రాహు-కేతువులు (వ్యాసం కాపీ)-వేదాంతం శ్రీపతి శర్మ
18 ఏప్రి 2009 అభిప్రాయములు


ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రం యొక్క మరో పేరు ఆత్మ విద్య. జ్యోతి-స్థూలంగా చెప్పాలంటే లైట్, సూక్ష్మంగా చెప్పాలంటే ఙ్ఞాన జ్యోతి. దీనిని దర్శించే వాడు జ్యోతిష్కుడు! జ్యోతిషం కేవలం భవిష్యవాణి కాదు. కాలక్రమంలో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందటం వలన జ్యోతిష్కుడు అనగానే కాల్ళూ చేతులూ చూసే వాడు అనుకుంటారు. కాదు. ఇది ఒక వైఙ్ఞానికపరమైన, తాత్వికపరమైన, ఉపాసన పరమైన సంక్లిష్టమైన శాస్త్రం. సృష్టికి సంబంధించిన రహస్యం ఇందులో ఉంటుంది.కాలము, జ్యోతి (వెలుగు) ఈఓ రెండిటి యొక్క ప్రభావం ప్రాణ శక్తి మీదా, మనిషి జీవితం మీదా ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.
చీకటి వెలుగులు జీవితం లోని భాగాలే కావు. సృష్టి ఆద్యంతం వెంట ఉండే విషయాలు. వీటి మధ్య ఎన్నో ప్రక్రియలు, ఎన్నో యుగాలు. ఒకటి లేకుండా మరొక దానిని అధ్యయనం చేయటం కుదరదు. ఆ చీకటి గృహాలె ఈ రాహు కేతువులనబడే అప్రకాశ గ్రహాలు.ఒక గ్రహణం సంభవించినప్పుడు మూడు వరుసలోకి రావటం మనం చూస్తాం. గణిత శాస్త్రం ప్రకారం రెండు వస్తువుల మధ్య అతి తక్కువ దూరం ఒక తిన్ననైన గీత! అంటే ఒక గ్రహణం సంభవించినప్పుడు ఈ మూడు-సూర్యుడు, చంద్రుడు, భూమి అతి తక్కువ దూరం లోకి వస్తాయి.అప్పుడు పరస్పరం శక్తులను ఇచ్చి పుచ్చుకుంటాయి. దీనినే సినర్జీ అంటారు. ఈ సమయంలో వీటి మధ్యనున్న నీడ ఈ ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియకు మార్గం అవటం వలన ఒక ఛార్జ్ లా ఆ గ్రహణ సమయంలో పని చేస్తుంది. దీనినే మహర్షులు రాహువు లేదా కేతువు అని చెప్పి దాని తాలూకు స్పందన-మంత్రాన్ని దర్శించి మనలో జరిగే స్పందనకు అనుగుణంగా జపించి యున్నారు. ఈ రోజు భాషలో దీనిని మనం మోడరేషన్ అంటాము! 1980-81 లో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం సమయం లో రైలు వస్తున్నప్పటికీ చిన్న పిట్టలు పట్టాల మీద నుంచి కదలలేదు!…
గోచారంలో మరి గ్రహణం అని చెప్పిన రోజున ఆ రాశిలో రాహువో కేతువో ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. అంటే అసలు గ్రహణ నిర్ణయం మహర్షులు అంత సూటిగా ఎలా చెప్పారూ అంటే రాహు కేతువుల స్థానం బట్టి, వాటి సంచారాన్ని బట్టి, సూర్య చంద్రుల సంచారాన్ని బట్టి అని అర్థం!
అంటే రాశి చక్రం అనేది కెవలం మన జన్మ కుండలి కాదు.ఇది సృష్టి యావత్తునూ ప్రదర్శించే 360 డిగ్రీల కుండలి! ఇదే సిమెట్రీ! ఒక వృత్తం ఎంత పెద్దదైనా కావచ్చును. దాని కేంద్రం ఒకటే! అది కూడా వృత్తమే! సృష్టిలోని అతి పెద్దది-అనంతం, అతి చిన్నది కూడా అనంతమే! మరి గణితం కూడా అదే చెబుతుంది.
