30 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ వరకు రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ
30 ఆగ 2009 1 వ్యాఖ్య
in శ్రీ-ఫలములు
శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి: రవి శనులు సింహం, బుధుడు కన్య, గురు రాహువులు మకరం, కుజుడు మిథునం, శుక్ర కేతువులు కర్కాటకం, చంద్రుడు ధను, మకర, కుంభ రాశులు సంచరిస్తారు.
కర్కాటకం నుంచి మకర రాశి వరకు ఉన్న రాశులలో జన్మించిన వారికి సంఘటనల పరంపర కొనసాగే వారం. కుంభ రాశి నుంచి మిథున రాశి వరకు ఉన్న ఆరు రాశులవారు జీవితాన్ని ఒక ప్రదర్శనగా చూస్తూ గడిపే వారం. ఈ వారం కొన్ని మంచి యోగాలను సూచిస్తున్నది. అతి తెలివి, తొందరపాటు, వారికే అన్నీ తెలుసు అనుకుని మాట్లాడే వారికి ఈ వారం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుంది.
మేష రాశి: మనసు రకరకాల ఆలోచనలనుంచి బయట పడుతుంది. శాశ్వతమైనవి, నశ్వరమైనవి విడదీసి భావించవలసిన వారం. విశ్రాంతి అవసరం. స్త్రీలకు అన్నింటా మంచి వారం. విష్ణు సహస్రనామం చదవండి.
వృషభ రాశి: గుండె జబ్బులున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు మానుకోవటం మంచిది. నూతన విద్యాభ్యాసం చేయాలనుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడగలవు. కొంత శ్రమ తరువాత ఆదాయం బాగుంటుంది.హనుమాన్ చాలీసా చదవండి.
మిథున రాశి: చికాకుల నుండి బయట పడతారు. కొంత విరక్తి అనుభవిస్తారు. వ్యాపారం బాగుంటుంది. ఒక సంధిగ్ధావస్థలో సలహా పొందుతారు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కర్కాటక రాశి: మీ ఉత్తమమైన వ్యక్తిత్వం గుర్తింపు పొందుతుంది. ధైర్యంగా కొన్ని పనులు చేయటం వలన జీవితం సజావుగా ముందుకు సాగుతుందని తెలుసుకుంటారు. కొందరికి నోరు విప్పి చెప్పవలసింది చెప్పండి. అన్నింటా ఇది మంచి వారం. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
సింహ రాశి: అనుకోని సంఘటనలు ఎదురు కాగలవు. అవి మీ మంచికేనని గ్రహించండి. మీ నేర్పు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంది. దూరాలోచనలు చేయవలసిన కాలం. ఆదిత్య హృదయం చదవండి.
కన్య రాశి: మీలోని కార్యదక్షత మరింత పెరుగుదల పొందే వారం. మీ పరిశ్రమను ఓర్వలేని వారున్నారు. జీవితాన్ని పలు మార్లు కళాత్మకంగా జీవించాలనుకోవటం మీ నైజం. కాకపోతే నిజ జీవితంలో ఆ ఒరవడినుంచి లాభం పొందే వారుండగలరు. ఎవరితో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించండి. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మహాసౌరం చదవండి.
తుల రాశి: ఇది మంచి వారమే కానీ ఒక సందేహం వెంటాడగలదు. కొద్ది కాలం నిర్ణయాన్ని ఆపండి. మబ్బులు విడిపోగలవు. వారాంతంలో శుభ వార్త వింటారు. శ్రీసూక్తం చదవండి.
వృశ్చిక రాశి: ఆదాయం, పెట్టుబడుల విషయంలో మంచి వారం. మార్కెట్ లో గతంలో నష్టపోయిన వారు ఈ వారం కొద్దిగా పుంజుకుంటారు. ఇంటిలో పోటీలు, పోట్లాటలు వచ్చి వెళ్లిపోతాయి. లలితా సహస్రనామం చదవండి.
ధను రాశి: మంచి ఫలితాలున్న వారం. కర్మ నిష్ఠకు, మానవ సంబంధాలకు గల వ్యత్యాసాన్ని గమనించగలిగిన వారికి మంచి వారం. అన్నిటినీ కలబోసి ముందుకు వెళ్లే వారికి సమస్యలు ఎదురు కాగలవు. శ్రీ దత్తస్తవం చదవండి.
మకర రాశి: అనవసరమైన బాధ్యతల నుండి విముక్తి లభించే కాలం దగ్గరలోనే ఉంది. ఈ వారం కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఒక విందులో పాల్గొంటారు.పాత మిత్రులను కలుసుకుంటారు.స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రీసూక్తం చదవండి.
కుంభ రాశి: కావాలనుకున్న వ్యక్తుల నుండి సమస్యలు, వద్దనుకున్న వారి దగ్గరనుండి అనుకోని లాభాలు ఈ వారం వింతగా గోచరిస్తున్నాయి.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.వారాంతంలో ప్రయాణం ఉండవచ్చు.శివునికి అభిషేకం చేయించండి.
