నవంబరు 6, 2009...12:18 అపరాహ్నం

‘వంకాయ కబుర్లు’-వేదాంతం శ్రీపతిశర్మ

Jump to Comments

నమస్కారం. ఇపుడు మన ముందు, కాదు పక్కన వంకాయ మీద ఎంతో పరిశోధన చేసి,ఎన్నో విషయాలను కనుక్కున్న డాక్టర్ వంకమామిడి వెంకటరావు గారు ఉన్నారు.
‘నమస్కారం అనుకుందామండీ’
‘నమస్కారం’
‘ఇప్పుడూ…వంకాయ అని మనం అనుకుంటూ ఉంటాం…’
‘అదేనండీ…వంకాయ అని చెప్పేసి మనం అంటాం’
‘అదేనండీ! వంకాయ అంటాం. అసలు వంకాయ…’
‘అలాకాదండీ.వంకాయ అన్న తరువాత ఏమవుతుందంటే మరి వంకాయ అని జెప్పేసి మరి మనం అనాల్సి ఉంటుంది. అంచేత ఏమిటంటే వంకాయ అన్న తరువాత…’
‘కరెక్ట్! వంకాయ అన్న తరువాత ఏమవుతుందంటే…’
‘అలాక్కాదండీ.మీరు వంకాయ అంటున్నారు…’
‘కరెక్ట్! వంకాయ అన్న తరువాత మరి వంకాయ అంటున్నారు, అలాగే మరి వంకాయ అనేసి కూడా అంటున్నారు….’
‘ అదీ.అంచాత చూశారూ, వంకాయ అనాలి. వంకాయ అన్న తరువాత మరి అల్లా ఉంటుంది..’
‘ వంకాయ…’
‘అదేనండీ…మీరేమంటున్నారు? నేను..’
‘ అరే! ఇందులో అనేందుకేమీ లేదు. అనుకునేందుకు అసలేమీ లేదు.వంకాయ అన్న తరువాత మరి…’
‘ కరెక్ట్! వంకాయ అనేది వంకాయే!’
‘చేయగల్లిగింది ఏమీ లేదండీ…’
‘ఏముంటుందండీ? వంకాయ కద మరీ?’
‘కరెక్ట్. అయితే వంకాయ అని చెప్పేసి మనం మరి అంటున్నాం…’
‘తప్పకుండా సార్. వంకాయ అన్న తరువాత మరి,వంకాయ అనాలి, ఆ తరువాత వంకాయ అంజెప్పేసి మరి మనం అనాలి, అలాగే వంకాయ అని కూడా మనం చెప్ప్కోవాలి.’
‘ బాగుంది సార్. వంకాయ గురించి మాకు తెలియనివి,తెలుసునని అనుకున్నా నిజంగా తెలియనివి,అలాగే తెలుసుకోవాలని అనుకున్నా అస్సలు తెలుసుకోలేనివి చాలా విషయాలు చెప్పారు, మరల నమస్కారం అనుకుందాం!’
‘నమస్కారం’
~~~***~~~

అభిప్రాయములు


ప్రత్యుత్తరమిమ్ము