను. అంత మటుకే!
తప్పించుకుంటున్నారు అన్నారాయన.
‘ద టర్మినల్ ‘ చిత్రం చూసి కథ ఎక్కడ మొదలయిందో చెప్పండి, అన్నాను.ఒక మామూలు మనిషి అక్కడ ఇరుక్కున్నాడు.విధానాలు, సమస్యలు,దేశ విదేశ సంబంధాలు,నానా సమస్యలను అక్కడే చూపించేశాడు దర్శకుడు!
ప్రేక్షకుడు 9/11 ను లింకు చేసి మన హీరోను చూడాలంటే తెర మీద ఒక అమెరికాలో నివసిస్తున్న మహమ్మదీయుడు ఆ సంఘటనలో ఇరుక్కున్న వడిగా కనిపించాలి.తెర మీద ఈ సినిమాలో ఇది జరగకపోవటం ముందు చెప్పిన మాటను గుర్తు చేస్తుంది…వార్తలు చూస్తూ వీటి మీద ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకోవటం వేరు,ఒక కాన్సెప్ట్ ను ఎంచుకుని కథలో దానిని ఘటింపచేయటం వేరు.వీటికి తేడా తెలియని వారు తెలుసు అనుకుని తీసిన చిత్రం ఇది.
~~~***~~~

‘సర్కసు డేరా’-మధురాంతకం రాజారాం గారి కథ,వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

ఈ కథ 1958లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితమైనది.రాజారాం గారి సాహిత్య అకాడమీ పొందిన(1994) కథల సంకలనంలో మొదటి కథ.
ఊరి చివర ఒక సర్కసు చూడటానికి రచయిత వెళతాడు.అక్కడ గతంలో తన పది రూపాయలు ఎత్తుకుపోయాడనుకున్న నాగులు టికట్టులు తీస్తుండగా చూసి వాడిని ఒక టికట్టు కొనమని చెబుతాడు.అతను అతి కష్టంగా ఒక రేకును పట్టుకుని కొన్ని టికట్టులు తీసుకుని ఎక్కువకు అమ్మటం మొదలు పెడతాడు. ఒక పావళా ఎక్కువ ఇచ్చి కొనుక్కుని సర్కసు చూస్తాడు రచయిత.
సరక్సులో ఆ జంతువుల విన్యాసాలు,బాధలు,కత్తి మీద సాము వంటి ఆ మనుషుల పనులు,ఇటు నాగులు జీవితం,అతని తండ్రి మరణించిన తీరు,చివరకు ఒక సింహం నోటిలో మేక పిల్ల తల దూర్చినా అది చంపకుండా నోరు తెరచి ఉండటం,ఈయన ఆశ్చర్యపోవటం,అదేమిటి ఆ మేక పిల్లకు అంత నమ్మకమా అని అడిగినప్పుడు నాగులు ‘అవి జంతువులు ‘ అని
చెప్పటం …ఇవి కథలోని అంశాలు.
కథలో జీవన పోరాటాన్ని ఒక సర్కసు వ్యవహారంతో పోల్చటం జరిగింది.బావిలోకి దిగి మట్టి తీసే వారు,నిచ్చెనలెక్కి పైన  ఇటుకలు మోస్తున్న కూలీల జీవితాలు,సర్కసులో విన్యాసాలు,అక్కడ క్రూర జంతువుల మధ్య సాగిపోతున్న సర్కసు కంపనీలోని మనుషులు,ఒక స్త్రీ నిలబడి ఉన్నప్పుడు ఆమెకు తగలకుండా విసురుతున్న కత్తులు…ఇలా హృద్యమైన కథనం పలు చోట్ల హాస్యంతో సాగినా పలు వృత్తులలో జీవన పోరాటం సాగిస్తున్న వారి మీద, మానవులకు ఒక యుధ్ధం లేనిదే జీవితం లేదనే ఆలోచన వలన కరుణ కలుగక మానదు.
గతంలో నాగులు మీద అపనమ్మకంతో ఆ పది రూపాయలూ పోతాయనుకుని వెంట పడినప్పుడు అతను ఎక్కడి నుండో చిల్లర తెచ్చి చేతిలో పెడతాడు. దానికి సిగ్గు పడతాడు రచయిత.ఆ ఘట్టాన్ని చివరికి సర్కసు లో నాగులు తన కాలుకు దెబ్బ తగిలించుకుని టికట్లు సంపాదించి కొంత సంపాదించి ప్రక్కన కూర్చున్నపుడు మరల ప్రస్తావించటం జరుగుతుంది.’అవి జంతువులు కాబట్టి ఆ నమ్మకం ‘ అన్న మాటతో రచయితకు దెబ్బ తగిలినట్లవటంతో కథ ముగుస్తుంది.