మీన రాశి: బంధువులతో జాగ్రత్తగా ఉండవలసిన వారం.ఆదాయం బాగుంటుంది. ఒక దీర్ఘకాలీన వ్యవహారంలో సంధి ఏర్పడగలదు.పలువురి ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్త్రాలు కొంటారు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
ఈ వారం మంచి మాట:
‘ యం ప్రాప్య న నివర్తంతే తత్ ధామ పరమం మమ ‘
(శ్రీమద్భగవద్గీత)
దేనిని పొంది తిరిగి రావలసిన పని లేదో అదే పరమధామము, అదే పరమాత్మ.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
The English version is available at www.sripati.com
23-29 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
23 ఆగ 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి: రవి శనులు సింహం, బుధుడు కన్య, గురు రాహువులు మకరం, కుజుడు మిథునం, శుక్ర కేతువులు కర్కాటకం, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశులు సంచరిస్తారు.
ఈ గ్రహస్థితి సమాజంలో అనుకోని ఘర్షణలను సూచిస్తోంది. పెద్దలను అగౌరవ పరచటం వలన కొన్ని సమస్యలు ఉండవచ్చు. స్త్రీలు ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కోవలసిన వారం.
మేష రాశి: బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులనుండి బయట పడతారు. బంధువుల ఆరోగ్య పరిస్థితి కలవరపెడుతుంది. విష్ణు సహస్రనామం చదవండి.
వృషభ రాశి: వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. సకాలంలో డబ్బు, ఆలోచనలు కలసి వస్తాయి. స్నేహితుల నుంచి మంచి సలహాలను పొందగలరు. శ్రీసూక్తం చదవండి.
మిథున రాశి: రక్తపు పోటు ఉన్న వారు జాగ్రత్త వహించాలి. ఒక ప్రయాణం ఉండవచ్చు. ఏదైనా లకీ డ్రాలో ఉన్న వారు లాభం పొందగలరు. హనుమాన్ చాలీసా చదవండి.
కర్కాటక రాశి: స్త్రీల విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలి. పెట్టుబడులు ఆలోచించి చేయవలసిన వారం. ఉద్యోగస్తులకు మంచి వారం. కుడి కన్ను విషయంలో సమస్య ఉండవచ్చు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
సింహ రాశి: జరగబోయేవి తెలుస్తున్నట్లు అనిపించగలదు. ఈ వారం మంచి ఆదాయం ఉంది. దూరపు బంధువు విషయంలో ఒక సమస్య తలెత్తగలదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆదిత్య హృదయం చదవండి.
కన్య రాశి: ఉద్యోగంలో మార్పు సంభవం. ఈ వారం చాలా నేర్పుతో వ్యవహరించాలి. శ్రమ తప్పదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పై అధికారులు వాదోపవాదాలకు దిగగలరు. శివాలయం దర్శించుకోండి.
తుల రాశి: ద్వంద్వ నీతుల వలన సమస్యలుండవచ్చు. అనుకోని సంఘటన ఒకటి జరుగగలదు. రాజకీయాలలోని వారు సంయమనం పాటించాలి. విష్ణు సహస్రనామం చదవండి.
వృశ్చిక రాశి: ఈ వారం మీ ముందుకు కొన్ని సమస్యలు రానున్నాయి. ఎంతో ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తారు. బాధ్యతలు వద్దన్నా పెరగనున్నాయి. వాహనం నడుపు వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
ధను రాశి: కార్యాలయంలో హోదా పెరగగలదు. మీ అధికారికి బదిలీ ఉండవచ్చు. విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో చిరాకులు, పరాకులు సంభవం. మౌనం వహించండి. శ్రీ దత్త స్తవం చదవండి.
మకర రాశి: ఒక అహంకార ధోరణిలో మాట్లాడటం ఈ వారం అంత మంచిది కాదు. కొందరు మిమ్మల్ని విస్మరించే అవకాశం ఉండవచ్చు. డబ్బు అందగలదు. లలితా సహస్రనామం చదవండి.
కుంభ రాశి: విదేశ వ్యవహారాలు బాగున్నాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఋణ ప్రయత్నాలు లాభిస్తాయి. కళా జగత్తులోని వారికి మంచి అవకాశాలున్నాయి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
మీన రాశి: పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కోవాలి. మీ మాటకారితనం వలన ఒకరి సమస్య పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్న వారం. ఇష్ట దైవాన్ని కొలవండి.

ఈ వారం మంచి మాట:
శ్లో: నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీన మంతరాయకృంతనం
హృదస్తరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం
(ఆదిశంకరాచార్య కృత గణేశ పంచరత్నం లోని శ్లోకం)
మిక్కిలి కమనీయమైన దంతకాంతి గలవాడు, కాలకాలుడు (యమునకు గూడ, యముడు) అయిన శివుని పుత్రుడు, అచింత్యరూపుడు (రూపరహితుడు), అంతమనునది లేని వాడు,ని: శ్రేయసమునకు భంగము కలిగించు విఘ్నములకు నాశమొందించువాడు (మోక్షప్రదాత), యోగుల హృదయాంతరమున నిరంతరము నివసించువాడు అగు ఆ ఏకదంతునే, సతతము, చక్కగా చింతనము (మననము, ధ్యానము) చేయుదును.