1/10=10/100=100/1000…
ఇలా నేను ఒకటి ప్రక్కన న్యూమరేటర్ లో అనంతమైన సున్నలకు ఒకటి తక్కువగా పెట్టి డినోమినేటర్ లో ఒకటి ప్రక్కన అనంతమైన సున్నాలు పెట్టినా ఆ ఫలం 1/10 మాత్రమే!
శాస్త్రం రాహువుకు అధిదేవత దుర్గ యని, ప్రత్యధిదేవత నాగదేవతయని, కెతువుకు అధిదేవత చిత్రగుప్తుడని, ప్రత్యధిదేవత బ్రహ్మ యని చెబుతున్నది. రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతువు మహర్దశ 7 సంవత్సరాలని మనకు తెలిసినదే!
మొదటి స్థానం(లగ్నం లో)లో ఉంటే ధైర్యవంతులు,సహాయం చేయు వారు,కానీ కొద్దిగా ముఖం మీద మచ్చలు ఉండు వారు ఉంటారు.
రెండులో ఉంటే ఎక్కువగా విందులు చేయు వారు,నల్లని వారుగానూ,వివాహేతర సంబంధాలు కోరు వారు కనిపిస్తూ ఉంటారు.
మూడులో ధనవంతులు,మంచి క్రీడాకారులు, సాహసాలు చేయు వారు అవుతారు.
నాలుగులో ఉన్నప్పుడు బహు భాషా కోవిదులు, అయిదులో ఉన్నప్పుడు క్రూర స్వభావం గల వారు, గర్భం విషయంలో సమస్యలు ఎదుర్కొనటం, ఆరులో ఉన్నప్పుడు పెద్ద బంధు వర్గం కల వారు,శత్రు రహితులు గానూ,ఏడులో ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఆరోగ్య భంగం,చక్కెర జబ్బు,మంచి భొజనం కలుగ చేస్తాడు. ఎనిమిదిలో సంకుచితమైన ఆలోచనలు,పోట్లాటలంటే ఇష్ట పడే వ్యక్తిత్వం,తొమ్మిదిలో భయపడే వ్యక్తిత్వం, పదిలో ఉన్నప్పుడు మంచి కళాకారులు,యాత్రికుదు,రచయితలు తయారవుతారు.పదకొండులో ధనవంతులు,సంఘంలో గౌరవం కల వారు,మంచి సంతానం కల వారు,వ్యవసాయదారులు ముందుకు వస్తారు.
పన్నెండులో ఉన్నప్పుడు తాత్విక పరులు,కళ్ల జబ్బులు ఉన్నవారు ముందుకు వస్తారు.
కేతువు లగ్నంలో ఉంటే ఎక్కువగా చెమట పూయటం,మంచి ప్రజా సంబంధాలు ఉందటం, రెండులో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవటం, శాంత స్వభావం,మూడులో శక్తిమంతులు,పేరు గలవారు, నాలుగులో గొడవలు పెట్టుకునే వారు,అయిదులో పిల్లలకు ఇబ్బందులు కలుగచేయటం,ఆరులో మాటకారితనం,ఏడులో భాగస్వామికి సమస్యలు,ఎనిమిదిలో నిదానం, తొమ్మిదిలో చత్వారం, మంచి జీవిత భాగస్వామి,పదిలో తాత్విక చింతన,పదకొండులో మంచి హాస్యం,ధనం, పన్నెండులో విదేశ యానం ఇలాంటివి కనిపిస్తాయి.
సామాన్యంగా రాహు కేతువులు అప్రకాస గ్రహాలు కాబట్టి ఏ రాశిలో ఉంటాయో, ఆ రాశి యొక్క అధిపతి ఇచ్చు ఫలితాలని ఇస్తాయి.