కథనం తమాషాగా ఉంటుంది.కథలోని సారాని ఏ పాత్ర ద్వారా చెప్పాలనుకున్నారో ఆ పాత్ర కథలో ముందే ప్రవేశించదు.అంటే ప్రక్రియకు గల నేపథ్యం రచయిత స్వగతంతో ప్రారంభమయ్యి ఒక సహజమైన పాత్ర ఎదురు పడటం జరుగుతుంది కానీ ఆ పాత్ర కథలోకి దూరదు.పఠకుడు అక్కడ అప్పటికే ఉన్న విషయాన్ని ఈ విధంగా గుర్తిస్తాడు. రచయిత గుర్తు చేస్తాడు. కథ అయిపోతుంది!
పోలికను పాఠ్యాంశంగా చెప్పకపోవటం గొప్ప రచయితల లక్షణం.అది వృత్తం తిరిగిన తరువాత బుర్రలో గిర్రున తిరుగుతుంది.మరో సారి తిరిగినప్పుడు మరో ఆలోచన కలుగుతుంది…
~~~***~~~
ఈ కథలోని కొన్ని వాక్యాలు ఆకట్టుకుంటాయి:
‘ చేసిన పాపం చెబితే పోతుందంటారు.ఇలా సర్కసుకు వెళ్లి పట్టణంలో దిగబడిపోయిన అసంఖ్యాక ప్రజాసమూహంలో నేనూ ఓడిని!’
‘ఒక్క వ్యాపారంలోనే ఏమిటి? ఈ వ్యాపారాలూ,విద్యలూ,భోగాలూ,భాగ్యాలూ,నాటకాలూ, బూటకాలూ,దేనికైతే అవసరమవుతున్నాయో ఆ బ్రతుకే రెండు విధాలుగా ప్రస్తరిల్లిపోతున్నది.ఒకటి, ప్రవాహ గతిని అనుసరించి, అశ్రమంగా, అదొక వినోదంలా పడవ నడపటం,రెండు, చేతుల బలంతో అంతకంతకూ తరిగిపోతున్న శరీర దారుఢ్యంతో ఏటికెదురీదటం!’
‘ఆలోచనకు తెరపి ఇవ్వకుండా అనుభూతే మానసాకశమంతా క్రమ్ముకున్నప్పుడు నియమాలు నిలవవు.ఆ స్థితిలో ఎవరికైనా మైమరుపు కలుగుతుంది.’
‘తీసుకో, తీసుకో ‘ అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చే లోపుగానే మనం దాచి పెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి, ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించటమేనా మానవ జీవితం?’
ఎంత నిజం?!
~~~***~~~

ఈ కథ 1958లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితమైనది.రాజారాం గారి సాహిత్య అకాడమీ పొందిన(1994) కథల సంకలనంలో మొదటి కథ.
ఊరి చివర ఒక సర్కసు చూడటానికి రచయిత వెళతాడు.అక్కడ గతంలో తన పది రూపాయలు ఎత్తుకుపోయాడనుకున్న నాగులు టికట్టులు తీస్తుండగా చూసి వాడిని ఒక టికట్టు కొనమని చెబుతాడు.అతను అతి కష్టంగా ఒక రేకును పట్టుకుని కొన్ని టికట్టులు తీసుకుని ఎక్కువకు అమ్మటం మొదలు పెడతాడు. ఒక పావళా ఎక్కువ ఇచ్చి కొనుక్కుని సర్కసు చూస్తాడు రచయిత.
సరక్సులో ఆ జంతువుల విన్యాసాలు,బాధలు,కత్తి మీద సాము వంటి ఆ మనుషుల పనులు,ఇటు నాగులు జీవితం,అతని తండ్రి మరణించిన తీరు,చివరకు ఒక సింహం నోటిలో మేక పిల్ల తల దూర్చినా అది చంపకుండా నోరు తెరచి ఉండటం,ఈయన ఆశ్చర్యపోవటం,అదేమిటి ఆ మేక పిల్లకు అంత నమ్మకమా అని అడిగినప్పుడు నాగులు ‘అవి జంతువులు ‘ అని చెప్పటం …ఇవి కథలోని అంశాలు.
