‘ టోర్న్ కర్టెన్ ‘-హిచ్ కాక్ సినిమా మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు
19 డిసెం 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-చిత్రం
పైన ఉన్న క్లిప్పింగు ఒక సారి చూద్దాం. ఈ క్లిప్పింగు వెనుక ఒక కథ ఉంది. సామాన్యంగా ఒక మనిషిని చంపటం తేలిక అని అనుకునే రోజులలో హిచ్ కాక్ అది ఎంత జాగ్రత్తగా చూపించాలో చిత్రీకరించి చూపాడు.ఈ చిత్రం మీద వచ్చిన విశ్లేషణలు కూడా ఈ అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆ మహిళ వాడిన చాకు లేదా కత్తి అతనిలోకి చాలా తేలికగా దిగిపోయి అతను కొంత బాధ పడ్డా అంతగా ప్రభావితం అయినట్లు కనిపించదు.అది శరీరంలోకి దిగినప్పుడు ఒక కట్ షాట్ ఉంది. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. ఒక అమెరికన్ శాస్త్రవేత్త కోపెన్ హేగెన్ కు బయలుదేరుతాడు. అక్కడి నుంచి ఈస్టు బర్లిన్ కు వెళ్లి ప్రొ. లింట్ ఏంటి మిసైల్ ఫార్ములాను కనుక్కుని తిరిగి పారిపోవటం చిత్రం యావత్తూ ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపూ మన దృష్టిని మళ్లించటం కష్టం. పాత్రలు ఒక చోటు నుండి మరో చోటుకి దూకినట్లు కథనం కూడా ఆయా ప్రదేశాలలోని సన్నివేశాలను చాలా బ్రిస్కుగా ఉంటుంది.
హిచ్ కాక్ పంథాలో ఒక చిత్రమైన పాత్ర చివరి దశలో తగులుకుంటుంది. ఈవిడ అమెరికాకు వెళ్లటానికి స్పాన్సర్ అడుగుతూ వీళ్లకి (హీరోకి,తనతోనున్న అమ్మాయికి)సహాయం చేస్తుంది. ఈటువంటి పాత్రల సమావేశం, చిత్రీకరణ ఇటువంటి ఇతివృత్తాలలో రక్తికట్టినప్పుడు కథనానికి మరింత బలం వస్తుంది. నటించిన మహిళ (లిలా కెద్రోవా)కూడా బాగా నటించింది.
ఆఖరు సన్నివేశం కూడా ఇలా జరగవచ్చు అనిపించేటట్లు నడుస్తుంది. ఈ చిత్రం నుంచి కల్పనను నిలబెట్టవలసిన ప్రాంతం ఎంత జాగ్రత్తగ సృష్టించాలో అర్థమవుతుంది. ఈ చిత్రంలో పాల్ న్యుమాన్, జూలీ ఏండ్ర్యూస్ నటించారు.
ఇటీవలి అభిప్రాయములు