‘తస్యోదరాత్సముత్పన్నం నానా విశ్వం న సంశయ: ‘
నానా నామరూపాత్మకమైన సమస్త ప్రపంచము పరమేశ్వరుని (గణపతి) ఉదరము నుండియే ఉత్పన్నమైనది…
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
The English version is available at
www.sripati.com
‘ దో బీఘా జమీన్ ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు
22 ఆగ 2009 అభిప్రాయములు
in శ్రీ-చిత్రం

నియో రియలిసం అనే ఒక ప్రక్రియ చలన చిత్రాలల విషయంలో వింటూ ఉంటాం. దీని గురించి అంతర్జాతీయంగా చర్చించినప్పుడు ఎక్కువగా ఇటలీ గురించి కూడా వింటూ ఉంటాం. మన దేశం గురించి మాట్లాడినప్పుడు బిమల్ రాయి 1953 లో తీసిన ‘ దో బీఘా జమీన్ ‘ గురించి చెప్పకుండా ఉండలేము. ఈ చిత్రానికి ఎన్నో కీర్తి కిరీటాలున్నాయి. వాటి గురించి తరువాత చెప్పుకోవచ్చు. తెర తీద్దాం…
~~~***~~~
భూమిని తాకట్టు పెట్టిన చిన్న రైతు శంభు (బల్రాజ్ సాహ్ని ). జమీందారు దగ్గరకు వచ్చి ఒక పారిశ్రామిక వేత్త ఆ భూమిని ఎంచుకుని ఫాక్టరీ కడతానని చెబుతాడు. ఆ భూమిని ఇపించేందుకు శంభూని కోర్టుకి ఈడ్చి మూడు నెలలలో డబ్బు కట్టకపోతే భూమి వేలం అవుతుందని తేలుస్తాడు జమీందారు. డబ్బు సంపాదించేందుకు కోల్కటాలో శంభు, తన పిల్లవాడితో పడు కష్టాలు చిత్రం యావత్తూ కమ్ముకుంటాయి.
చివరకు శంభు ఆ భూమిని వదులుకోవాల్సి వస్తుంది. ఇదేమి సినిమా? నిజమే!
జాగ్రత్తగా ఆలోచిస్తే దర్శకుడు చూపించదలచుకుంది చాలా గొప్ప విషయం. భూమిని వదలను అని ఒక రైతు చెప్పి దేనికైనా సిధ్ధ పడటం. రెండు-అతని కుటుంబం ఇందులో అతని వెంటే నిలబడటం. మూడు, ఉన్న వాళ్ల ప్రపంచం ఎంత పీడించినా లేని వారి జగత్తు అతన్ని కలుపుకుని అడుగడుగునా సహాయం చేయటం. ఈ లేనివారి ప్రపంచం చూపించినప్పుడు అందులోని క్రౌర్యం కూడా బాధాకరంగా ముందుకొస్తుంది. కానీ అందులోనే మానవతా విలువలు కనిపిస్తూ ఉంటాయి. చివరకు ఒక కుటుంబం భూమిని వదులుకున్నా కుటుంబం గానే ప్రక్కగా వెళ్లిపోతుంది.
శంభు తండ్రి ‘ భూమి పోతే ఏమయింది? ఈ ప్రపంచం అంతా మన భూమే, ఆకాశమంతా మన ఇంటి పైకప్పే ‘ అని చాటుతాడు. కుటుంబం లోని బంధాలు అంత గొప్పవి. అది తెలిసిన వారికే ‘ వసుధైవ కుటుంబకం ‘ అనేది అర్థమవుతుంది.
~~~***~~~
చిత్రం వెనుక చిత్రీకరణలోని ఒక మర్మం దాగి ఉంది. ప్రారంభంలో ఒక కరవు పరిస్థితి, వెంటనే ఒక వాన జల్లు, జనంలో ఉత్సాహం, ఆ తరువాత శంభు సమస్య…ఇది సరళి. భూమి నాకేమిచ్చింది అని రైతు అడగడు. భూమి తల్లి. మనలను కని మోసే తల్లి. మనం భూమికి ఏమిచ్చామనేది అందరం వేసుకోవలసిన ప్రశ్న. అన్ని పోరాటాలూ భూమి కోసమే, రాజ్యం కోసమే! ఇందులో పోరాడిన ప్రతివాడూ గెలుస్తాడు. పోరాటమే గెలుపు!
కొన్ని దృశ్యాలు కదిలిస్తాయి. బల్రాజ్ సాహ్నీ తోపుడు బండీని గుర్రం బండీతో సమానంగా వేగం చేయమని ఆసామి పోరటంతో పరుగులు తీసి పడిపోతాడు. విషయానికి అద్దం పట్టే ఘటనతో కథనాన్ని ముందుకు తోసుకుపోయినప్పుడు చరిత్ర లేచి నిలబడుతుంది, దటీస్ ప్రెసెంటేషన్!
డబ్బులు లేనప్పుడు తండ్రి కడుపులో బాలేదు అని తినాం మానెస్తాడు. చిన్న పిల్లవాడు కూడా బయటకు తినటానికి వెళ్లినట్లే వెళ్లి నాకూ కడుపులో బాలేదని ఊరుకుంటాడు…
శంభు భార్య (నిరుపా రాయి ) భర్తకు ఉత్తరం వ్రాయిస్తున్న దృశ్యం ఎంతో సున్నితంగా చిత్రీకరించాడు దర్శకుడు.
ఈటలీ చిత్రం ‘ ద బైసకల్ థీఫ్ ‘ లోని తండ్రీ కొడుకుల ఉదంతం బట్టి ప్రభావితమయినట్లు బిమల్ రాయి చెప్పి యున్నాడు.