ఇక్కడ చెప్పిన ఫలితాలు నామ మాత్రానివే. ఒక జాతకంలో అన్ని విషయాలనూ, గ్రహాలనూ పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రాకూడదు!
రాహువు విష ప్రయోగాన్నీ, అర్థం కాని అనారోగ్యాన్నీ సృష్టిస్తాడు.కెతువు పుండ్లను శాసిస్తాడు. రాగువు కేతు నక్షత్రంలో (అస్విని, మఖ, మూల) ఉంటే దారుణమైన ఏక్సిడెంట్లను ఇస్తాడు. ఆ దశలో జాగ్రత్త వహించాలి. రాహువు ఆర్ద్ర 3, 4 పాదాలలో ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. నాల్గవ పాదంలో ఉంటే చెడు అలవాట్లకు లోనవుతారు.అలాగే స్వాతి మొదటి, నాలుగు పాదాలలో రాహువు ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాహువు శతభిషం రెందవ పాదంలో ఉంటే కోపిష్ఠి, మూడవ పాదంలో ఉంటే కాలేయ సమస్యలున్నవారు ఉంటారు.కేతువు అస్విని మూడవ పాదంలో ఉంటే ఆరోగ్యం విషయం లో జాగ్రత్త వహించాలి.అలాగే మఖ 1,2,3 పాదాలలో ఉన్నా అనారోగ్యం,మూల 1,2 లో ఉన్నా జాగ్రత్త వహించాలి.
రాహు కేతువులు ఎవరి దశలో ప్రవేశించినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి దశలలో ముఖ్యంగా గుండె విషయంలొనూ, విష జ్వరాల విషయంలొనూ జాగ్రత్త వహించాలి.
కొందరు మిత్రులు లగ్నం లెదా చంద్రుడు బయట ఉన్నప్పుడు ఈ దోషం ఉంటుందా అని అడిగారు.
వివాహం విషయంలో దీనిని కూడా పరిగణించటం మంచిదని శాస్త్రం చెబుతున్నది. కారణం ఏమిటంటే యోగాలు చంద్రుని బట్టి ఎక్కువ గణన లోకి వస్తాయి కాబట్టీ, మరల గోచారం చంద్రుని నుంచి నిర్ణయిస్తాము కాబట్టీ నివారణ చేయటం అవసరం అవుతుంది.కొన్ని గ్రంథాలలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒక్కో స్థానాన్ని గణించి డిగ్రీలు కూడా లెక్క లోకి తీసుకుని ఆ స్థానం ఫలించనప్పుడు రాహు కెతువుల మధ్య వచ్చాయా అనే సంగతి కూడా చూడటం జరుగుతున్నది. అంత అవసరం లేకపోయినా ఇంత చాలు. తమిళ నాడులో ఒక ఆచారం ఉంది. దోషం ఉన్నా, లెకపోయినా వివాహ వయసు వచ్చిన కన్యలందరికీ నివారణ చేయిస్తారు…
19.04. నుంచి 25.04.09 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
18 ఏప్రి 2009 1 వ్యాఖ్య
in శ్రీ-ఫలములు
శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు!
ఈ వారం గ్రహస్థితి ఇలా ఉంది: రవి మేషం, బుధుడు మేష వృషభ రాశులు, గురు రాహువులు మకరం, శుక్ర కుజులు మీనం, శని సింహం, కేతువు కర్కాటకం, చంద్రుడు మకర, కుంభ, మీన, మేష రాశులలో సంచరిస్తారు.
ఈ వారం మన రాష్ట్రంలో కీలకమైన రెండవ విడత పోలింగు జరుగనున్నది. 23 ఏప్రిల్ గురించి ఆ రోజుకి చర్చించవచ్చు!
మామూలుగా ఈ వారం అందరికీ మంచి ఫలితాలున్నాయి. విద్యావంతులకు, కళాకారులకు మంచి అవకాశాలున్నాయి. అలాగే శాస్త్రవేత్తలు కొత్త విషయాలను బయట పెట్టగలరు.
