ఓ’స్కార్ ‘-వేదాంతం శ్రీపతి శర్మ

 

 

స్లం డాగ్ అనుకున్నంత పనీ చేసింది! ఓ-’ స్కార్ ‘ కాదు చాలా తెచ్చింది. తెచ్చుకున్న వాటికి అందరికీ అభినందనలు కూడా తెలుపుదాం. తప్పు లేదు. ఎవరి శ్రమ వారిది. ఐ-న్యూస్ లో రచయిత కస్తూరి మురళీకృష్ణ గారు బాధ పడుతూ ఒక్క ప్రక్క పాపం చాలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒక ప్రక్క ఆ సినిమా తాలూకు క్లిప్పింగులు అలా సాగిపోతూనే ఉన్నాయి. అవార్డులు వస్తే ఇది మన మీద ఒక ‘క్రూయల్ జోక్ ‘ కాగలదని కూడా ఆయన అనేశారు. అది అలా కొనసాగిపోతూనే ఉంది.ఏదో జరిగినంత మాత్రాన నిజం చెప్పకుండా ఉండటం సరైనది కాదు. నిజం చెప్పాలి. ముఖ్యంగా రచయితలకు అంతరార్థం ముందు స్ఫురించటం వలన ముందుగా, తొందరగా బాధ పడతారు. ఏమిటి నీ గోల అని అనుకుంటారు…ఇదా నీ బాధ అనే లోపు అంతా అయిపోతుంది! ఆర్థర్ స్కోపెణవర్ ఒక మాట అన్నాడు. సత్యమనేది మూడు దశల మీదుగా ప్రయాణిస్తుంది. మొదటిది దానిని అందరూ నవ్వుల పాలు చేస్తారు. రెండు, దానిని విపరీతంగా ఖండిస్తారు. మూడు, ఇది వాస్తవానికి స్వయంప్రకాశమై వెలుగుతోందని ఒప్పుకుంటారు. ఈ అవార్డులు వెలుగుతున్నాయి-నిజం కూడా వెనుక తదుపరి చరిత్రలో వెలుగుతుంది!

~~~***~~~

అదలా ఉంచుదాం. రైల్ లోంచి  కరంచంద్-కర్మసిధ్ధుడు తోసేయబడ్డాడు. సత్యాగ్రహం అనేది పుట్టింది…

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు ఒక మాట అన్నాడు. ముంబయి లోని పాల కంటే లండన్ లోని డ్రైనేజ్ నీరు ఉత్తమమైనది అని! ఈ మాట కురియన్ గారి గుండెకు బాణంలా గుచ్చుకుంది. గుజరాత్ లో ఆయన సాధించినది అందరికీ తెలిసినదే!

~~~***~~~

స్వాతంత్ర్యం రాక ముందు మకాలే (లార్డ్ అని నేను అనను. వీళ్లెవరు?)
భారత దేశపు నలు మూలలా తిరిగి ఒక నివేదికను సమర్పించాడు. అందులో ఉన్న మొదటి మాట-ఈ దేశంలో పేదరికం ఉండవచ్చు
 కానీ గరీబులు ఎవరూ లేరు!వీరి ఆత్మాభిమానం ఎనలేనిది. వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయాలీ అంటే వీరికి స్వంతం కాని భాష-ఆంగ్లం లో శిక్షణ
 ఇచ్చి అది రాని వారు తక్కువగా చూడ బడేటట్లు చేయాలి….ఆ పథకం లో ప్రవేశ పెట్టిన ఈ విద్యా వ్యవస్థ ఈ నాటికీ
 ఆంగ్లేయుల విజయపు బావుటా ఎగురవేస్తూనే ఉంది.

