రాశిఫలాలు(31మే-6 జూన్2009)-వేదాంతం శ్రీపతి శర్మ

 

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి:

రవి వృషభం, బుధుడు మేష, వృషభ రాశులు, శుక్ర కుజులు మేషం, కేతువు కర్కాటకం, శని సింహం, గురువు కుంభం, రాహువు మకరం, చంద్రుడు సింహ, కన్య, తుల వృశ్చిక రాశులు సంచరిస్తారు.

దీర్ఘకాల సమస్యల పరిష్కారం వైపు చాలా మంది ఆలోచనలు చేస్తారు. తాడో పేడో తేల్చుకొనే దిశగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవలసిన వారం. రవి గ్రహం ఒక అద్భుతమైన యోగం ఇస్తున్నది. అధికార వర్గం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోగలదు.ఉపాసన మార్గంలో ఉన్నవారు సరిక్రొత్త అనుభూతులను పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి.

మేష రాశి: ఈ వారం మనసులో విపరీతమైన ఆలోచనల ప్రభావం కనిపిస్తుంది. వారం మధ్య నుంచి మనస్తాపాలు తొలగిపోతాయి.అధికంగా అన్నిటినీ పట్టించుకున్న వారు, అధిక ప్రేలాపనలు చేసే వారు మౌనం పాటించాలి. ఈ ప్రవర్తన హానికరం. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: ఇంటిలో ఒక వస్తువు రిపెయిరుకు రెడీగా ఉంది.చేయించండి. దీర్ఘకాలీన ప్రణాలికలు రూపొందుతాయి.మీ శ్రమ ఫలిస్తుంది.ప్రేమ వ్యవహారం ఒకటి బయట పడుతుంది. విష్ణు సహస్రనామం చదవండి.

 మిథున రాశి: మనసు ఒక విషయంలో కలవరపడుతుంది.దైవం అనుకూలిస్తుంది. వారాంతంలో ఆలోచనలు కలసి వస్తాయి. ఆదాయం బాగుంది. గుండె సమస్యలున్నవారు జాగ్రత్త వహించాలి.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: సమస్యలు, పరిష్కారాలు వెనువెంటనే ఉన్నాయి. ఏదో చేయాలని పూనుకుంటే సమస్య కాగలదు.కొన్ని బాధ్యతలు పెరుగుతాయి.ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.ఆరోగ్యం మందగిస్తుంది. రుద్రం పారాయణ చేయండి.

సింహ రాశి:ఒక మంచి పని చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అవరోధాలూ వస్తున్నాయి. తిరిగి ఈ వారం యోచన చేస్తారు. అందరినీ సంప్రదిస్తే ఇలానే ఉంటుంది. చేయాలనుకున్న పని తలపెట్టే ముందు శివాలయం దర్శించండి.ఒక విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు.

 కన్య రాశి: నిర్భయంగా తలచినా పనులలో ముందుకు వెళతారు. మీ నేర్పు మిమ్మల్ని కాపాడుతుంది.ఋణ విషయంలో అవరోధాలు తొలగిపోతాయి.అనుకోని చోటు నుంచి డబ్బు అందుతుంది. అనుకూలించటం లేదని అనిపించినా నిజానికి పరిస్థితులు మీ వైపే ఉన్నాయి.కుల దైవాన్ని కొలవండి.

తుల రాశి:గతంలో సామాన్యంగా ఎవరూ చేయని పనిని ఎవరినీ సంప్రదించకుండా చేసిన పనికి తీవ్రమైన పశ్చాత్తాపం పడు వారం ఇది. కొన్ని కలహాలు కనిపిస్తున్నాయి.అనవసరమైన వాద్వివాదాలు మానుకొనాలి. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి: మీ ఇంటిలో ఆచారం ప్రకారం జరుప వలసిన వ్రతం లేదా పూజ ఏదైనా ఉంటే జరిపించటం మంచిది. మీ ఇంటికి అది మంచిది.ఆదాయం బాగుంది. పిల్లలు మంచి వార్తలు చెబుతారు. సుబ్రహ్మణ్య కవచం చదవంది.

 ధను రాశి:కళ్ల విషయంలో శ్రధ్ధ చూపాలి. సైనస్ ఉన్న వారు జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ఒక మార్పుకు రంగం సిధ్ధమవుతున్నది. పోయిన డబ్బు తిరిగి వస్తుంది.స్త్రీలు చర్మ వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం చేయించండి.

మకర రాశి:ఇంకొకరి విషయంలో చేసిన జోక్యం వలన కొద్దిగా సమస్యలు ఉండవచ్చు.మీ ఉత్సాహాన్ని అపార్థం చేసుకునే వారున్నారు. జాగ్రత్త వహించండి.కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.విష్ణు సహస్రనామం చదవండి.
 

కుంభ రాశి:రక రకాల ఆలోచనలు బాధిస్తాయి.నిస్సహాయులుగా అనిపిస్తారు. అలాంటిది ఏమీ లేదు.మంచి కాలం ముందు ఉంది.సహజమైన ప్రవర్తనకు భిన్నంగా ఏదైనా చేసే సంకల్పం మానుకోండి.అది మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టగలదు.మహా సౌరం చదవండి.

