నెమలి,నృత్యం-వేదాంతం శ్రీపతిశర్మ

‘సప్తపది’ చిత్రం లోని ఈ పాట చాలా విషయాలలో ముందుంటుంది.వేటూరి గారి పదాలు మహదేవన్ గారి సంగీతంతో అల్లుకుని నెమలి కదలికల అందమైన అనుభూతిని అందిస్తాయి.జానకి గారు పాడినట్లు ఈ పాట మరొకరు పాడలేరేమోననిపిస్తుంది. విశ్వనాథ్ గారి ఈ చిత్రంలో ఇదొక మరువ లేని ప్రక్రియ!


27.12.09 నుంచి 02.01.2010 వరకు రాశిఫలాలు

‘Three Idiots’-A review of the movie by Vedantam Sripatisarma

Those of you who have read the book ‘Five Point Some One’ by Chetan Bhagat will find this movie more interesting. Those who haven’t,will find interest in life’s very basic question-Is life a creative process or a mechanical one?

Well. The scene ‘conceived’ towards the end of the movie-delivering a baby boy with the help of innovative thinking as everything including the power fails is truly  very apt and speaks volumes about the creative brilliance of the director!

The movie has been directed by Rajkumar Hirani,produced by Vidhu Vinod Chopra,written by the director alongside Abhijit Joshi while music has been scored by Shantanu Moitra. The movie has been released for public viewing on 25.12.2009.

There are three students who enter the ICE (Imperial College of Engineering) whose director (played wonderfully by Boman Irani) is after the students who are required to top and no second fiddle impresses him. Ranchu (Aamir) is the counter who has his own philosophy-listen to your heart and do not run after success. Success will follow you. He is joined by two others-Farhan Qureshi (Madhavan) and Raju Rastogi (Sharman Joshi). The campus tribulations and the college antics pass off with some entertainment and the episode where the studious character Chatur Ramalingam (Omi Vaidya) reads out a welcome  speech altered by Aamir goes down as pretty hilarious. The word ‘Balatkaar’ substitutes the word ‘Chamatkaar’ and the rest is sheer laughter.

Rancho tops while the other two learn their lessons in life from him. Quereshi turns out to be a wild life photographer and Rastogi stands up to himself. However, it turns out that Rancho is not the real name of Aamir. He had taken the name only as part of an Agreement only to hand over the certificate to his master’s son. His real name is Wangdu who is now the most sought after scientist with patent rights for several companies  across the globe. Chatur Ramalingam comes in search of him without knowing that this was Aamir and draws the other two for a different purpose. He demonstrates to them about his success as ordained in a bet and the three set out in his search. This is how the movie takes off. The reunion of Aamir and Kareena Kapur ( Irani’s daughter) is also arranged. As Chatur realizes that Wangdu is none other than Aamir, he runs behind him and the movie ends by the statement-Success will chase you…

A well made movie which is entertaining throughout. Just as you think that there is something serious happening, the lighter vein is used to dilute the atmosphere and this is the craft which holds the entire treatment together. This runs parallel to he very character of Aamir Khan. Aamir carries the whole movie with him with absolutely free style acting. Omi Vaidya and Sharman Joshi have also come up with creditable performances. Madhavan is at his usual ease. Kareena looks more like a female wrestler and with Aamir, perhaps gives a real creative job for the Camera man to put them in the right frame!

Music is pleasing as well. The duet with Kareena resembles the ‘Jise Dhundtaa hun maein…’ from ‘dil chaahtaa hai’.

The stripping of pants, the toilet scenes are found to be one in too many. Some moderation might only have helped the movie’s class a long way.