వారం ప్రారంభ సమయంలో ఉన్న గ్రహస్థితి కొన్ని విషయాలను బయట పెడుతున్నది. రవి, బుధులు ఆ తరువాత కుజుడు ఎవరి జాతకంలోనైనా ప్రబలంగా ఉంటే పోటీలలో సత్ఫలితాలు ఉండగలవు.
శని జాతకంలో యోగకారకుడై ఉంటే వీరితో పోటీ వలన అధికారం చేతికి వచ్చే సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి…
మేష రాశి: ఈ వారం ఉత్సాహంతోనూ, కొంత అర్థం లేని ఆలోచనలతోనూ ప్రారంభమవుతుంది. మనుషులందరినీ ఒక్క పూటలో మార్చేయగలం అనుకుని ప్రవర్తిస్తారు. నిజం నిలకడ మీద తెలుసుకుంటారు. శారీరిక శ్రమ తగ్గించుకోవాలి. అందరినీ స్కేలుతో కొలవటం మానేసి ఆనందంగా ఉంటే జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవగలదు! శ్రీసూక్తం చదవండి.
వృషభ రాశి: వృషభ రాశి: రాజకీయాలలోని వారికి మంచి వారం. స్త్రీలు సుముఖంగా ఉంటారు. మీ ఇంటిలోని వారు విరిధ్ధంగా ప్రవర్తిస్తారు. బాధ పడకండి. ఏదైనా సాధించే వారికి ఇంటిలో ముందు అంతా విరుధ్ధమే! ఆదాయం బాగుంటుంది. నరాల విషయంలో జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామం పఠించండి.
మిథున రాశి: ఆగిపోయిన పనులు మెల్లగా మరల జోరు పుంజుకుంటాయి. అదృష్టం కలసి వచ్చే వారం. స్థిరాస్తుల అమ్మకాలు లాభిస్తాయి. బంధువులు దగ్గరవుతారు. సోదరీమణుల ఆరోగ్య పరిస్థితి బాధ పెడుతుంది. ఉద్యోగ యత్నాలు లాభిస్తాయి. పరిశోధనా రంగంలో ఉనవారికి మంచి వారం. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కర్కాటక రాశి: జీవిత భాగస్వామి వలన లాభం కనపడుతున్నది. గూఢమైన రహస్యాలను తెలుసుకుంటారు. సంతానం అభ్వృధ్ధిలోకి వస్తుంది. మానసిక ప్రవృత్తులు మారుతున్న కాలం. జరిగినవి, జరగబోయేవి కళ్లకు కట్టినట్లుగా కనిపించే వారం. దైవ చింతన చేయండి. శివునికి అభిషేకం చేయండి.
సింహ రాశి: బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. నోటి దుడుసు, మొండి వైఖరి తగ్గించుకోవాలి. ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన వారం. ఒంటి కణత నొప్పి ఉన్న వారు, స్త్రీలు విశ్రాంతి తీసుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకోండి.
కన్య రాశి: మంచి వార్త వింటారు. ఆదాయం మెల్లగా పుంజుకుంటుంది. పాత స్నేహితులు కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా పడగలవు. విచారించకండి. రేపటి గురించి ఆలోచన అవసరం లేదు. దైవ బలం బాగుంది. ఉపాసన మార్గం అవలంబించండి. ఒకటి రెండు పెద్ద పనులు చేతికి వస్తాయి. ఒప్పుకోండి. శ్రీ వేంకటేశ వజ్ర కవచం చదువుకోండి.
తుల రాశి: ఇది చిత్రమైన వారం. ఒకటే జరుగుతుందని మీరు అనుకుంటే రెండు జరిగే వారం. ఎంచుకోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులు ఉన్నా సకాలంలో డబ్బు అందగలదు. వ్యాపారంలో భాగస్వామ్యం ప్రస్తుతం లాభించదు. హనుమాన్ చాలీసా చదవండి.