ప్రస్తుతం మన దేశం తన జి. డి. పీలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత తగ్గించుకుంటూ పోయి ఇతర రంగాలలోకి దూకేసింది.ఒక సారి ఈ చిత్రం చూసి ఆలొచించవలసిన అవసరం ఉందనిపించింది. ఆర్థిక విధానాల సంగతి ప్రక్కన పెడితే కనీసం భూమి పట్ల మనం చేస్తున్న అమానుషం, కాలుష్యం, దిగజారిన కుటుంబ వ్యవస్థలు, మరుగున పడ్డ విలువలు…ఇవన్నీ కరవులో భాగాలు అని బాధ పడవలసి వస్తుంది…
~~~***~~~
‘ దో బీఘా జమీన్ ‘ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను ప్రవేశపెట్టినప్పుడు మొట్ట మొదటి ఉత్తమ చిత్రంగా ఎన్నికైన చిత్రం. అలాగే కాన్ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైన తొలి భారతీయ చలన చిత్రం.మరో చరిత్ర ఈ చిత్రానికి ఉంది. ఈ చిత్రాన్ని తను తీయలేకపోయినందుకు రాజ్ కపూర్ బాధ పడ్డాడుట!
ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు సలిల్ చౌధరీ. పాల్ మహేంద్ర సంవాదాలు వ్రాశారు. హృశీకేష్ ముఖర్జీ దృశ్యాలను వ్రాసి కూర్పు చేశారు. కమల్ బోస్ అద్భుతమైన ఛాయాగ్రహణం చేశారు.
అందరూ మహానుభావులే! వీరు కలసినప్పుడు ఈ చిత్రం లోని ఒక పాట తిరిగి చెప్పుకోవాల్సి ఉంటుంది-’ ధర్తీ కహే పుకార్ కే, అప్ని కహానీ ఛోడ్ జా, అప్ని నిశానీ ఛోడ్ జా…’
ప్రతి కష్టానికీ ఒక కథ, ఒక గుర్తింపు అలా మిగిలిపోతుంది.
మన భూమి, మన ప్రజల లోతులలోకి ఒక్క సారి వెళ్లండి అని మన కళా జగత్తు మన దర్శకుల వైపు తిరిగి ఈ రోజు కేక పెడుతోంది…ధర్తీ కహే పుకార్ కే!
~~~***~~~
‘ నిన్న లేని అందమేదో’ (24)-వేదాంతం శ్రీపతి శర్మ
22 ఆగ 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు

లోయ దగ్గరకి వెళ్లేసరికి శరత్ బాగా అలసిపోయాడు. విశ్రాంతి కోసం గదులు వెతికి చివరికి ఒక గెస్ట్ హవుస్ మేడ మీద ఒక గది సంపాదించి భోజనం చేసి సాయంత్రం చీకటి పడే వేలకి పిట్ట గోడ మీద కాలు పెట్టి అలవాటైన ఆకాశం లోకి చూస్తూ కూర్చున్నాడు. ఆ గెస్ట్ హవుస్ ఎవరో చక్కని ప్రదేశంలోనే కట్టారు. దూరంగా ఒక నది పాయ అలా ప్రవహిస్తోంది. చంద్రుని కాంతి అందులో చిత్రంగా ప్రతిబింబిస్తున్నది. వాన బాగా కురిసి వెలిసింది. ‘సార్…’, ఎవరో వెనుకనుండి అంటున్నారు.
‘ ఏమి కావాలి? ‘
‘ ఏమి లేదు సార్…’
అటు తిరగలేదు శరత్. ‘ నాకిప్పుడు తినేందుకేమీ అక్కరలేదు. రాత్రి చూద్దాం…’
‘ అది కాదు సార్…’
విసుగ్గా అటు తిరిగాడు. అక్కడ ఉన్నది ‘ ఆదుర్దా ‘. సంచీ తగిలించుకుని ఉన్నాడు. ఇద్దరూ ఒకే సారి అన్నారు, ‘అరే! ‘
‘ సార్, మీరు ఇంటికి వెళ్లిపోయారనుకున్నాను. ఇక్కడే ఉన్నారా?’
‘ లేదు ఆదుర్దా గారూ, అలసిపోయానని ఉండిపోయాను. మీరేంటి?’
అతను పిట్ట గోడ మీద చిన్నగా ఆనుకున్నాడు.
‘ నేను వానలో తడిసిపోయాను సార్. నేనూ వెళ్లలేకపోయాను. ఇక్కడ కొద్దిగా ఈ రాత్రికి తల దాచుకుందామని కింద అడిగాను. పొమ్మన్నారు. ఆ వాచ్మన్ ఎవరో ఇలా పైన ఒక సారు దిగారు, అడిగి చూడమంటే ఇక్కడికి వచ్చాను. నేను గదిలోకి రాను లెండి. ఇలా ఈ డాబా మీద పడుకుంటాను. ‘
శరత్ సిగరెట్ తీశాడు. ముట్టించి అతనికీ ఒకటి అందించాడు.
‘ ఆదుర్దా గారూ, నన్ను అవమానించకండి. ప్రకృతి ఒడిలోకి కవల పిల్లల్లాగా ఊడి పడ్డాం. కాకపోతే మరల ఇలా ఎందుకు కలుసుకుంటాం? పైగా నాకూ తోచదు. మీరూ నాతోనే ఉండండి. ‘
ఆదుర్దా శరత్ ను చూసి చిరునవ్వు నవ్వాడు.
‘ కూర్చోండి. ఏదైనా చెప్పండి. అలా చూడండి. ఏమీ అనిపించటం లేదా?’
ఆదుర్దా అక్కడున్న మరో కుర్చీలో కూర్చున్నాడు.
