22.02.2009 నుంచి 28.02.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
22 Feb 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్త కళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహ చంచరీక: నిరంతరం మంగళమాతనోతు!
22.02.2009 నుంచి 28.02.2009 వరకు రాశి ఫలాలు
ఈ వారం గ్రహ స్థితి ఇలా ఉంది-గురు, బుధ, రాహు, కుజులు మకరం లో,రవి కుంభం లో, శుక్రుడు మీనంలో, శని సింహంలో , కేతువు కర్కాటకంలో, చంద్రుడు మకర, కుంభ, మీన రాశులలో సంచరిస్తారు.
ఈ గ్రహస్థితి మంచి యోగాలను సూచిస్తున్నది. కొన్ని దుర్ఘటనలు సంభవించవచ్చును. ఒక మతపరమైన గురువు గారు వార్తలలోకి ఎక్క వచ్చును. రాజకీయ నాయకులకు మంచి ఉత్సాహకరమైన వారం. స్త్రీల మధ్య విభేదాలు, బంధువుల మధ్య మనస్పర్థలు కనిపిస్తున్నాయి.
మేష రాశి: ఎన్నో పనులు చేయటానికి ముందుకు వస్తారు. నూతన ఉత్సాహం చూపిస్తారు. ఖర్చులు బాగానే చేస్తారు. దైవ దర్శనం లాభిస్తుంది. ఆదిత్య హృదయం చదవండి.
వృషభ రాశి: ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.ఇంటిలో మరమ్మత్తులు చేపాతారు. దూరపు బంధువు ఇంటికి రావ్వచ్చును. ఈ గురువారం ఒక మంచి వార్త వింటారు. శ్రీసూక్తం పారాయణ చ్గేయండి.
మిథున రాశి: మీ అనుచరులు మీ నుంచి చాలా కోరుకుంటున్నారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రధ్ధ వహించాలి. వారాంతంలో ప్రయాణం సంభవం. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కర్కాటక రాశి:మీ వ్యవహారం ఎందుకో చాలా మందికి అర్థం కాదు. దానికి మీ వింత చేష్టలే కారణం! మనసు విప్పి మాట్లాడండి. సమస్యలు దూరమవుతాయి. విదేశాలలో ఉన్న వారు జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.
సింహ రాశి: నీరసం బాధిస్తుంది. ఉద్యోగాలలో మార్పులు జరుగవచ్చును. మీ పై వారితో జాగ్రత్తగా మసలుకోవాలి. ఆదాయం వ్యయం సమానంగా ఉంటాయి. మౌనం వహించండి. అతిశయం ప్రదర్శించటం మంచిది కాదు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
కన్య రాశి: కొత్త పనులకు మంచి వారం. కళలు, సాంస్కృతిక రంగం లోని వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రీసూక్తం పారాయణ చేయండి.
తుల రాశి: పట్టుదలలు పెరుగుతున్నాయి. సన్నిహితులు దూరమవుతున్నారు. చింతించకండి. ఇంటిలో దొంగతనాలు జరుగవచ్చును. జాగ్రత్త వహించండి. శివునికి అభిషేకం చేయించండి.
వృశ్చిక రాశి: మీరు వ్రాసిన ఒక లేఖ సమస్యలను తెచ్చి పెట్టగలదు. ఏదైనా సంతకం చేసే ముందు రెండు సార్లు చదవండి. ఊపిరి తిత్తుల సమస్య ఉన్న వారు శ్రధ్ధ వహించాలి. గోవునకు గ్రాసం వేయండి.
ధను రాశి: డబ్బు, పెట్టుబడుల విషయంలో ఎంతో ఆలోచన అవసరం. కొద్ది కాలం మార్కెట్ కు దూరం గానే ఉండటం మంచిది. వివాదాలలో తల దూర్చకండి. వాహన యోగం ఉన్నది. నృసింహ స్వామిని ఆరాధించండి.
మకర రాశి: ఆరోగ్యం మెరుగు పడుతుంది. గృహ నిర్మాణాలలో ఉన్న వారు జాగ్రత్తలు వహించాలి. వాహనాలు నడిపే వారు సాహసాలు చేయ కూడదు. ఋణాలు అందుతాయి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.
కుంభ రాశి: ప్రజల మధ్య ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటలు ఎంతో గౌరవాన్ని తెచ్చి పెడతాయి. ముందు చూపు లాభిస్తుంది. ఇంటి దొంగలతో జాగ్రత్త వహించాలి. హనుమాన్ చాలీసా పఠించండి.
మీన రాశి: అన్ని విషయాలలో ఈ వారం చాలా బాగుంది. పదోన్నతి సంభవం. మీ ఆలోచనలు సరైనవే. ముందుకు వెళ్లండి. స్త్రీలు ఎక్కువ శ్రమించకూడౌ. ఒంటి కణత నెప్పి బాధించగలదు. లలితా సహస్రనామం చదవటం గానీ వినటం గానీ చేయండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: మనోహి హేతు: సర్వేషామింద్రియాణాం ప్రవర్తనే
శుభాశుభాస్వవస్థాసు తంచ మే సువ్యవస్థితం
(వాల్మీకి రామాయణం, సుందర కాండ-11.42)
అన్ని ఇంద్రియములలో శుభాశుభ పరిస్థితుల వైపు ప్రేరేపించునది మనస్సే. కాని ఆ నా మనస్సు పూర్తిగా స్థిరముగా ఉన్నది. ( రావణుని స్త్రీలను సందర్శించిన సమయంలో ఆంజనేయుడు తనకు తాను చెప్పుకున్న మాట!)
ఓం శాంతి: శాంతి: శాంతి:
ఇటీవలి అభిప్రాయములు