వృశ్చిక రాశి: ఆరోగ్యం కుదుట పడుతుంది.విద్యార్థులు చంచల బుధ్ధి మానుకుంటే మంచి ఫలితాలున్నాయి. భూ వివాదాల జోలికి ప్రస్తుతం వెళ్లకపోవటమే మంచిది. కొందరికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉండవచ్చు. గోవుకు గ్రాసం వేయండి. దుర్గా సూక్తం వినండి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
ధను రాశి: స్థాన చలనం ఉండవచ్చును. ప్రస్తుతం ఒక పని ఇష్టం లేదనిపించవచ్చును. జాగ్రత్తగా ఆలోచించండి. అది మంచి పని. చేయండి. మీ మీద అభాండం వేయాలని కొందరు అనుకోవచ్చు. మీరు మాట్లాడాలని అలా చేస్తున్నారేమో! సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి!
మకర రాశి: మిమ్మలను బాధ పెట్టిన వారు తలచుకుని బాధ పడతారు. మీ కౌశలం మంచి పేరు తీసుకుని వస్తుంది. ఏది ఏమైనా మాటలు తగ్గించాలి. వారాంతంలో శుభ కార్యం తలపెడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. త్రయోదశి రోజున శివాలయానికి వెళ్లండి.
కుంభ రాశి: కనిపించిన ప్రతి వారి మాటలూ నమ్మేయటం మీకు కొంత కాలంగా అలవాటయిపోయింది. ఇలా సాగిపోయినందుకు ఒక సమస్య ఎదురవ్వ వచ్చును. ఏ విషయానికైనా ఇప్పుడే విశ్లేషణ అవసరం అనుకోవటం పొరపాటు. కుల దైవం మీద దృష్టి పెట్టి ధ్యాన మార్గాన్ని అవలంబించండి. సమస్యలు మాయమవుతాయి.
మీన రాశి: స్త్రీలు స్త్రీలకు సంబంధించిన వ్యాధుల విషయం లో జాగ్రత్త వహించాలి. ఆదాయం బాగుంటుంది. వారాంతంలో ఇంటిలోని వారి సమస్యలు, ఇంటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ ఇంటిలోకి కొత్త వస్తువులు రాబోతున్నాయి. విద్యార్థులకు బాగుంది. లలితా సహస్రనామం చదవండి.
~~~***~~~
ఈ వారం మంచి మాట:
బురా జొ దేఖన్ మై చలా బురా న మిలియా కోయి
జో దిల్ ఖోజా ఆపనా ముఝ్ స బురా న కోయి
-కబీర్
చెడ్డవాడిని వెతుకుతూపోయాను. ఒక్కడూ దొరకలేదు. నా మనస్సును వెతికాను. నా అంత చెడ్డవాడు ఎవడూ లేదని తెలిసింది!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
(If you want to view predictions in English based on Sun Signs, please browse http://sripatiastro.blogspot.com)
రాహు కేతువులు
18 ఏప్రి 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు
మిత్రులకు మనవి:
ఈ రోజు (18.04.2009) సాక్షి దినపత్రికలో సన్నిధి సప్లిమెంటులో నేను రాహు కేతువుల మీద వ్రాసిన వ్యాసం చదవగలరు.
-వేదాంతం శ్రీపతి శర్మ
ఫొటో క్విజ్ 81-వేదాంతం శ్రీపతి శర్మ
18 ఏప్రి 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

స్కూలులో చదువుకుంటున్నప్పటి ఒక ప్రముఖుడు ఈ ఫొటోలో ఉన్నాడు. గుర్తు పట్టారా?
Identify the prominent person who is seen as a student in this photo
ఫొటో క్విజ్ 80-సమాధానం
18 ఏప్రి 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!
మంగళగిరి-నృసింహ క్షేత్రం
Mangalagiri-Shrine of Sri Narasimha

ఇటీవలి అభిప్రాయములు