A movie worth seeing.

~~~***~~~

www.filmreviewsonline.org

Mr Home Minister,What’s your problem?-Vedantam Sripatisarma

I find Mr.Chidambaram either acting very funny or having a covert or overt intention to ruin the State of Andhra Pradesh.

It is possible that he has a third attribute as well-he is actually not  equal to his task. (Some have this feeling that he has a terrible constipation these days!)

This Minister for Home affairs appears to be following news articles or just the Political statements made by the A.P. leaders to conclude that all parties were favouring the formation of Telengana. He goes on to issue a Press Release stating that the process will therefore begin! Well. Whether he is aware of the list(s) of subjects in the three lists-Union,Concurrent and State lists is in itself in question since he calls for a resolution in the State Assembly. He has done this not once but twice now.

Subsequently he points out in his latest version of his understanding that there is difference of opinion ‘now’ and therefore a consensus needs to be worked out. What is this nonsense? Does this country have a Political and Administrative process in place?What is he trying to say?

I would presume that the Union Home Minister would do well to visit the State in person, have a first hand assessment of the scenario, talk to the key players and submit a joint briefing to the ‘Core Committee’. This method of broadcasting theseAkashvani gospels from Delhi and getting away with creating chaos in the State is not only a trifle high handed but glaring in its exhibition of lack of Political expedience as well. A reluctance to explain what he has said on two occasions (both blunders) compounds this unfortunate stance not quite expected of him.

There was a time when N.T.Rama Rao had been dismissed by the then Governor Ram Lal while quoting ‘a law and order situation’. V.M. Tarkunde, Arun Shourie, and Nani Palkhiwala addressed a public gathering in Hyderabad those days. I was also in the crowd and I remember an interesting  statement made by the late Palkhiwala. ‘The Governor might have a right to dismiss a government if there is a serious and uncontrollable law and order situation. He does not have a right to create such a situation!’. This was what he said.

Well. This time it is the Home Minister for a change. He is continuing to make not one, but several free attempts. The silence in Delhi which punctuates in between these attempts is actually worth noting. Jurisprudence and some objective analysis would once again point a finger at the Centre -Is there a deliberate design here? There is every reason to suspect this glorified clerk who has not cared to relate himself to the State Administration and actually involve in the issue. President’s Rule is in the pipe line…(it was quite there as the very purpose).

The message is clear. Both the groups need to realize this as early as possible.

Well. I would say only so much that Mr.Chidambaram has not even bothered to do some acting as perhaps others would have done!He is certainly not equal to his task. His inabilities would be covered more efficiently in the figure work of the Finance Ministry but not in such a place which is a virtual crucible which puts your real faculties to test (also to rest!). Some have also opined that since he hails from a State which has greedily grabbed more Cabinet berths with a far less number of MPs and a prospering IT sector in Hyderabad has not worked well with the neighbours. This could be a far fetched idea but the way he has been behaving at crucial times does leave some apprehensions…

~~~***~~~

రాశి ఫలాలు

‘ టోర్న్ కర్టెన్ ‘-హిచ్ కాక్ సినిమా మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

పైన ఉన్న క్లిప్పింగు ఒక సారి చూద్దాం. ఈ క్లిప్పింగు వెనుక ఒక కథ ఉంది. సామాన్యంగా ఒక మనిషిని చంపటం తేలిక అని అనుకునే రోజులలో హిచ్ కాక్ అది ఎంత జాగ్రత్తగా చూపించాలో చిత్రీకరించి చూపాడు.ఈ చిత్రం మీద వచ్చిన విశ్లేషణలు కూడా ఈ అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆ మహిళ వాడిన చాకు లేదా కత్తి అతనిలోకి చాలా తేలికగా దిగిపోయి అతను కొంత బాధ పడ్డా అంతగా ప్రభావితం అయినట్లు కనిపించదు.అది శరీరంలోకి దిగినప్పుడు ఒక కట్ షాట్ ఉంది. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. ఒక అమెరికన్ శాస్త్రవేత్త కోపెన్ హేగెన్ కు బయలుదేరుతాడు. అక్కడి నుంచి ఈస్టు బర్లిన్ కు వెళ్లి ప్రొ. లింట్ ఏంటి మిసైల్ ఫార్ములాను కనుక్కుని తిరిగి పారిపోవటం చిత్రం యావత్తూ ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపూ మన దృష్టిని మళ్లించటం కష్టం. పాత్రలు ఒక చోటు నుండి మరో చోటుకి దూకినట్లు కథనం కూడా ఆయా ప్రదేశాలలోని సన్నివేశాలను చాలా బ్రిస్కుగా ఉంటుంది.

