కొంత వేదాంతం-వేదాంతం శ్రీపతి శర్మ
23 Feb 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు

కొద్ది కాలం క్రితం పుణె లోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినయిరింగ్ కాపస్ లో నా మిత్రుడితో కొద్ది రోజులు గడిపాను. రాత్రి మెస్ లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడ చదువుకుంటున్న కెప్టెన్ రాంకు వాళ్లు కొందరు మాతో కూర్చునే వారు. నన్ను సరదాగా కాళ్లూ చేతులూ చూసి భవిష్యత్తు చెప్పమనే వారు (కాళ్లు చూడలేదు లెండి!). మీకెందుకండీ, మీరు ఆర్మీ లోని వారు, అన్నాను. అప్పుడు ఒకాయన అదే కాంపస్ లో జరిగిన కథ ఒకటి చెప్పాడు. ఇలాగే నలుగురూ రాత్రి చాలా సేపు కూర్చున్నారు. చివరకు ఒకాయన సెకండ్ షో సినిమాకి వెళదాము అన్నాడట. ఆలోచించి అందరూ మోటార్ బైకుల మీద బయలు దేరారు. ఎందుకో అసలు మొదలు పెట్టిన వ్యక్తి కొంత ముందుకు వెళ్లి ‘ నేను రాను, నాకు వెళ్లిపోవాలని ఉన్నది ‘ అన్నాడుట. చాలా సేపు ఏమైంది అని చర్చించి చివరకు అతన్ని సరే వెళ్లమని వాళ్లు అటు రోడ్డు ఎక్కారు, ఇతను ఇటు వెనక్కి తిరిగాడు. అంతే! పెద్ద శబ్దం వినిపించింది. వెనక్కు చూస్తే అతన్ను లారీ గుద్దేసింది…పాపం అంతలోనే ఎక్కడికో వెళ్లిపోయాడు!
~~~***~~~
హెన్రీ ఫోర్డ్ ఒక చోట వ్రాశాడు-నాకు 26 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పూర్జన్మ సిధ్ధాంతాన్ని పట్టుకున్నాను. మన పనిలోని అనుభవాన్ని మరో జన్మలో వాడుకోలేకపోతే మనకి ఈ పనులు ఎందుకు? పునర్జన్మను కనుక్కున్నాక నాకు ఒక సార్వజనికమైన సత్యం కనిపించింది. సమయం ఎంత ఉంది అనేది నన్ను ఇక బాధించలేదు. ఈ జన్మలో కొందరు వారి వయసు కంటే పెద్ద వారు-కారణం, వారు గత జన్మలనుంచి చాలా తిసుకుని వస్తున్నారు!
~~~***~~~
జ్యోతిష శాస్త్రం ఈ జన్మ గురించే చెప్పదు. ఒక చక్రంలో ఉన్న 360 డిగ్రీలు 120 చొప్పున గత జన్మ, ఈ జన్మ, మరు జన్మ గురించి చెబుతాయి. కాకపోతే ఇది లీనియర్ గా మూడు 120 లు కాదు. కలసి పోయి ఉంతుంది. అంటే ఈ జన్మలో గత జన్మలోని ముద్రలు, రాబోవు జన్మలోని తరంగాలు అందంగా ఇమిడి ఉంటాయి!
ఇది మామూలుగా ఎప్పుడన్నా అనుభవించవచ్చును గదా అని ఒక మిత్రుడు నన్ను అడిగాడు. వచ్చు…అన్నాను!
ఎప్పుడైనా ఏ కారణం లేకుండా ఏ వార్తా వినకుండా ఆనందం కలిగిందా? అలాగే ఏ సమస్యా లేకుండా ఆందోళన కలిగిందా? కలిగి ఉండవచ్చును.
అది ఈ రెండిటికీ సంబంధించినది. ఒక్కో సారి కొన్ని చోట్లకు వెళ్లినప్పుడు ఇక్కడికి ఎప్పుడో వచ్చాను అనిపిస్తుంది. ఒక వ్యక్తి అంటే తెలియకుండానే ఆప్యాయత, లేదా అయిష్టం ఏర్పడవచ్చును. ఇవన్నీ ముద్రలు, తరంగాలే!
~~~***~~~
ఒకరు మీ మధ్యలో ఉన్నప్పటికీ అతనిని గుర్తు పెట్టుకునే ఉంటూ గుర్తించకుండా ఉండటం, ఒకరిని మరచిపోయి కూడా విస్మరించకుండా ఉండటం-ఇది ఒక ఊగుడు బల్ల లాంటి విన్యాసం…ప్రయత్నించండి. చేయగలిగితే రెండూ చేయగలరు. లేకపోతే ఏదీ చేయలేరు!
అందుచేత ఈ జన్మలోని సమయాన్ని వృధా చేయవలసిన పని లేదు. సత్కర్మయే తదుపరి కర్మను చేయమని ప్రేరేపిస్తుంది. సూర్యోదయం ముందు నిద్ర లేచి చూస్తే ఒక సత్కర్మ మన ముందు ఉంటుంది. సత్కర్మల చేత దుష్కర్మ ఘర్మమును మాయం చేసే అవకాశం లేకపోతే వేదం సూర్యుడు కర్మలను చేయమని ప్రేరేపిస్తాడు అని ఎందుకు చెబుతుంది?
అందు చేత జీవన యానం, ఆత్మ ప్రయాణం-ఈ రెండూ ఊగుడు బల్ల మీద ఉండగా రెండిటినీ బాలెన్స్ చేసే ఫల్క్రం కర్మయే గానీ మరొకటి కాదు!
~~~***~~~
ఓ’స్కార్ ‘-వేదాంతం శ్రీపతి శర్మ
23 Feb 2009 అభిప్రాయములు
in వార్తాలాపం

