ఈ ఫొటోకు వ్యాఖ్య పంపండి(29)-వేదాంతం శ్రీపతి శర్మ

ఫొటో క్విజ్ 94-వేదాంతం శ్రీపతి శర్మ

ఈయన ఎవరు?

Identify this person

ఫొటో క్విజ్ 93-సమాధానం

‘ ఒలంగళ్ ‘-బాలు మహేంద్ర తమిళ సినిమా (పూర్ణిమా జయరాం, అమోల్ పాలేకర్)
‘OLANGAL’-Tamil movie by Balu Mahendra

artistes-Purnima and Amol Palekar

30 ఏప్రిల్ 2009-గ్రహాలు ఎలా ఉన్నాయి?

30 ఏప్రిల్ 2009-ఈ రోజున 107 నియోజక వర్గాలలో కీలకమైన ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యంగా గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ , బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇలాంటి చోట కీలకమైన పోలింగు ఉంటుంది. దీనితో 372 నియోజక వర్గాలలో ఎన్నికలు ముగుస్తున్నట్లే!

పంచాంగం ఇలా ఉంది-స్వస్తిశ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర వైశాఖ శుధ్ధ షష్ఠి,గురువారం, పునర్వసు నక్షత్రం, ధృతి యోగం, తైతుల కరణం.

కర్ణాటక :

గురు, శని, బుధ, చంద్రులు ప్రధానంగా రాణిస్తున్నారు. దేహాంతర్దశలు చూద్దాం:

5.55-10.56 గురువు
10.56-4.54 శని
4.54-      బుధుడు

ఈ రోజు శుక్రుడు, గురువు, శని, బుధుల వలన పారిజాత యోగం ఏర్పడినది. వీటిలో ఎప్పటి లాగే మరల శని చేతి లోకి పగ్గాలు తీసుకున్నాడు.

ఉదయం 11 వరకు అధికార పార్టీకి ఎక్కువ శాతం పోలింగు జరగ వచ్చు. ఆ తరువాత వైపరీత్యం కనిపిస్తున్నది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కొన్ని అవాంచనీయమైన సంఘటనలు జరుగవచ్చును. జె. డి.ఎస్ తన పరిస్థితి మెరుగు పరచుకో గలదని ఒక సూచన ఉన్నది.

దక్షిణ కర్నాటకలో కాంగ్రెస్ కు లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రోజు యావత్తూ అధిక శాతం గురు ప్రభావం, శని ప్రభావం కనిపించుట వలన ఆ పార్టీ అనుకున్నంత మంచి పరిణామాలు సాధించలేక పోవచ్చును.

స్వతంత్ర అభ్యర్థులు ముందుకు రానున్నారు!

గుజరాత్ గురించి తరువాయి టపాలో చర్చిద్దాం…

ఫొటో క్విజ్ 93-వేదాంతం శ్రీపతి శర్మ

ఇది ఏ చిత్రం లోని దృశ్యం?

Identify this movie.

‘దండలు-దండాలు ‘-వేదాంతం శ్రీపతి శర్మ

చాలా కాలం క్రితం కళ్యాణ మంటపం చూసి బుక్ చేయాలని తిరుగుతున్నాను. నాలుగైదు చూశాక ఒక హాల్లోకి వెళ్లి కొద్ది సేపు చర్చించి బుక్ చేసి ఇవతలకి వస్తుండగా అప్పుడే ఒక పెళ్లి పార్టీ బస్సులోంచి దిగి చాలా హడావుడిగా లోపలికి వచ్చేశారు. కొద్ది సేపు నిలబడి అక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఒకే సారి చూసి వెళ్లవచ్చని మూలగా జరిగాను. వాళ్లు సద్దుకోవటం మొదలు పెట్టాక గేటు వైపుకు నడిచాను. వీపు మీద గట్టిగా చెయ్యి ఒకటి పడింది. వెనక్కి తిరిగాను.ఒక పెద్దాయన కళ్లజోడు సద్దుకున్నాడు.
‘ రెండు దండలు-టు గార్లేండ్స్-అర్జెంట్!’
‘ సార్, నేను…’
‘ కాదు నాన్నా…అక్కడే కొందామంటే ఒప్పుకోలేదు. ఇక్కడికి వచ్చాక కొందామన్నారు. ఒకళ్ల మాట ఒకరికి లేదు. అంతా నాన్సెన్స్, న్యూ సెన్సే!. కుర్రాడివి. ఇదిగో, చిటికెలో వస్తావు!…’
చెప్పి వెళ్లిపోయాడు. అలా చూస్తుండగా వెనక్కి తిరిగాడు. ‘రెండు చాలు. టు…టు గుడ్ గార్లేండ్స్!’
ఆలోచిస్తుండగా ఇటు ప్రక్క ఇద్దరు వృధ్ధులు నవ్వుతున్నారు.’ నిన్నటి నుంచీ చూస్తున్నాను కదా! ఈ కాలం కుర్రాళ్లు మాట వినటం లేదు. ఇతను చూడు. అసలు వినాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నాడు!’
‘ కరెక్ట్! మన రోజులలో పరుగులు తీసే వాళ్లం. వేస్ట్!. దండగ!’
‘ తెమ్మంది రెండు దండలు!’
నేను ఏదో చెప్పబోయాను. వాళ్లు వెళ్లిపోయారు.