హిచ్ కాక్ పంథాలో ఒక చిత్రమైన పాత్ర చివరి దశలో తగులుకుంటుంది. ఈవిడ అమెరికాకు వెళ్లటానికి స్పాన్సర్ అడుగుతూ వీళ్లకి (హీరోకి,తనతోనున్న అమ్మాయికి)సహాయం చేస్తుంది. ఈటువంటి పాత్రల సమావేశం, చిత్రీకరణ ఇటువంటి ఇతివృత్తాలలో రక్తికట్టినప్పుడు కథనానికి మరింత బలం వస్తుంది. నటించిన మహిళ (లిలా కెద్రోవా)కూడా బాగా నటించింది.

ఆఖరు సన్నివేశం కూడా ఇలా జరగవచ్చు అనిపించేటట్లు నడుస్తుంది. ఈ చిత్రం నుంచి కల్పనను నిలబెట్టవలసిన ప్రాంతం ఎంత జాగ్రత్తగ సృష్టించాలో అర్థమవుతుంది. ఈ చిత్రంలో పాల్ న్యుమాన్, జూలీ ఏండ్ర్యూస్ నటించారు.

ఫుట్ బోర్డు ట్రావెల్-వేదాంతం శ్రీపతిశర్మ

సుబ్బారావు ఉదయాన్నే మరల అరుగు మీదకు వచ్చి కూర్చున్నాడు.అరుగు అంటేనే ఆయనకు వల్లమాలిన ప్రాణం.ఆంధ్రుడికి,ఆరు బయట అరుగుకీ మా సెడ్డ సంబంధం ఉంది లెండి.

‘కాఫీ…’ ఆవిడ గొంతు వినిపించింది.జాగ్రత్తగా అందుకున్నాడు.

‘దారే పోయే వాళ్లమీదే ధ్యాస! ఆ అమ్మాయి సందు తిరిగే వరకూ నేను అస్సలు కనిపించలేదు…’ వార్తా పత్రికలోని హెడ్ లైను చదివినట్లు ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చేసింది. సుబ్బారావు చిరునవ్వు నవ్వాడు. కాఫీ గ్లాసును జాగ్రత్తగా చూశాడు.

‘ చిట్టీ…ఓ మాట అనుకుందాం. ఇంద్రభవనాన్ని వెనకాల పెట్టుకుని ఇంటి బయట ఇలా అరుగు మీద కాఫీ ఎందుకు సేవిస్తున్నానో తెలుసా?’

ఆవిడ వెనక్కి చూసింది.ఇది మన ఇల్లేనా అనే సందేహం కూడా కలిగింది.

‘ఏముందీ…కథలు చెప్పటానికి!’

ముక్కు మీద వేలు పెట్టాడు సుబ్బారావు.

‘ అదేవన్నమాట? మనం కథలు చెప్పం, వ్రాయం. మన గురించి…’

‘ప్రపంచం కథలు చెప్పుకుంటుంది. అంతేనా?’

‘ మరల పప్పులో కాలేశావు. ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు.రెండు దశాబ్దాల తరువాత నా మీద పరిశోధన చేసి రేట్లు నిర్ణయించి మరీ డాక్టరేట్లు తీసుకుంటారు!’

‘అరుగు మీద ఎందుకు కూర్చున్నారు మాష్టారూ?’

‘గుడ్ క్వెష్చన్! మనం ఆంధ్రులం. అందరి బాగోగులు మనకి ప్రధానం. అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి.’

‘ కొద్దిగా మారుస్తాను.’

‘అలాగే. అర్థాంగికి అర్ధం మార్చే అధికారం ఉంది. అంటే సగమే!’

‘ అందరూ బాగుండాలి అని కాదు. అమ్మాయి బాగుంటే చాలు. అదీ సంగతి!’

‘ ఐ విల్ ఎక్స్ ప్లెయిన్. ఇది గూఢమయినది.’

‘ఏమిటి? అమ్మాయిలని చూడటమా?’

‘ అది కాదు.అది కూడా ఆర్టే అయినా నేను దాని గురించి ఆట్టే   చెప్పను.నేను ఫుట్ బోర్డు ట్రావెల్ గురించి చెబుతున్నాను.’