స్లం డాగ్ అనుకున్నంత పనీ చేసింది! ఓ-’ స్కార్ ‘ కాదు చాలా తెచ్చింది. తెచ్చుకున్న వాటికి అందరికీ అభినందనలు కూడా తెలుపుదాం. తప్పు లేదు. ఎవరి శ్రమ వారిది. ఐ-న్యూస్ లో రచయిత కస్తూరి మురళీకృష్ణ గారు బాధ పడుతూ ఒక్క ప్రక్క పాపం చాలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒక ప్రక్క ఆ సినిమా తాలూకు క్లిప్పింగులు అలా సాగిపోతూనే ఉన్నాయి. అవార్డులు వస్తే ఇది మన మీద ఒక ‘క్రూయల్ జోక్ ‘ కాగలదని కూడా ఆయన అనేశారు. అది అలా కొనసాగిపోతూనే ఉంది.ఏదో జరిగినంత మాత్రాన నిజం చెప్పకుండా ఉండటం సరైనది కాదు. నిజం చెప్పాలి. ముఖ్యంగా రచయితలకు అంతరార్థం ముందు స్ఫురించటం వలన ముందుగా, తొందరగా బాధ పడతారు. ఏమిటి నీ గోల అని అనుకుంటారు…ఇదా నీ బాధ అనే లోపు అంతా అయిపోతుంది! ఆర్థర్ స్కోపెణవర్ ఒక మాట అన్నాడు. సత్యమనేది మూడు దశల మీదుగా ప్రయాణిస్తుంది. మొదటిది దానిని అందరూ నవ్వుల పాలు చేస్తారు. రెండు, దానిని విపరీతంగా ఖండిస్తారు. మూడు, ఇది వాస్తవానికి స్వయంప్రకాశమై వెలుగుతోందని ఒప్పుకుంటారు. ఈ అవార్డులు వెలుగుతున్నాయి-నిజం కూడా వెనుక తదుపరి చరిత్రలో వెలుగుతుంది!
~~~***~~~
అదలా ఉంచుదాం. రైల్ లోంచి కరంచంద్-కర్మసిధ్ధుడు తోసేయబడ్డాడు. సత్యాగ్రహం అనేది పుట్టింది…
కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు ఒక మాట అన్నాడు. ముంబయి లోని పాల కంటే లండన్ లోని డ్రైనేజ్ నీరు ఉత్తమమైనది అని! ఈ మాట కురియన్ గారి గుండెకు బాణంలా గుచ్చుకుంది. గుజరాత్ లో ఆయన సాధించినది అందరికీ తెలిసినదే!
~~~***~~~
స్వాతంత్ర్యం రాక ముందు మకాలే (లార్డ్ అని నేను అనను. వీళ్లెవరు?)
భారత దేశపు నలు మూలలా తిరిగి ఒక నివేదికను సమర్పించాడు. అందులో ఉన్న మొదటి మాట-ఈ దేశంలో పేదరికం ఉండవచ్చు
కానీ గరీబులు ఎవరూ లేరు!వీరి ఆత్మాభిమానం ఎనలేనిది. వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయాలీ అంటే వీరికి స్వంతం కాని భాష-ఆంగ్లం లో శిక్షణ
ఇచ్చి అది రాని వారు తక్కువగా చూడ బడేటట్లు చేయాలి….ఆ పథకం లో ప్రవేశ పెట్టిన ఈ విద్యా వ్యవస్థ ఈ నాటికీ
ఆంగ్లేయుల విజయపు బావుటా ఎగురవేస్తూనే ఉంది.
ముసుగులో గుద్దులాటలు మాని గడచిన చరిత్ర లోంచి ఇవతలకి వచ్చి డాబా మెట్లు ఎక్కి నిజమైన ఆకాశం లోకి ఒక సారి చూద్దాం.చూడలేకపోవటం బానిసత్వం! హృదయ విదారకం!
~~~***~~~
పడ్డ వాడు చెడ్డ వాడు కాడు. వాళ్లను, వాళ్ల సినిమాలను ప్రక్కన పెడదాం. శేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని కాళిదాసును అనటం కాదు. మన దేశాన్ని మనం పునర్నిర్మిద్దాం. మన అద్వితీయమైన, అజరామరమైన సంస్కృతి నుంచి ఒక అవార్డును మనం ప్రకటించి వాళ్లకి ఇద్దాం…
~~~***~~~
మరో తరంలోనైనా ఇది జరిగితే నేను ఎక్కడున్నా
మన జెండాకు వందనం చేసుకుంటాను. మన యువకులు సిధ్ధమా?
ఫోటో క్విజ్34-సమాధానం
23 Feb 2009 అభిప్రాయములు
in శ్రీ-సరదాలు!

ఇది త్రిపురాంతకం
This is Tripurantakam
ఇటీవలి అభిప్రాయములు