‘ ఏమిటో శరత్ గారూ, నా ముందు ఎవరైనా ఒక చక్కని విషయం మీద తప్పుగా వ్యాఖ్యానం చేస్తే తీవ్రంగా ఖండించి పోట్లాడేవాడిని. అదేంటో ఆ రోజులు వెళ్లిపోయాయి. ఒకప్పుడు ఆశువుగా ఎన్నో చెప్పే వాడిని. నేను ఓ గొప్ప రచయితని అనే గట్టిగా నమ్మేవాడిని…’
‘ అదేంటి? నమ్మటం ఎందుకు? కారా?’
‘ కాను. ఎవడైనా ముందు మనిషి. తరువాత రచయితో లేక కవో లేక పండితుడో…’
‘ మీరు ఎందుకో బాధలో ఉన్నట్లున్నారు ‘
‘ ఈ శరీరం ఉంది చూశారూ, ఇది మహా మోసం. దీని పోషణకే ముప్పావు జీవితం గడిచిపోతుంది. సమాజాన్ని నేను ప్రశ్నించాలన్నా ఈ సమాజం నాకు తిండి పెట్టాలి! ‘
‘ కరెక్ట్!’
‘ కంటిలో నలుసు పడ్డప్పుడు ఎదురుగా ఏడుకొండలవాదు వచ్చి నిలబడ్డా ఏమీ చేయలేము. ఆ నలుసును ఊదేసి అదుగో కళ్లు తెరు అనే వాడే దేవుడు! ‘
‘ నలుసు? ‘
‘ నలుసా…అదీ అది ఏమిటి?’
‘ అది సృష్టిలోని భాగం కాదా?’
‘ నిజమే. ఇది చిత్రంగా ఉంది. ఆలొచించాలి. ‘
‘ మీ నలుసు ఇంతకీ ఏమిటి? ‘
‘ వదిలేయండి. తరువాత మాట్లాడుకుందాం. ఆ నీటిలో చక్కని ప్రతిబింబం కనిపిస్తోంది. అయితే మీరన్నట్లు మబ్బు ఒకటి అడ్డు వస్తే ఆ కాంతి మరింత విరజిమ్మి మరో దృశ్యం కనిపిస్తోంది…’
‘ ఇందులో నేనేమన్నాను?’
‘ నలుసు. ఏదో అడ్డం రావాలి. నిజమే. అదే జీవితం! ‘
‘ అబ్బో! క్షణంలో ఎక్కడికో వెళ్లిపోయారు. ‘
అతను అలా ఎందుకో చూస్తూ ఉండిపోయాడు.
‘ చెప్పండి ‘
‘ ఆకాశానికి ఈ నది ఎంత చక్కగా అద్దం పడుతోంది? ‘
‘ అంత ఆకాశానికా?’
‘ కాదు. నేను నది గురించి చెప్పటం లేదు. మన మనస్సుల గురించి అంటున్నాను. ఈ చిన్న చోటులో ఎన్ని భావాలు?’
శరత్ ఆలోచించాడు. ఆలోచన బాగుంది.
‘ ఇంటిలో అద్దం ముందు చాలా సేపు నిలబడతారన్న మాట!’
అతను నవ్వాడు. ఎందుకో నవ్వుతూ నవ్వుతూ ఆగిపోయాడు. సిగరెట్ పడేశాడు.
‘ అద్దం ముందు నిలబడి కూడా అందమైన ఆలోచనని తప్ప మరొకటి చూడలేనివాడు కవి…’, మెల్లగా అన్నాడు, ‘…అద్దం ముందు నిలబడి కూడా అందమైన ఆలోచనను తప్ప మరొకటి చూడలేని వాడు కవి. అద్దం ముందు నిలబడే వయసు లేదు, అబధ్ధాన్ని నిలదీసే మనసూ లేదు. ఆలోచనలు పెరగటం వలన వయసు వచ్చేస్తుందో లేక వయసు మీద ఆలోచనలు మీద పడతాయో తెలియదు…నాకూ వయసు వచ్చేసింది శరత్ గారూ! ‘
దూరంగా ఎవరో నిప్పు వెలిగించినట్లున్నారు. అలా పొగ ఆ గుబుర్లలోంచి పైకి వస్తోంది. గాలి చల్లగా వీస్తోంది…
~~~***~~~
( తరువాయి భాగం త్వరలోనే )
16-22 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
15 ఆగ 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి:
రవి కర్కాటక సింహ రాశులు, కేతువు కర్కాటకం, శని సింహం, బుధుడు సింహ కన్య రాశులు, గురువు రాహువు మకరం, కుజుడు వృషభ మిథున రాశులు, శుక్రుడు మిథున కర్కాటక రాశులు, చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక, సింహ రాశులు సంచరిస్తారు.
పలు మార్పులు ఈ వారం కనిపిస్తున్నాయి. స్త్రీలకు మంచి యోగాలున్నాయి. అందరూ ఏదో ఒక మంచి వార్త వినగలరు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. దీర్ఘకాల సమస్యలు పరిష్కారం అయ్యే వారం ఇది. కొన్ని మంచి మేఘాలు కమ్ముకోవటం, సమస్యల మేఘాలు తొలగిపోవటం ఈ వారం చెప్పుకోదగ్గ విశేషం.