కథలో జీవన పోరాటాన్ని ఒక సర్కసు వ్యవహారంతో పోల్చటం జరిగింది.బావిలోకి దిగి మట్టి తీసే వారు,నిచ్చెనలెక్కి పైన  ఇటుకలు మోస్తున్న కూలీల జీవితాలు,సర్కసులో విన్యాసాలు,అక్కడ క్రూర జంతువుల మధ్య సాగిపోతున్న సర్కసు కంపనీలోని మనుషులు,ఒక స్త్రీ నిలబడి ఉన్నప్పుడు ఆమెకు తగలకుండా విసురుతున్న కత్తులు…ఇలా హృద్యమైన కథనం పలు చోట్ల హాస్యంతో సాగినా పలు వృత్తులలో జీవన పోరాటం సాగిస్తున్న వారి మీద, మానవులకు ఒక యుధ్ధం లేనిదే జీవితం లేదనే ఆలోచన వలన కరుణ కలుగక మానదు.
గతంలో నాగులు మీద అపనమ్మకంతో ఆ పది రూపాయలూ పోతాయనుకుని వెంట పడినప్పుడు అతను ఎక్కడి నుండో చిల్లర తెచ్చి చేతిలో పెడతాడు. దానికి సిగ్గు పడతాడు రచయిత.ఆ ఘట్టాన్ని చివరికి సర్కసు లో నాగులు తన కాలుకు దెబ్బ తగిలించుకుని టికట్లు సంపాదించి కొంత సంపాదించి ప్రక్కన కూర్చున్నపుడు మరల ప్రస్తావించటం జరుగుతుంది.’అవి జంతువులు కాబట్టి ఆ నమ్మకం ‘ అన్న మాటతో రచయితకు దెబ్బ తగిలినట్లవటంతో కథ ముగుస్తుంది.
కథనం తమాషాగా ఉంటుంది.కథలోని సారాని ఏ పాత్ర ద్వారా చెప్పాలనుకున్నారో ఆ పాత్ర కథలో ముందే ప్రవేశించదు.అంటే ప్రక్రియకు గల నేపథ్యం రచయిత స్వగతంతో ప్రారంభమయ్యి ఒక సహజమైన పాత్ర ఎదురు పడటం జరుగుతుంది కానీ ఆ పాత్ర కథలోకి దూరదు.పఠకుడు అక్కడ అప్పటికే ఉన్న విషయాన్ని ఈ విధంగా గుర్తిస్తాడు. రచయిత గుర్తు చేస్తాడు. కథ అయిపోతుంది!
పోలికను పాఠ్యాంశంగా చెప్పకపోవటం గొప్ప రచయితల లక్షణం.అది వృత్తం తిరిగిన తరువాత బుర్రలో గిర్రున తిరుగుతుంది.మరో సారి తిరిగినప్పుడు మరో ఆలోచన కలుగుతుంది…
~~~***~~~
ఈ కథలోని కొన్ని వాక్యాలు ఆకట్టుకుంటాయి:
‘ చేసిన పాపం చెబితే పోతుందంటారు.ఇలా సర్కసుకు వెళ్లి పట్టణంలో దిగబడిపోయిన అసంఖ్యాక ప్రజాసమూహంలో నేనూ ఓడిని!’
‘ఒక్క వ్యాపారంలోనే ఏమిటి? ఈ వ్యాపారాలూ,విద్యలూ,భోగాలూ,భాగ్యాలూ,నాటకాలూ, బూటకాలూ,దేనికైతే అవసరమవుతున్నాయో ఆ బ్రతుకే రెండు విధాలుగా ప్రస్తరిల్లిపోతున్నది.ఒకటి, ప్రవాహ గతిని అనుసరించి, అశ్రమంగా, అదొక వినోదంలా పడవ నడపటం,రెండు, చేతుల బలంతో అంతకంతకూ తరిగిపోతున్న శరీర దారుఢ్యంతో ఏటికెదురీదటం!’
‘ఆలోచనకు తెరపి ఇవ్వకుండా అనుభూతే మానసాకశమంతా క్రమ్ముకున్నప్పుడు నియమాలు నిలవవు.ఆ స్థితిలో ఎవరికైనా మైమరుపు కలుగుతుంది.’
‘తీసుకో, తీసుకో ‘ అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చే లోపుగానే మనం దాచి పెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి, ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించటమేనా మానవ జీవితం?’
ఎంత నిజం?!