ముసుగులో గుద్దులాటలు మాని గడచిన చరిత్ర లోంచి ఇవతలకి వచ్చి డాబా మెట్లు ఎక్కి నిజమైన ఆకాశం లోకి ఒక సారి చూద్దాం.చూడలేకపోవటం బానిసత్వం! హృదయ విదారకం!

~~~***~~~

పడ్డ వాడు చెడ్డ వాడు కాడు. వాళ్లను, వాళ్ల సినిమాలను ప్రక్కన పెడదాం. శేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని కాళిదాసును అనటం కాదు. మన దేశాన్ని మనం పునర్నిర్మిద్దాం. మన అద్వితీయమైన, అజరామరమైన సంస్కృతి నుంచి ఒక అవార్డును మనం ప్రకటించి వాళ్లకి ఇద్దాం…

~~~***~~~

మరో తరంలోనైనా ఇది జరిగితే నేను ఎక్కడున్నా
 మన జెండాకు వందనం చేసుకుంటాను. మన యువకులు సిధ్ధమా?

అభిప్రాయములు (+add yours?)

  1. Nayani Aditya Madhav
    Feb 23, 2009 @ 10:58:20

    I am ready. The day will come. :)

    జవాబు

  2. Pradeep
    Feb 23, 2009 @ 12:37:39

    కుల రాజకీయాలు నిర్మూలించబడిన మరుక్షణం మీరు కోరుకున్నది సాధ్యమే
    రిజర్వేసన్లు ఎత్తివేసిన నాడు మీరన్నది సాధ్యమే
    వ్యక్తిగత పొగడ్తల కోసం సినిమా తీసేవారు అలాగే వారి భట్రాజు గణాలు పోయినప్పుడు మీరన్నది సాధ్యమే
    ఏదేమైనా … ఆ గమ్యానికి రహదారి వెయ్యాల్సిన భాద్యత నేటి తరానిది అంటే మాది, ముందు తరం వారి సలహాలు సూచనలు సహకారాలు ఉంటే ఎంత దూరమైనా దూసుకుపోతాం

    జవాబు

    • srikaaram
      Feb 23, 2009 @ 13:49:49

      బాగా చెప్పారు! గడ్డరికా ప్రవాహానికి భిన్నంగా ఒకరిద్దరు యోచించినా కొత్త వెలుగులు చూపించవచ్చును. Keep it up!
      శ్రీపతి

      జవాబు

  3. athram
    Feb 23, 2009 @ 21:06:39

    మీరు ఏదురు చూస్తున్న రోజు ఏంతో దూరంలో లేదు..
    ఈ ఒక్క విషయమే కాదు ప్రతీ విషయంలో మన యువత చాలా ముందుంది.

    జవాబు

  4. bonagiri
    Feb 24, 2009 @ 08:26:57

    ఇలాంటి సినిమాలు కావాలని భారతీయులని అవమానించడానికే తీస్తారేమోనని నా అనుమానం.
    పదేళ్ళ కిందట ఫైర్ సినిమా చూసాను. అందులోనూ అంతే. మనం టాయిలెట్లలో జంతువుల్లా కూర్చుంటామట.
    అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ బాపతు సినిమాలు చూడను అని.

    అరింధం చౌధరి అభిప్రాయాలు కూడా చదవండి.

    ఇంత కంటే మన లగాన్, చక్ దే ఇండియా, స్వదేశ్ మొదలైనవి ఉత్తమమైనవని నా అభిప్రాయం.
    ఆఖరుకి యండమూరి చిరంజీవి ల చాలెంజ్ కూడా ఈ సినిమా కంటే బెటరు.

    జవాబు

  5. కొత్తపాళీ
    Feb 24, 2009 @ 15:10:06

    మీ శైలి బాగుంది.
    మనకున్న సంస్కృతిక వారసత్వ సంపదని ఆస్వాదిస్తూ వైభవోపేతంగా చూసుకోవడమే గాక, ఒకనాడు సకలప్రపంచానికి మార్గదర్శకమైన ఆలోచనలకీ సిద్ధాంతాలకీ పురిటి గడ్డయిన భారత దేశాన్ని మళ్ళీ నిర్మించుకుందాం.

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.