బీరకాయ పొట్టు,అరాచకం-వేదాంతం శ్రీపతిశర్మ
30 నవం 2009 అభిప్రాయములు
in వార్తాలాపం
సుబ్బారావు అయ్యప్ప ఆసనంలో అరుగు మీద కూర్చున్నాడు. కొద్దిగా ఛలి ఉన్నందుకు కట్ బనియను మీద ఒక చొక్కా తొడిగినా లుంగీ మటుకు పైకి కట్టి కూర్చుని పేపరు తిప్పుతున్నాడు. ‘అరాచకం ‘,అన్నాడు.
‘ఏమిటీ అరాచకం? ‘,లోపలినుండి వాళ్లావిడ గొంతు వినిపించింది. కొద్దిగా ఆలోచించాడు.
‘ ఇంత సేపయిన కాఫీ ఇవ్వకపోవటం ‘
‘ కానే కాదు. టైము చూసుకోండి.నన్నంటే పడేది లేదు.’
‘ టి,ఆర్.ఎస్ గొడవ కూడా అరాచకమే!’
‘అంటే, కాఫీ ఇవ్వకపోవటం అరాచకమేనా?’ ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది.
‘ఇచ్చాక అరాచకం కాదు ‘
‘బావుంది. ఇంకా ఏ అరాచకాలున్నాయో చెప్పండి.
‘ ‘పండగకి పిలిచి నన్ను భోజనాలకు పిలవలేదు మీ అయ్య!’
‘ ఇంకా అదే మాట చెప్పటం అరాచకం ‘
‘ 2004 లో టి.ఆర్.ఎస్ తో యుగళగీతం పాడిన యు.పి.ఏ మరి వాళ్లను ప్రక్కన పెట్టటం అరాచామె కదా?’
‘ నాకేమీ తెలియదు.
‘ ‘ వంటలోకి ఏమి చేస్తున్నావు?’ ‘ఈ రోజు బందు! ‘
‘ఇది తెలుసు ‘ ‘బీరకాయ పొట్టు.జాగ్రత్తగా దాచాను!’
‘ఇది అసలు అరాచకం ‘
‘ ఆడవాళ్లకన్నీ అరాచకాలే!’
‘ ఒస్మానియాలో విద్యార్థులని అలా కొట్టటం అరాచకం! అదేం పని?’
‘ఇంతకీ బీరకాయ పొట్టు వద్దా?’
‘అరాచకం ‘ ‘అబ్బా…’
‘తెలంగాణా వస్తుందంటావా?’
‘అబ్బా చెప్పండి. బీరకాయపొట్టు…’
‘ఏమీ లేనప్పుడు దాని విలువ తెలుస్తోంది. అయినా నాకు బీరకాయపొట్టు ఏమిటే ఈ రోజు?’
‘ తప్పదు. మీరే అంటున్నారు కదా?’
‘ అరాచకం.ఏం చేస్తాం? ఎన్నికలలో ఏమి చేయలేని కె.సి.ఆర్ అలా హీరో అయిపోయాడు.’
‘ ఈ రోజు బీరకాయ పొట్టు…’
‘ అరాచకం. ఏది రాజకీయమో ఏది సామాన్యమైన విషయమో ముఖ్యమంత్రి గారికి తెలియలేదు.’
‘ చెప్పండీ, బీరకాయపొట్టు…’
‘ అరాచకం. ఇది మటుకు అరాచకమే!ఎంత ఇదైతే మటుకు, ఇంత ఇదా?’
‘ అబ్బా చెప్పండీ…’
‘ తెలంగాణా ప్రజల ఉద్యమం అంటావా?’
‘ అబ్బా,నాకెందుకండీ? బీరకాయ…’
‘ ఏ బీరకాయ? నెయ్యి ఉన్న బీరకాయేనా? దాని పొట్టైతే ఓ.కే! లేకపోతే అరాచకం!’
‘ అరాచకం లేదు,వంకాయ లేదు. బీరపొట్టు ఆరోగ్యానికి మంచిదని మంతెన వారు నిన్న ఒక వంతెన మీద ప్రొగ్రాం ఇచ్చి చెప్పారు!’
‘ ఇది మరో అరాచకం! ఆయనను ఒక్క సారి చూడాలని ఉంది…’
‘ఇంతకీ చెప్పండి.నాకు టైం అవుతోంది.’
‘ కాలమంతా అరాచకమే! మొత్తానికి ఉద్యమం ఉందా లేక మళ్లీ అన్నీ మామూలేనా?’
‘ బీరపొట్టును చూసి ఆరోగ్యం గురించి అలోచించండి.’