‘ మన కాలనీలోకి బస్సులెప్పుడు వచ్చాయి?’

‘ అక్కర్లేదు. అదుగో ఆయనను చూడు.చెవిలో మొబయిల్ పెట్టుకుని అవతల ఉన్న ఆయనకి సైగలు చేస్తూ ఎటో పారిపోతున్నాడు. అన్నీ సగం సగమే! ఆఫీసరు కూడా ఎక్కడినుండో ఫోను చేసి నువ్వున్నావా? ఉండు అంటాడు.నేనా, వస్తున్నానని రోజంత చెబుతూనే ఉంటాడు. ఆఫీసుకు వచ్చిన వాడు కూడా ఇపుడే ఇదుగో ఇప్పుడే వస్తానని మొబయిల్ పట్టుకుని పారిపోతాడు. ప్రొగ్రాం కూడా ఇదుగో ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అంటుంది.అంత సగమే! ఎవరిని కదిలించినా మళ్లీ మాట్లాడుతాను అంటాడు. అప్పుడు మటుకు మట్లాడడు.అందరూ ఫుట్ బోర్డు మీద ప్రయాణమే…లోపలికి వెళ్లం, కిందకి దిగం.’

‘ అందుకా మీరు అరుగు మీద కూర్చుంది? ఇదో ఇంటి ఫుట్ బోర్డన్నమాట!’

‘ప్రతి దానినీ ఎత్తి పొడవకూడదు చిట్టీ! ఇది నేను చెప్పినట్లు లోక సంరక్షణార్థం! అసలు ఇల్లు కట్టేదే అరుగు కోసం. ఆలోచించు.అరుగు మీద కూర్చుని ఇలా నీ చేతి కాఫీ త్రాగుతుంటే ఒకటి ఏమిటి? దేని మీదనైనా మాట్లాడేయవచ్చు ‘

‘ బావుంది వరస. నేను లోపలికి వెళతాను.’

‘ అరే! అంత తొందరగా వెళితే ఎలా? పార్టీలన్నీ తెలంగాణా మీద చేసింది ఫుట్ బోర్డు ట్రావెలే!’

‘ ఓహో!’

‘ అదన్నమాట. ప్రజలు చేతిలో కర్ర పట్టుకుని దిగుతావా, బస్సు లోపలికి పోతావా? అన్నారు. చచ్చినట్లు రాజీనామాలు చేసి మేకపోతు గాంభీర్యంతో అటూ ఇటూ చూస్తున్నారు.’ ‘ అవునూ,ఒకటి చెప్పండి…’

‘ ఒకటేమిటి? ఇది అనాదిగా వస్తున్న అరుగు పీఠం. ధర్మరాజు తొలుత ఇటువంటి అరుగు మీదే అరంగేట్రం చేశాడు. ఈ అరుగు మీదనే అడుగు!’

‘ ఇంతకీ తెలంగాణా రావాలా? వద్దా?’

‘ ఖచ్చితంగా అక్కరలేదు.’

‘ ఆ? అంత ధైర్యంగా చెబుతున్నారా?’

‘అబ్బా అడిగింది చెప్పరు కద?’

‘ అరే! అలా చెప్పేస్తే కాలానూగుణంగా నడుచుకోడు వెధవ అంటారు.ఇది ఫుట్ బోర్డు ట్రావెల్ చేయవలసిన కాలం.ముందు సగమే! అసలు తెలంగాణా ప్రాంతం వారు తప్ప అందరు ఎం.ఎల్.ఏలూ రాజీనామా చేసేస్తే శాసనసభలో మిగిలింది తెలంగాణా ఎం.ఎల్.ఎలే కదా?’

‘కరెక్ట్!’

‘ అయిపోయింది. తెలంగాణా శాసనసభ సింపుల్ గా ఏర్పడిపోయింది.’

‘ ఇవి మీ అరుగు తెలివి తేటలు! అరుగు మీద తెలివి అరిగిపోతోంది మరి!’

‘ఎంత మాట? అసలు ఒక కొత్త రాష్ట్రం ఎలా ఏర్పడుతుంది అనేది గృహమంత్రికి, ఆర్థిక మంత్రికి, ప్రధానమంత్రికి తప్ప అందరికీ తెలుసు!’

