బీరకాయ పొట్టు,అరాచకం-వేదాంతం శ్రీపతిశర్మ
30 నవం 2009 అభిప్రాయములు
in వార్తాలాపం
సుబ్బారావు అయ్యప్ప ఆసనంలో అరుగు మీద కూర్చున్నాడు. కొద్దిగా ఛలి ఉన్నందుకు కట్ బనియను మీద ఒక చొక్కా తొడిగినా లుంగీ మటుకు పైకి కట్టి కూర్చుని పేపరు తిప్పుతున్నాడు. ‘అరాచకం ‘,అన్నాడు.
‘ఏమిటీ అరాచకం? ‘,లోపలినుండి వాళ్లావిడ గొంతు వినిపించింది. కొద్దిగా ఆలోచించాడు.
‘ ఇంత సేపయిన కాఫీ ఇవ్వకపోవటం ‘
‘ కానే కాదు. టైము చూసుకోండి.నన్నంటే పడేది లేదు.’
‘ టి,ఆర్.ఎస్ గొడవ కూడా అరాచకమే!’
‘అంటే, కాఫీ ఇవ్వకపోవటం అరాచకమేనా?’ ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది.
‘ఇచ్చాక అరాచకం కాదు ‘
‘బావుంది. ఇంకా ఏ అరాచకాలున్నాయో చెప్పండి.
‘ ‘పండగకి పిలిచి నన్ను భోజనాలకు పిలవలేదు మీ అయ్య!’
‘ ఇంకా అదే మాట చెప్పటం అరాచకం ‘
‘ 2004 లో టి.ఆర్.ఎస్ తో యుగళగీతం పాడిన యు.పి.ఏ మరి వాళ్లను ప్రక్కన పెట్టటం అరాచామె కదా?’
‘ నాకేమీ తెలియదు.
‘ ‘ వంటలోకి ఏమి చేస్తున్నావు?’ ‘ఈ రోజు బందు! ‘
‘ఇది తెలుసు ‘ ‘బీరకాయ పొట్టు.జాగ్రత్తగా దాచాను!’
‘ఇది అసలు అరాచకం ‘
‘ ఆడవాళ్లకన్నీ అరాచకాలే!’
‘ ఒస్మానియాలో విద్యార్థులని అలా కొట్టటం అరాచకం! అదేం పని?’
‘ఇంతకీ బీరకాయ పొట్టు వద్దా?’
‘అరాచకం ‘ ‘అబ్బా…’
‘తెలంగాణా వస్తుందంటావా?’
‘అబ్బా చెప్పండి. బీరకాయపొట్టు…’
‘ఏమీ లేనప్పుడు దాని విలువ తెలుస్తోంది. అయినా నాకు బీరకాయపొట్టు ఏమిటే ఈ రోజు?’
‘ తప్పదు. మీరే అంటున్నారు కదా?’
‘ అరాచకం.ఏం చేస్తాం? ఎన్నికలలో ఏమి చేయలేని కె.సి.ఆర్ అలా హీరో అయిపోయాడు.’
‘ ఈ రోజు బీరకాయ పొట్టు…’
‘ అరాచకం. ఏది రాజకీయమో ఏది సామాన్యమైన విషయమో ముఖ్యమంత్రి గారికి తెలియలేదు.’
‘ చెప్పండీ, బీరకాయపొట్టు…’
‘ అరాచకం. ఇది మటుకు అరాచకమే!ఎంత ఇదైతే మటుకు, ఇంత ఇదా?’
‘ అబ్బా చెప్పండీ…’
‘ తెలంగాణా ప్రజల ఉద్యమం అంటావా?’
‘ అబ్బా,నాకెందుకండీ? బీరకాయ…’
‘ ఏ బీరకాయ? నెయ్యి ఉన్న బీరకాయేనా? దాని పొట్టైతే ఓ.కే! లేకపోతే అరాచకం!’
‘ అరాచకం లేదు,వంకాయ లేదు. బీరపొట్టు ఆరోగ్యానికి మంచిదని మంతెన వారు నిన్న ఒక వంతెన మీద ప్రొగ్రాం ఇచ్చి చెప్పారు!’
‘ ఇది మరో అరాచకం! ఆయనను ఒక్క సారి చూడాలని ఉంది…’
‘ఇంతకీ చెప్పండి.నాకు టైం అవుతోంది.’
‘ కాలమంతా అరాచకమే! మొత్తానికి ఉద్యమం ఉందా లేక మళ్లీ అన్నీ మామూలేనా?’
‘ బీరపొట్టును చూసి ఆరోగ్యం గురించి అలోచించండి.’
‘ ఆరోగ్యం ఒక్కటేమి ఖర్మ. కూరగాయలు, ధరలు, ద్రవ్యోల్బణం, మట్టీ, భూమి,ఆకాశం అన్నీ ఆలోచిస్తాను. కొద్దిగా తెలంగాణా గురించి కూడా ఆలోచిస్తాను. లోపలికి పద. సంక్రాంతి రాకుండానే గంగిరెద్దు వాడు బయలుదేరాడు…’
‘ ఇంతకీ బీరపొట్టు చేయమంటారు. వద్దంటే అదిగో, గంగిరెద్దుకు వేసేస్తాను.’
‘ అది తలూపుతుంది. నేనలా కాదు. బీరపొట్టు తినలేను. అరాచకం.’
‘ నా మాట వినకపోతే అసలు అరాచకం నేను చూపిస్తాను.’
‘ ఇదే అరాచకం. వింటే ఒక బాధ. వినకపోతే మరొకటి. ప్రభుత్వం కళ్లు మూసుకుని గంగిరెద్దులా ప్రవర్తించింది. రాబోయేది గంగానమ్మ జాతరే!’
‘ బీరపొట్టు…’
‘అరాచకం ‘
~~~***~~~

నవం 30, 2009 @ 08:00:22
నవం 30, 2009 @ 09:08:57
ఇంతకీ ” బీరపొట్టు..”?
నవం 30, 2009 @ 12:49:07
వేపుడు బదులు పచ్చడి చేయించుకున్నాడు సుబ్బారావు!
డిసెం 01, 2009 @ 04:42:33