మేష రాశి: అనారోగ్యం స్వల్పంగా బాధిస్తుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. కొత్త ఆలోచనలు కలుగుతాయి. అనుకోని చోటు నుంచి డబ్బు అందగలదు. పాత రోజులలోని మిత్రులు కలుసుకుంటారు. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
వృషభ రాశి: ఈ వారం అన్ని రంగాలలో మీకు కనిపించు అవకాశాలు ఈ సంవత్సరాంతం వరకూ రాకపోవచ్చు! సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతిభకు గుర్తింపు లభించనున్నది. సమయస్ఫూర్తి అవసరం. కొత్త బట్టలు కొంటారు. శ్రీసూక్తం చదవండి.
మిథున రాశి: చాలా పనులు చేపట్టాలని అనుకుంటారు. చివరకు ఇంటి పనిలో కాలం గడిపేస్తారు. ఆదాయం బాగుంటుంది. అజీర్ణం కలుగవచ్చు. కళా రంగం వారికి మంచి వారం. సమస్యలు పరిష్కారం కాగలవు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
కర్కాటక రాశి: పలు మార్పులను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. గతం న శోచామి కృతం న మన్యే! కొన్ని విషయాలు దైవీకంగా సాగిపోగలవు. ప్రయాణాలు తలపెట్టి మానేయగలరు. మానేయటం మంచిదే! విష్ణు సహస్రనామం చదవండి.
సింహ రాశి: ఇల్లు, ఇల్లాలు గురించి యోచిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల నుంచి మంచి వార్త వింటారు. అవివాహితులకు ఇది మంచి వారం. మంచి సంబంధం విచారింపగలరు. కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. మహాసౌరం చదవండి.
కన్య రాశి: ఉద్యోగంలో మార్పు విషయంలో సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ మార్పు మీ మంచి కోసమేనని గ్రహించగలరు. మీ దృక్పథం గతంలో అర్థం కానివారు తిరిగి మీ దగ్గరకు వస్తారు. ఒక శక్తివంతమైన వారం ఇది. ఏది చెప్పినా ఆత్మవిశ్వాసంతో చెప్పండి. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
తుల రాశి: శత్రువుల మీద విజయం సాధిస్తారు. పెట్టుబడులు కొద్దిగా మందకొడిగా సాగినప్పటికీ ఆదాయం బాగుంటుంది. బాధ్యతలు పెరగనున్నాయి. వారం ప్రారంభంలో న్యాయసంబంధమైన విషయంలో తీవ్రంగా ఆలోచిస్తారు. స్త్రీల పట్ల ఆసక్తి చూపుతారు. శివునికి అభిషేకం చేయించండి.
వృశ్చిక రాశి: ఇంటిలో కొన్ని భిన్నాభిప్రాయాలు కలుగ గలవు. వివాదాలకు దారి తీసే సూచనలున్నాయి. మౌనం పాటించగలరు. రాజకీయాలలోని వారికి మంచి వారం. సంప్రదాయ బధ్ధమైన పరిష్కారాలు లాభించగలవు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలున్నాయి. లింగాష్టకం చదవండి
ధను రాశి: ఈ వారం మంచి యోగాలతో ప్రారంభమవుతున్నది. ఖర్చులు చేయాలని యోచిస్తారు. పిల్లలు అభివృధ్ధిలోకి వస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఒకరికి సహాయం చేస్తారు. కొన్ని విషయాలలో తర్జన భర్జనలు తప్పవు. విష్ణు సహస్రనామం చదవండి.
మకర రాశి: గుండె జబ్బులున్న వారు విశ్రాంతి తీసుకోవాలి. కొందరు మీకు దూరమవుతున్నారని అనుకుంటారు. ఇది కొద్ది కాలమే. మీరు ఓర్పుతో నిర్వర్తించే బాధ్యతలే మీ ప్రతిభను చాటుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అన్నదానం చేయండి.
కుంభ రాశి: జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారం. ఆదాయం బాగుంటుంది. పరిశోధనా రంగంలో ఉన్న వారికి మంచి వారం. ఒక అవకాశం దగ్గరకు వచ్చి దూరం అవుతుంది. చింతించకండి. తిరిగి మరింత బలంతో దగ్గరకు రాగలదు. లలితా సహస్రనామం చదవండి.
మీన రాశి: బంధువులు మీ నుంచి సహాయం కోరగలరు. ప్రేమికులకు మంచి వారం. స్త్రీలతో కొన్ని విభేదాలుందగలవు. దృష్టి దోషం బాధించగలదు. బుధవారం వ్యాపారస్తులకు మంచి అవకాశాలుండగలవు. నాగసింధూరం ధరించి దుర్గా సూక్తం చదవగలరు.

ఈ వారం మంచి మాట
శ్లో: న ఙ్ఞాతిభ్యో దయా యస్య శుక్లదేహోవికల్మష:
హింసా సా తపసస్తస్య నానాశిత్వం తప:స్మృతం
(మహాభారతం వనపర్వం)
వ్రతము, ఉపవాసముల ద్వారా శరీరాన్ని పరిశుధ్ధం చేసికొని వివిధ పాపకర్మలను చేయకుండా ఉండి కూడా మనసులో తన కుటుంబం వారి పట్ల కరుణ చూపడో తన తపస్సు యావత్తూ పోగొట్టుకుంటాడు. భోజనాన్ని వదిలేయుట ఒక్కటే తపస్సు కాదు.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
The English version can be viewed at www.sripati.com
‘శబ్దం ‘-వేదాంతం శ్రీపతి శర్మ
15 ఆగ 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-చరణములు


ఆకాశం యొక్క తన్మాత్ర శబ్దం అని తెలుస్తున్నది. పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్…ఇందులో ఆకాశం తొలుత సృజించబడినది.