~~~***~~~

కనులకు వెలుగువు

ఒక చక్కని పాటలో ఎంత గొప్ప మాట చెప్పారు? ఏ సమస్యకైనా భగవంతుని సర్వ వ్యాపకమైన శక్తిని ధ్యానించినప్పుడు దొరికే సమాధానం, అనుభూతి చిన్న మాటలో తేల్చేశారు! సుశీల గారు ‘మాయే కాదా ‘ అనేది రెండు రకాలుగా పలికి మరింత జీవం పోశారు. ఈ పాటలో తల్లి ఆవేదనకు, పిల్లవాడి పాటలో సమాధానం గొప్ప ప్రయోగం.దృశ్యం రెండుగా విభజింప బడటం సమయానికి సరైన నేపథ్యాన్ని ఇస్తుంది.జానకి గారు ‘నాకేల జనించితివయ్యా…’అనేది చివరి సారి పలికినప్పుడు నాకిలా జరగటమే అసలు ఒక కంక్లూషన్  అనిపిస్తుంది.ఇద్దరి భావాల మధ్య సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారు చూపించిన వైవిధ్యం ఆయనకే చెందింది.
‘అండగనుండా విధాతవీవు,ఆకలి దప్పులు లేనే లేవు,నారాయణ నామామృతరసమే అన్నము పానము కావా దేవా…’
‘కనపడు చీకటి మాయే కాదా…మాయే కాదా…’ మాయ తప్ప మరొకటి కాదు కదా?
అద్భుతమైన తెలుగు పాట,గొప్ప సంగీతం, ఎంతో ప్రతిభ కనబరచిన చిత్రీకరణ!

~~~***~~~

శ్రీసూక్తం-డా.వి.ఎ.కుమారస్వామి గారి వివరణ (4,5 భాగాలు)

07-13.02.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి:రవి మకర కుంభ రాశులు,గురు శుక్రులు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,బుధుడు మకరం,చంద్రుడు వృశ్చిక,ధను,మకర రాశులు సంచరిస్తారు.
ఈ గ్రహస్థితి ప్రజలలో ఒక అసంతృప్తి,కొంత ప్రలోభం,కార్యాచరణలో కొత్త ఒరవడులకు,అలవాటు పడ్డ పధ్ధతులకు మధ్య ఘర్షణ,మార్కెట్ లో ఒడిదుడుకులు,అర్థం లేని వివాదాలు,సముద్ర తీరంలో అలజడి సంభవం.
మేష రాశి: పోగొట్టుకున్నారనుకున్న ఆరోగ్యం తిరిగి పొందుతారు.ఈ వారం అనుకున్న పనులు నెరవేరుతాయి.ఇతరులను అపార్థం చేసుకున్నామని బాధ పడతారు.ఇటీవల అలవాటయిన తొందర పాటు వ్యవహారం నుండి బయట పడతారు.ఆలోచనలను అదుపులో ఉంచవలసిన వారం.విష్ణు సహస్రనామం చదవండి.
వృషభ రాశి: నిరుద్యోగులకు మంచి వారం.సంఘం లో గౌరవం లభిస్తుంది. కొత్త భాగస్వామ్యం ఏర్పడే సూచనలున్నాయి. గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టర్లు లాభాలు పొందగలరు.ఈ శుక్రవారం ఒక వ్యవహారం ముగుస్తుంది.
మిథున రాశి: ఒక ఆలోచన కలసి వస్తుంది.కొత్త వస్తువులు సేకరిస్తారు.దైవానుగ్రహం లభిస్తుంది.ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది.విష ప్రయోగం ఉండగలదు.జాగ్రత్త వహించాలి. ఈ గురువారం మంచి వార్త వింటారు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కర్కాటక రాశి: నూతన పరిచయాలు ఏర్పడగలవు.మీ శ్రమకు తగిన గుర్తింపు లభించగలదు.ఒక ప్రేమ వ్యవహారం కనిపిస్తున్నది. చెప్పుడు మాటలు నమ్మటం అంత మంచిది కాదు.మహాసౌరం చదవండి.
సింహ రాశి:జీవితంలో అన్నీ యస్ నో లతో కాదని గ్రహించాలి. ఒక న్యూట్రల్ గేర్ వాడుకోవటం వలన చాలా సమస్యలకు సమాధానం లభిస్తుంది.మీ వెనుక రహస్య మంతనాలు జరుగగలవు.ఈ మంగళ వారం ఒక న్యాయసంబంధమైన విషయం ముందుకు రాగలదు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
కన్య రాశి: ఇంటిలో కొంత అలజడి వాతావరణం ఉండవచ్చు.వారాంతానికి ప్రశాంతం అవగలదు.మీ ఆలోచనలు మెప్పు పొందగలవు.కళాకారులకు మంచి అవకశాలున్నాయి.సరైన చోట శ్రమించటం అవసరం అని గుర్తిస్తారు.శ్రీసూక్తం చదవండి.