‘ అధిష్ఠానం?’

‘ దానికి పుట్టినరోజు పండుగల గురించి తప్ప మరేదీ తెలియదు. నాలుగు పూల బస్తాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు!’

‘ఇంతకీ మీరు లోపలికి దయ చేస్తారా లేక అరుగు దిగి అటు నుంచి అటే…’

‘ ఎంత మాట? నేను నీ ప్రతినిధిని. నకు వోటేసి ఎన్నుకుని, సెలెక్ట్ చేసి పెండ్లి చేసుకున్నావు.  మనం  స్థిర నివాసం ఏరపరచుకున్నాము.’

‘ అంటే అర్థం కాలేదు. అటు వెళతారా ఇటు లోపలికి వస్తారా?’

‘ ఇక్కడ కూర్చున్నంత మాత్రాన బయటకు వెళతానని అర్థం కాదు. వస్తాను. అరుగు మీద రోజంతా కూర్చోలేము కదా?’

‘ సరే లోపలికి రండి.’

‘ అలాగే! తప్పకుండా. నీ చేతితో మరో కప్పు కాఫీ అందించు. ఈ లోపల ఇలా వెళుతున్న ఫుట్ బోర్డు ట్రావెలర్సును చూసేద్దాం…’

‘ఖర్మ!’

~~~***~~~


ఇదెలా తయారయింది?-వేదాంతం శ్రీపతిశర్మ

ఇదెలా తయారయింది?

ఒక సరదాప్రశ్న-వేదాంతం శ్రీపతిశర్మ

ఇదేమిటి?


మిత్రులు-వేదాంతం శ్రీపతిశర్మ

లైటు తీయగానే నన్ను పూర్తిగా కమ్మేసి వాటేసుకుంది నా చీకటి

నన్ను పచ్చిగా,పిచ్చిగా,ఎంతో వెచ్చగా ప్రేమిస్తుంది…

తెలియని వెలుతురులో రోజంతా ఆడిన నన్ను

వెల లేని ఒడిలోకి చేర్చుకుంటుంది

నీడను పెద్దగా నమ్మలేను!

వెలుతురుంటేనే ఉన్నానంటుంది…

చీకటి సింహద్వారం లోకి ప్రవేశించాను

చీకటి చక్రవర్తిది ఏక ఛత్రాధిపత్యం!

నా కదలిక నన్నే నవ్వించింది

గోడ అడ్డు కాదు, ఆధారమైంది

మనసు గూడులో మాటల పిచ్చుకలు

కదిలింది కాలసర్పమేమోనని మరింత కేరింతలు

కటిక చీకటిలో కాటుకెందుకురా వికట వేషధారీ!

విరిగిన విపంచితో గానమెందుకురా నీవు కనిపించని ప్రపంచానికి?

అడ్డకాళ్ల నడకే నాట్యమనుకునే కళాకారుడు వీడు

అడ్డగీతలే విశ్వరచన అనుకునే ‘కలంకారుడు ‘ వీడు

యాగమెందుకు, యోగమెందుకు, సమాధి ఎందుకు, మోక్షమెందుకు?

నిన్ను శోధించి కమ్మేసిన నిజం కోసం నీ నిరంతర సాధనెందుకు?

చీకటి ఒడిలో జోలపాటకు పిచ్చివాగుడు పిచ్చుకల తాళమా?

శబ్దము బ్రహ్మము. లోలోని నిశ్శబ్దము బ్రహ్మము. శబ్దబ్రహ్మము ప్రస్తుతం నిశ్శబ్దము…

అహం బ్రహ్మాస్మి! నా కలలు నా నిండు సంతానం!

ఇంత చీకటీ ఈ చిన్నవాడికి ఒక దుప్పటీయే!

శ్వాసనిశ్వాసల సవ్వడి నిదుర పాడు జోలపాటే!

ఉదయరాగాన ఆ మిత్రుడుదయించుగాక…

ఇటు చీకటి,అటు నిద్ర ప్రస్తుతం నా చిరకాల మిత్రులు…

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.