వేదం శబ్దప్రధానం. కావ్యం అర్థప్రధానం.
వేదా: శాస్త్రాణి విఙ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్…ఏకో విష్ణు: మహత్ భూతం పృథక్ భూతాన్యనేకశ:
~~~***~~~
నేషనల్ సైన్స్ ఫౌండేషన్, వర్జినియా వారు ఒక కొత్త విషయాన్ని చెప్పారు.
కొన్ని సెంటీమీటర్ల లేబొరేటరీలో రసాయనిక సేంపుల్స్ను శబ్ద తరంగాల ద్వారా ఒక అతి చిన్న పరికరంలో మైక్రోస్కోపిక్ ఛానెల్ లో ముందుకు కదపటం జరుగుతున్నది. ఈ తరంగాలు సంగీతం లోని స్వరాల మాధ్యమంగా తీసుకుని వస్తున్నామని బాబ్ కార్సన్ చెబుతున్నారు.
ఈ కొత్త టెక్నాలజీ వ్యాధి నిర్ణయంలో ఒక చిన్న చేతి పరికరంలో ఉపయోగ పడగలవని చెబుతున్నారు.
~~~***~~~
‘నిన్న లేని అందమేదో’ (23)-వేదాంతం శ్రీపతి శర్మ
14 ఆగ 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-రచనలు

లోయ కొద్ది దూరంలోనే ఉంది.ఆదుర్దా, సత్తిబాబూ, శరత్ కలసి ముందుకు దూకుతున్నారు. శరత్ ఆగిపోయాడు.
‘ ఈ కిందకి ఒక దారి పోతోంది…’
‘ అది ఓ సిన్నూరు సారూ. మనం ఇటెల్లాల ‘, అన్నాడు సత్తిబాబు.
‘ అక్కడినుండి లోయకు మరో దారుందా? ‘
‘ ఉంది. కానీ దూరం. ఎందుకు సారూ? ‘
‘ నేను అలా వస్తాను. మిమ్మల్ని లోయలో కలుసుకుంటాను…’, అంటూనే శరత్ దిగిపోయాడు. ఇద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకుని ముందుకు వెళ్లిపోయారు. కెమెరా పట్టుకుని మెల్లగా శరత్ కిందికి దిగాడు…
~~~***~~~
మర్రి ఊడల కింద గుబురుగా ఉన్న స్థలంలో ఒక మేకపిల్ల ఆడుకుంటోంది. కుడి వైపు ఒక గోతం పరుచుకుని గొర్రెల కాపరి నిదురిస్తున్నాడు. కెమెరా ముందుకు దూకుతోంది.
పెరిగిన సరగుడు చెట్ల మధ్యలోంచి ఏదో తోటలా ఉంటే అందులోకి వెళ్లిపోయాడు శరత్. కాలి బాటలా ఉన్న చోట ఒక ఎండుటాకు పడిపోయి అటూ ఇటూ కదులుతోంది. ఎలా వచ్చిందో కొద్దిగానే ఉన్న సూర్యరశ్మి దాని మీద గుండ్రంగా ఎవరో గీసినట్లు ఉంది. నేను ధన్యురాలను అన్నట్లు ఆ ఆకు పరవశంలో కదులుతున్నట్లుంది…
పాము పుట్ట ఒకటి చాలా పెద్దగా ఉంది. దాని చుట్టూతా ఎవరో దీపాలు పెట్టి వదిలేసినట్లున్నారు.పుట్ట వెనుక ఎన్నో నాగబంధాలు శిలలలో కనిపిస్తున్నాయి. వాటి వెనుక పొలాలు అందంగా ఉన్నాయి. దూరంగా ఉంటే దండం పెడతారు, దగ్గరకి వస్తే చంపేస్తారు అని కాబోలు అటూ ఇటూ కాకుండా పుట్టల్లో దాక్కున్నాయి ఈ పాములు!
పొలాల పైన నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి. కిరణాలు చాటు నుండి చేతులు చాపుతున్నాయి. ఏది అడ్డం వచ్చినా నేను ఇచ్చేవాడినే కానీ పుచ్చుకునే వాడిని కానన్నట్లు అవి కిందికే దూరంగా భూమిని తాకుతున్నట్లున్నాయి!
పొలాల వెనుక ఒక గుట్ట మీద చాలా పాతగా కనిపిస్తున్న ఒక చిన్న గుడి ఉన్నట్లుంది. అటు కదిలాడు శరత్.
మెట్లు కూడా ఉన్నాయి. గుట్ట బలే ఉంది. పై నుంచి జాగ్రత్తగా చూస్తే ఆ చిన్న పల్లె దాదాపు పదిహేను పాకలతో కనిపిస్తోంది.
గుట్ట మీద ఎవరూ లేరు. గుడిలోనూ ఎవరూ లేరు!’ దిద్గిపోండి…’, ఎవరో వెనుకనుండి అంటున్నారు.
‘ ఎందుకు? ‘
అడుక్కునే వాడిలా ఉన్నాడు.
‘ దిద్గిపోండి ‘
‘ దిగను ‘
‘ సచ్చిపోతావు ‘
‘ పర్లేదు ‘
‘ పిచ్చి గానీ ఉందేటి? ‘
‘ లేదు. రావాలి ‘
‘ ఏటి? ‘
‘ పిచ్చి ‘
‘ ఎందుకు? ‘
ఫొటో తీశాడు శరత్. అతను కర్ర గట్టిగా పట్టుకున్నాడు.