‘ ఆరోగ్యం ఒక్కటేమి ఖర్మ. కూరగాయలు, ధరలు, ద్రవ్యోల్బణం, మట్టీ, భూమి,ఆకాశం అన్నీ ఆలోచిస్తాను. కొద్దిగా తెలంగాణా గురించి కూడా ఆలోచిస్తాను. లోపలికి పద. సంక్రాంతి రాకుండానే గంగిరెద్దు వాడు బయలుదేరాడు…’
‘ ఇంతకీ బీరపొట్టు చేయమంటారు. వద్దంటే అదిగో, గంగిరెద్దుకు వేసేస్తాను.’
‘ అది తలూపుతుంది. నేనలా కాదు. బీరపొట్టు తినలేను. అరాచకం.’
‘ నా మాట వినకపోతే అసలు అరాచకం నేను చూపిస్తాను.’
‘ ఇదే అరాచకం. వింటే ఒక బాధ. వినకపోతే మరొకటి. ప్రభుత్వం కళ్లు మూసుకుని గంగిరెద్దులా ప్రవర్తించింది. రాబోయేది గంగానమ్మ జాతరే!’
‘ బీరపొట్టు…’
‘అరాచకం ‘
~~~***~~~
ఒక సమాధానం,ఒక ఫొటో-వేదాంతం శ్రీపతిశర్మ
30 నవం 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!
ఇది జర్మనీలోని ఆడవాళ్ల జైలు!
29.11.09-05.12.09 వరకు రాశిఫలాలు ద్వితీయభాగం
29 నవం 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు
యఙ్ఞోపవీతం మనం ప్రస్తుతం అశ్వలాయన సూత్రాన్ని అనుసరించి ధరిస్తున్నాము. యఙ్ఞోపవీతానికి తొమ్మిది తంత్రులుంటాయన్న సంగతి మీకు తెలిసినదే. ఒక్కొక్క దానికి ఒక్కో అధిస్ఠాన దేవత అని చెప్పబడినది. 1. ప్రణవము 2. అగ్ని 3. భగుడు 4. సోముడు 5. పితృదేవతలు 6. ప్రజాపతి 7. అష్టవసువులు 8. ధర్మదేవత 9. విశ్వేదేవతలు ఈ విధంగా యఙ్ఞోపవీత ధారణం చేయటం వలన ఈ శరీరం సర్వదేవతానిలయమయి వైదిక యఙ్ఞ్య యాగాద్యనుష్ఠానానికి యోగ్యమవుతుంది.
శుభం భూయాత్!
ఓం శాంతి: శాంతి: శాంతి:
29.11.09-05.12.09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ
29 నవం 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు
శుభం భూయాత్!
ఓం శాంతి: శాంతి: శాంతి:
సత్యమప్రియం-వేదాంతం శ్రీపతిశర్మ
27 నవం 2009 అభిప్రాయములు
in శ్రీ-రచనలు
‘సత్యమప్రియం’-నేను రచించిన తెలుగు నాటికలోని ఒక చిన్న సన్నివేశం ఇది.నటులు-శ్రీ ఎల్.వి.ఎస్.ఆర్. శాస్త్రి, శ్రీ ఆర్.సాయికృష్ణన్
జాతకంలో పితృకారకుడు,సంతానం పరిస్థితి-వేదాంతం శ్రీపతిశర్మ
27 నవం 2009 1 వ్యాఖ్య
వంశాభివృధ్ధి అనునది ముత్తాతల నుండి సక్రమంగా రావలసినది. క్రిందటి వ్యాసంలో సర్పశాపం గురించి వివరించటం అయినది. విఙ్ఞానపరంగా జీన్స్ అని చెప్పే విషయం జ్యోతిషంలో సూక్ష్మంగా కొన్ని చోట్ల, స్థూలంగా కొన్ని చోట్ల వివరించటం జరిగినది.విధి వ్రాత అనేది జ్యోతిషపరంగా మరియు వైఙ్ఞానికపరంగా ఒక క్షితిజంలో కలిసేది ఈ జీన్స్ అనే అంశం దగ్గర అని వేరే చెప్పక్కరలేదు…ఒకరి ఆస్తి (లేదా నాస్తి) ఈ జీన్సే కదా! కొద్దిగా సృష్టి నియమాలలోకి వెళదాం. రవి సృష్టిని ప్రారంభించువాడు, అందరికీ జీవధారం, పితృకారకుడు, తనుకారకుడు,ఆత్మకారకుడు. పైన ఇచ్చిన బొమ్మలో రవి ప్రక్కన శని ఉన్నాడు.రవి శనులు పరస్పరం శతృవులని అందరికీ తెలిసినదే!ఇదేమిటి? శని రవికి పుత్రుడే కదా? మరి శతృత్వం దేనికి అనే ప్రశ్న సబబైనదే! జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మధ్య సంబంధ బాంధవ్యాలు వాటికి నిర్దేశించిన వ్యవసాయం (వృత్తి,ప్రవృత్తి) వలన ఏర్పడునవి. రవి తూర్పునుండి జీవితాన్నీ, ప్రాణశక్తినీ ప్రారంభించే వృత్తిని చేపడుతున్నాడు.