తుల రాశి: ఉదర బాధలు బాధించగలవు.మిత్రులతో వివాదాలుండవచ్చు. బుధవారం మంచి ఆదాయం ఉన్నది.ఈ రాశి వారు ఇటీవల దేని కోసమో నిరీక్షిస్తూ పనులను ఆపినట్టున్నారు.ఎవరూ రారు, ఏదీ చేయరు.ముందుకు వెళ్లండి.హనుమాన్ చాలీసా చదవండి.
వృశ్చిక రాశి: విదేశీ యానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక మంచి వార్త వింటారు.తీరా వెళ్లాలనుకున్నప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో రాని అవకాశం రాగలదు. గ్రహ దశ చూసుకుని నిర్ణయం తీసుకోగలరు. బంధువుల పట్ల జాగ్రత్తలు వహించాలి.పిల్లలు మంచి వార్తలు వినిపిస్తారు.లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
ధను రాశి: బాధ్యతలు పెరగనున్నాయి.గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు ఈ వారం శ్రమ అధికం కాగలదు. వీలయినంత మౌనం పాటించటం మంచిది.ఆదాయం బాగుంటుంది.మిగతా విషయాలలో మంచి వారం.కొత్త చదువుల పట్ల ఆసక్తి పెరగగలదు.
మకర రాశి: మీ కార్యానుకూలతకు ఇది చాలా మంచి వారం.మిత్రులకు సహాయం చేస్తారు.వ్యవసాయ రంగంలోని వారికి కొంత ఊరట లభించగలదు.రక్తపు పోటు ఉన్న వారు శ్రధ్ధ వహించాలి.ఒక ఋణం లభించగలదు.
కుంభ రాశి: నూతన ఉత్సాహం కనబరుస్తారు.కళ్ల విషయంలో శ్రధ్ధ వహించాలి.అనుకోని సంఘటన ఒకటి ఎదురు కాగలదు. తొందరపడి వ్యవహరించినట్లయితే ఇబ్బందులు ఎదురు కాగలవు.కొంత పరిశీలన అవసరం.శివాలయం సందర్శించండి.
మీన రాశి: వ్యాపారస్తులకు మంచి వారం.నూతన వస్త్రాలు కొంటారు.ఉద్యోగులకు పదోన్నతి ఉన్న వారం. స్త్రీలకు అన్నింటా కలసి రాగలదు. ఏదైనా డ్రా లాంటిది ఉన్నట్లయితే అదృష్టం కలసి వస్తున్నది.సంచీ సిధ్ధంగా పెట్టుకోండి! కులదైవాన్ని కొలవండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదినం
వత్సం గౌరివ గౌరీశో ధావంతమనుధావతి
పరమశివుడు ‘మహాదేవ ‘ అని ఉచ్చరించు వాని వైపుకు వత్సల అయిన గోవు తన లేగదూడ వెంట పరుగిడునట్లు పరుగిడును.
శ్లో: మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్
ఏకేన ముక్తిమాప్నోతి ద్వాభ్యాం శంభూ ఋణీ భవేత్
ఎవడైతే మూడు మార్లు ‘మహాదేవ ‘ అని ఉచ్చరించునో వానికి ఒక్క నామం ఉచ్చరించుట వలన భగవంతుడు ముక్తిని ప్రసాదించును.మిగిలన రెండు మార్లు ఉచ్చరించుట వలన వానికి శివుడు ఋణపడును అని భావము.
(వేదాంత సిధ్ధాంతానుసారము శబ్దము వలననే తత్వ సాక్షాత్కారమగును!)
మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి:శాంతి: శాంతి:
~~~***~~~
Predictions according to Sun Signs in English can be viewed at www.sripati.com

శ్రీసూక్తం-డా.వి.ఎ.కుమారస్వామి గారి వివరణ (రెండు,మూడు భాగాలు)

శ్రీసూక్తం-డా.వి.ఎ.కుమారస్వామి గారి వివరణ (మొదటి భాగం)

శ్రీసూక్తం మీద వివరణ ప్రతి శుక్రవారం ఇక్కడ చూడగలరు. సందేహాలు తెలియపరిస్తే వారు సందేహనివృత్తి చేయగలరు.

Follow

Get every new post delivered to your Inbox.