‘ ఫొటో పంపిస్తానులే! నీ చోటుకు ఏమీ కాదు. వెళ్లిపోతాను. ఏ గుడిది? ‘
‘ సిలంగోరు ‘
‘ అంటే? ‘
‘ సిలంగోరు తెల్దా? పెద్దాయన! ఎల్లిపో! ‘
నవ్వుకుని సిలంగోరు అనుకుని నమస్కారం పెట్టి కిందికి వచ్చేశాడు శరత్.
~~~***~~~
వాన మొదలయింది. మట్టి సువాసన మనిషి పుట్టిల్లును గుర్తు చేసింది. కెమెరాను సంచీలో భద్ర పరచాడు శరత్. గుబురుగా ఉన్న తోటలోకి మరల దూరాడు. చిన పిల్లవాడిలా కావాలని తడుస్తున్నాడు. ఆ ఎండుటాకు కోసం వెతికాడు. అది అక్కడే ఉంది. మీద మట్టి పోసుకుని మరీ కసిగా తడుస్తోంది. దాని దగ్గర కూర్చుని చెట్ల మధ్యనుంచి తెల్లగా కమ్ముకుని పోయిన దృశ్యాన్ని చూస్తున్నాడు.సిలంగోరి గుడి ఆ వానలో అసలు కనిపించటం లేదు. వాన కొద్దిగా తగ్గింది. దూరంగా ఒక ఇంద్రధనుస్సు నిలబడింది. దాని కిందకి వెళ్లి దానిని గొడుగుగా చేసుకుని ఈ వాననీ, ఈ ప్రకృతినీ చూసి ఆ అందని గొడుగుని తనలోకి మూసేసుకుంటే ఎంత బాగుండు…అన్ని రంగులూ నింపుకున్న తెల్ల కాగితానికి రంగుల అంచులెందుకు? అనంతమైన ఆలోచనలకు అంతరంగాలెందుకు?
ఎందుకో వాసంతి గుర్తుకొచ్చింది…
ఎండుటాకును తీసి గబుక్కున సంచీలో వేసుకున్నాడు. అవునూ…ఎందుకు వాసంతి గుర్తుకొచ్చింది?
జాగ్రత్తగా నాలుగడుగులు వేసి తోటలోంచి ఇవతలకి వచ్చాడు.
ఎందుకు గుర్తుకొచ్చిందీ?…ఏమో!
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే)
IMPORTANT-SWINE FLU
12 ఆగ 2009 అభిప్రాయములు
I am reproducing a Homoeopathic’s advice here for all our friends:
Having advised you the Cerebral Malaria Preventive Medication, I feel that it is imperative that I also guide you all on how to save yourself and your family from Swine Flu Virus.
Since there is a mixture of 3 medicines which are used in this case, I am giving advice on how to prepare the same for use.
Go to a Homeo Dispensary and buy the following:
1.ARSENIC IODATUM 30 (30 ml)
2.GELSEMIUM 30 (30 ml)
3.EUPATORIUM PERF 30 (30 ml)
(Note Pl buy SBL or SCHWABE medicines only in sealed bottles)
4.About 100gm. globules no. 30.
5.Some empty small bottles(10 ml) and 1 no. bottle of 30 ml capacity.
Method of preparation:
1..Take about 10 ml from each bottle of medicine (given at 1,2,3 above) in the 30 ml glass bottle.
2. Fill the small globules of sugar in the small glass bottles.
3. Put about 10 to 12 drops of the mixed solution into each small bottle until all the globules are wet. Shake the bottle a little and it is ready for use.
SUGGESTED DOSAGE :
Take 4 globules at a time, 3 times a day for 5 days. If there is an actual infection in or around the locality where you stay, pl continue the medication for a few days more.
PRECAUTIONS TO BE OBSERVED;
1. Avoid going to crowded places like Malls, movie halls etc. Children and pregnant ladies to be extra careful.
2. Do not go to a hospital for any tests unless you get the symptoms – Given later in this note.
3. If you have to go somewhere which is likely to be infected, use a MASK. It can be bought from any good dispensary.
4. Wash your hands as soon as you are back with a disinfectant soap and also everytime you sit down for a meal. Please be very particular for the children that they are made to follow these instructions.
5.Spray some disinfectant ( Savlon/ Dettol etc ) on your handkerchief and use this or fresh tissue paper for wiping your hands outside.
SYMPTOMS of the
VIRUS:
1.Cold, running nose, cough, respiratory problems and/or chest pain.
2.Fever, above 100.00 F for 3/4 days.
3. Severe body ache and severe prostration. Difficulty in even getting up from the bed.
NOTE:
If symptoms are noticed, go immediately to a hospital which can test the infection. Persons suffering from Diabetes, High BP and Asthma to be extra careful.
ABOVE ALL, TAKE THE PROPHYLACTIC MEDICATION AND THE PRECAUTIONS AND DO NOT WORRY AT ALL. YOU WILL SAVE YOURSELF AND YOUR FAMILY FROM ANY PROBLEM IN THIS CASE.
Please spread the message.
~Sripati
IMPORTANT
12 ఆగ 2009 వ్యాఖ్యానించండి
Avoid accepting Rs.1,000/- note of series 2 AQ and 8 AC. More than 2.00 CR duplicate notes worth Rs.2,000 CR have already entered India .
Please spread the message.
~Sripati

ఇటీవలి అభిప్రాయములు