ప్రారంభించే వాడి దగర నుండే అంతం చేయు ప్రక్రియ కూడా పుడుతుది. ఆయనే శని. జీవరాశిని కాలక్రమంలో,కలానుగుణంగా పరిసమాప్తి చేసి భూమి మీద చోటును ఏర్పాటు చేయటం శని వృత్తి.ఆయన పని రిసైక్లింగ్!అటు పడమర దిక్కున కూర్చుంటాడు. ఈ ఇద్దరూ-రవి,శని అంటే ఉదయం,అస్తమయం రెండూ ఒక చోట కలవటం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అందుచేత వారు శత్రువులు. శని కర్మసిధ్ధాంతాన్ని జాతకంలో ముందుకు తెచ్చినట్లు మరే ఏ గ్రహమూ తీసుకుని రాదు.గత జన్మ గురించి ఒకరి జాతకంలో శని ఉన్న స్థానం బట్టి, శని ఉన్న నవాంశ బట్టి చెప్పవచ్చును.జాతకంలో మేషం నుండి దశమ స్థానం మకరం-దీని అధిపతి శని. దశమస్థానం కర్మస్థానం.ఈ శనికి తండ్రి అయిన రవి ప్రజలను కర్మలు చేయమని ప్రేరేపిస్తున్నాడు (ఈ విషయంలో శృతులలోనూ, స్మృతులలోనూ ఒకే మాట్ చెప్పబడినది)రవి అధిపతి అయిన సింహ రాశి నుండి సప్తమం అయిన కుంభానికి కూడా శని అధిపతి!అందుచేత గురువు చేత సత్కర్మను ఆచరించి భాగ్యఫలమును పొంది (నవమాధిపతి గురు గ్రహం అని మీకు తెలుసు)ద్వాదశంలో మోక్షాన్ని సాధించమని ఒక జీవితచక్రం మనకు చెబుతున్నది… ప్రస్తుతం సంతాన విషయంలో జీన్స్,తాత ముత్తాతల నుండి వస్తున్న సమస్య విషయాన్ని పరిశీలిద్దాం. రవి పంచమమున నీచయందు శని నవాంశలో ఉండి,అటూ ఇటూ క్ర్రగ్రహ సంబంధం ఉన్నప్పుడు అది ఈ సమస్యను సూచిస్తుంది. అలాగే రవి పంచమాధిపతి అయి త్రికోణమున పాపితో కలసినా, చూడబడినా,రవి గురువులకు పరివర్తన కలిగి లగ్నం, పంచమము పాపయుక్తమైనా (గురువు పుత్రకారకుడు,రవి పితృ కారకుడు),లగ్నాధిపతి బలహీనుడయి పంచమాధిపతి రవితో కూడి రెండూ పాపయుక్తమయినా,పంచమ నవమాధిపతులు (పుత్ర,పిత్రు స్థానాలు) పరివర్తన చెంది లగ్న పంచమాలు పాపయుక్తమైనా,దశమాధిపతి కుజుడయి,పంచమాధిపతితో కూడి,లగ్న,పంచమ,దశమములు పాపయుక్తములు అయినా,దశమాధిపతి పాపస్థానగతుడయి, గురువు పాపరాశిగతుడయినా,రవి కుజ శనులు లగ్న పంచమములందుండి అష్టమ వ్యయములందు గురు రాహువులున్నా, అష్టమమున రవి,శని పంచమమున ఉండి పంచమాధిపతి రాహువుతో కూడినా,వ్యయాధిపతి లగ్నమున, అష్టమాధిపతి పంచమమున,దశమాధిపతి అష్టమమున ఉన్నా,ఆరు అధిపతి అయిదులో ఉండి దశమాధిపతి ఆరులో ఉన్నా,గురువుతో కూడి యున్నా, తర తరాలుగా వచ్చు ఒక సమస్య వలన సంతానం కలగటం లేదని గ్రహించవచ్చు. వేయి మందికి బ్రాహ్మణ భోజనము,కన్యాదానం చేసి దూడతో పాటుగా గోవును దానం చేయటం వలన ఈ సమస్యకు పరిష్కారం ఉండగలదు.
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
ఒక సమాధానం,మరో దృశ్యం-వేదాంతం శ్రీపతిశర్మ
27 నవం 2009 అభిప్రాయములు
in శ్రీ-చిత్రం
ఈ చిత్రం పేరు ‘మిడ్నైట్ రన్’
ఈ చిత్రం పేరు ఏమిటి? ఈ నటి ఎవరు?
Answer: Movie-Bipasha, Actress-Suchitra Sen
ఒక దృశ్యం-ఒక ప్రశ్న-వేదాంతం శ్రీపతిశర్మ
26 నవం 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!
ఈ ప్రారంభ దృశ్యం చూసి చిత్రం పేరు చెప్పగలరా?






ఇటీవలి అభిప్రాయములు