 మీన రాశి:గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లటం మంచిది కాదు. వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు చూస్తారు.బంధువర్గం వలన కొన్ని కలతలు ఉండవచ్చు. సంఘంలో గౌరవం బాగుంది.మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా మౌనంగా ఉండవలసిన చోట ఏదో మాట్లాడి సమస్యలు తెచ్చుకోగలరు. జాగ్రత్త వహించండి.ధ్యాన మార్గం అవలంబించండి.

ఈ వారం మంచి మాట:

మనయేవ జగత్సర్వం
మనయేవ సదారిపు:
మన ఏవహి సంసారో
మనయేవ జగత్రయం

(తేజబిందు ఉపనిషత్)

మనస్సే కలలోని వస్తువులు ఉన్నట్లుగాని భావించి సుఖదు:ఖములను పొంది భంగపాట్లు చెందుతున్నది. జాగ్రదవస్థలో కూడా ఈ మనస్సే లేని వస్తువులను సత్యమని భావించి సంయోగ వియోగ రూపంలో సుఖదు:ఖాలను కలుగచేస్తోంది. అందుచేత దు:ఖం, అశాంతి పోవాలంటే మనస్సును నిగ్రహించుకొని శమదమాది షట్ సంపత్తిని అభ్యాసం చేయాలి.

సచ్చిదానందమాత్రోహం అనుత్పన్నమిదం జగత్
కాలం నాస్తి జగన్నాస్తి మాయా ప్రకృతిరేవచ

(తేజబిందు ఉపనిషత్)

సత్యమైనది సచ్చిదానంద పరమాత్మ ఒక్కటే!అంతయూ పరబ్రహ్మమయం.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

 ~~~***~~~

అభిప్రాయములు (+add yours?)

  1. సూర్యుడు
    మే 31, 2009 @ 05:31:42

    Thanks :-)

    జవాబు

  2. Rayaprolu Mallikarjuna Sharma
    జూన్ 02, 2009 @ 12:27:50

    గురుతుల్యులు, పితృ సమానులు శ్రీ శర్మ గారి నమస్కారములు.

    నా పేరు రాయప్రోలు మల్లికార్జునశర్మ. వ్రుత్తి అర్చకత్వం. మరియు జ్యోతిష్య విద్యార్ధిని. మీ బ్లాగ్ ను క్రమం తప్పకుండా చదువుతున్నాను . మీ ప్రయత్నం చాలా బాగుంది ధన్యవాదములు . అదే సమయములో నేనును కూడా ఒక వెబ్సైటు ను నిర్వహిస్తున్నాను. పూర్తి తెలుగులో మరియు ఉచితముగా….. . ప్రతివారం మీ వారఫలాను అనుసరిస్తుంటాను. మీకు మరింత సమయం కనుక దొరికినట్లయితే మా మీ చదువరులకోసం ప్రతి పదిహేను రోజులకొకసారి దినఫలితాలను అందించగోరుచున్నాము. అట్లాగే వారంలో శుభ కార్యక్రమ సమయాలు కూడా…..
    మా విన్నపాన్ని మన్నించగోరుచున్నాము. .

    ఇట్లు.,

    మీ.,
    రాయప్రోలు మల్లికార్జున శర్మ.

    జవాబు

    • srikaaram
      జూన్ 02, 2009 @ 17:48:47

      మల్లికార్జున శర్మ గారికి నమస్కారములు.

      ఈ బ్లాగులో జ్యోతిషానికి సంబంధించిన క్లిష్టమైన సమస్యలకు,సందేహాలకు వీలు వెంట సమాధానాలు ఇచ్చే ఒక ప్రక్రియ చేయాలని ఉన్నది. అలాగే చాలా మంది అపోహల మీద, వాటి నివారణ మీద వ్రాయమని కోరుతున్నారు.

      స్టాక్ మార్కెట్ మీద కొద్ది సంవత్సరాల క్రితం చెన్నయిలోని ఒక ప్రముఖ వార్తా పత్రికతో కలసి నేను జ్యోతిష పరంగా ఒక పరిశోధన చేసి యున్నాను. సమయం చిక్కితే త్వరలోనే ఆ దిశగా నలుగురికీ సూచనలు దిన వారీగా ఇవ్వగలనని మనవి.

      మీ సూచనల మేరకు కూడా ఆలోచించగలను.

      శుభం భూయాత్!

      వేదాంతం శ్రీపతి శర్మ

      జవాబు

  3. Rayaprolu Mallikarjuna Sharma
    జూన్ 03, 2009 @ 17:52:19

    శర్మ గారికి నమస్కారములు. మీ జవాబును చదివాను. మీరు ప్రత్యుత్తరము ఇచ్చినందులకు సంతోషము. మరియు మేము అడిగిన దినఫలితాల గురించి ఆలోచించగలరు. నమస్కారములతో……

    మీ
    రాయప్రోలు.

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.