ఇదెక్కడి గొడవ అని అటు తిరిగాను.

నాకు పని అప్పజెప్పిన ముసలాయన ఒక ముసలావిడకు దూరం నుంచి నన్ను చూపిస్తున్నాడు. అంటే అదిగో ఆ మనిషి ఇప్పుడే తెస్తున్నాడు అని చెబుతున్నాడన్న మాట.
చుట్టూతా ఎవరైనా కుర్రాళ్లు కనిపిస్తారేమోనని చూశాను. ఎవరూ లేరు. వీళ్ల బాధ తట్టుకోలేక ఎవరూ రాలేదనుకున్నాను. అక్కడ చూస్తే ముసలావిడ నడుము మీద చేయి వేసింది. ముసలాయన నన్ను చూస్తున్నాడు. కదలడేమిటి అని ఆయన కళ్లజోడు లోంచి ప్రశ్నిస్తున్నాడు. లాభం లేదని ఇటు తిరిగి నడక ప్రారంభించాడు.

బయటకు వచ్చేశాను. ఎందుకో దగ్గరలో ఉన్న పూల షాపు వాడిని అడిగాను,’ నయనా, దండలు…’
వాడు కొట్టు చూపించాడు.

తప్పదనుకుని అక్కడికి వెళ్లి రెండు మంచి దండలేకొని హాల్లోకి వెళ్లాను. ఆ పెద్ద మనిషి కనిపించలేదు. ఈ పెళ్లిలో మన చేతుల మీదుగా దండల కార్యక్రమం-మంచిదే! మనకీ శుభసూచకం అనుకున్నాను. ఒక పెద్దావిడ వచ్చింది.
‘ పొద్దున చెబితే ఇప్పుడా పంపటం?’, అన్నది.
మారు మాట్లాడకుండా చేతికి ఇచ్చాను.
‘ ఇంకేమి కావాలి? పొద్దున్నే ఇచ్చాంగా డబ్బులు?’
తెరచిన నా నోరు అలానే ఉండి పోయింది.
వెనక్కి తిరిగి పిచ్చ స్పీడులో గేటు బయతకు వచ్చాను.
ఇంతాక వ్యాఖ్యలు చేసుకున్న ఇద్దరు వృధ్ధులు అక్కడ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను బండీ మీద కూర్చో గానే ఒకాయన నా మీద చేయి వేశాడు.
‘ నేను ఇంకేమీ తేను!’
‘ అది కాదు నాయనా! ఇంకేమీ వద్దు!’
‘ నేను వెళతాను.’
‘ అదేంటీ? ఇంతకీ నువ్వెవరు నాయనా?’
‘ తెలియదు.’
‘ ఆ…’
‘ నిజం! అస్సలు తెలియదు! ఇంటికి వెళ్లి కనుక్కుంటాను! ‘
బండీ స్టార్ట్ చేశాను.

~~~***~~~

ఫొటో క్విజ్ 92-సమాధానం

ఇది ‘సెదాన్ ‘ కుర్చీ. బ్రిటిష్ వాళ్లు తయారు చేయించుకున్న పల్లకీ-కం-కుర్చీ!

The ‘ Sedan’ Chair of British times.

Follow

Get every new post delivered to your Inbox.